TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ .. ఇకపై మంగళసూత్రాల విక్రయం.. మరోవైపు దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు

అన్నమయ్య భవన్‌తో పాటు.. కాటేజీల ఆధునీకరణ, సప్తగిరి సత్రాల అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించింది. అలాగే టీటీడీలో ఒరాకిల్ ఫ్యూషన్ క్లౌడ్ సాఫ్ట్ వేర్ వినియోగానికి ఆమోదం తెలిపారు. అటు విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశంలోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దుర్గమ్మ దర్శనానికి.. ఎలివేటెడ్ క్యూలైన్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది దుర్గగుడి పాలకమండలి. కొండపైన పూజా మండపాలు నిర్మాణానికి కూడా ఓకే చెప్పింది.

TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ .. ఇకపై మంగళసూత్రాల విక్రయం.. మరోవైపు దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు
Ttd Mangalsutra
Follow us
Surya Kala

|

Updated on: Jan 30, 2024 | 6:52 AM

తిరుమల తిరుపతి దేవస్థానం.. భక్తుల కోసం మంగళసూత్రాలు విక్రయించేందుకు నిర్ణయం తీసుకుంది. శ్రీవారి పాదాల చెంత పూజలు చేసి.. వాటిని కొత్త జంటలకు అందించనున్నారు. శ్రీవారికి వచ్చే బంగారు కానుకలతో.. 5, 10గ్రాముల మేర మంగళసూత్రాలు తయారు చేయించాలని.. టీటీడీ పాలకమండలి భేటీలో నిర్ణయించారు. ఇక 2024-25కు సంబంధించి.. 5 , 141 కోట్లతో 2024-25 టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది పాలకమండలి.

టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపారు. టీటీడీలో పనిచేసే వివిధ విభాగాల్లో ఉద్యోగులకు జీతాలు పెంచేందుకు పాలకమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 60 ఆలయాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. స్విమ్స్ ఆస్పత్రిని 300 పడకల నుంచి 1200 పడకల పెంపునకు ఆమోదం తెలిపింది టీటీడీ బోర్డ్. అన్నమయ్య భవన్‌తో పాటు.. కాటేజీల ఆధునీకరణ, సప్తగిరి సత్రాల అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించింది. అలాగే టీటీడీలో ఒరాకిల్ ఫ్యూషన్ క్లౌడ్ సాఫ్ట్ వేర్ వినియోగానికి ఆమోదం తెలిపారు.

అటు విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశంలోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దుర్గమ్మ దర్శనానికి.. ఎలివేటెడ్ క్యూలైన్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది దుర్గగుడి పాలకమండలి. కొండపైన పూజా మండపాలు నిర్మాణానికి కూడా ఓకే చెప్పింది. ఘాట్ రోడ్డు మరమ్మతు పనులతో పాటు.. అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామన్నారు దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్‌లో రెండు షిఫ్టుల్లో దుర్గగుడి ప్రసాదం కౌంటర్లు అందుబాటులో ఉంటాయన్నారు. బైట్ః కర్నాటి రాంబాబు, దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్

ఇవి కూడా చదవండి

ఫిబ్రవరి 18వ తేదీ నుంచి శివాలయంలో దర్శనాలు ప్రారంభం అవుతాయన్నారు ఛైర్మన్. వచ్చే దసరా నాటికి మాస్టర్ ప్లాన్‌లోని నిర్మాణాలకు ఒక రూపం తెస్తామని చెప్పారు. గిరిప్రదక్షిణ మార్గంలో భక్తులకు ఉచిత బస్సును త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఆలయ అధికారులు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..