AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో వాస్తు దోషమా.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో శంఖాన్ని ఎలా ఉంచాలంటే..

శంఖం లేని కొన్ని పూజలు అసంపూర్ణంగా పరిగణించబడతాయి. చాలా మంది తమ ఇంటిలోని పూజ గదిలో శంఖం పెట్టుకోవడానికి ఇష్టపడతారు. శాస్త్రాల ప్రకారం.. ఇంట్లో ఎన్ని శంఖాలు ఉంచాలి.. కేవలం ఒక శంఖం సరిపోతుంది లేదా ఒకటి కంటే ఎక్కువ శంఖం ఉంచాలా..  ఏ రకమైన శంఖం పూజకు శ్రేయస్కరం. ఈ రోజు వివరంగా తెలుసుకుందాం.

Vastu Tips: ఇంట్లో వాస్తు దోషమా.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో శంఖాన్ని ఎలా ఉంచాలంటే..
Vastu Tips
Surya Kala
|

Updated on: Jan 30, 2024 | 7:22 AM

Share

హిందువులకు శంఖం అత్యంత విశిష్టమైనది. పూజలో శంఖాన్ని ఉపయోగించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఏదైనా మతపరమైన లేదా శుభకార్యాలు ప్రారంభించే సమయంలో శంఖం ఊది ప్రారంభిస్తారు. శంఖం లేని కొన్ని పూజలు అసంపూర్ణంగా పరిగణించబడతాయి. చాలా మంది తమ ఇంటిలోని పూజ గదిలో శంఖం పెట్టుకోవడానికి ఇష్టపడతారు. శాస్త్రాల ప్రకారం.. ఇంట్లో ఎన్ని శంఖాలు ఉంచాలి.. కేవలం ఒక శంఖం సరిపోతుంది లేదా ఒకటి కంటే ఎక్కువ శంఖం ఉంచాలా..  ఏ రకమైన శంఖం పూజకు శ్రేయస్కరం. ఈ రోజు వివరంగా తెలుసుకుందాం.

 పూజలో ఎన్ని శంఖాలు ఉండాలంటే..?

శాస్త్రాల ప్రకారం ఇంటిలోని పూజా గదిలో లేదా పూజా మందిరంలో పూజలో ఒక శంఖం మాత్రమే ఉంచాలి. అదే విధంగా పూజకు ఉపయోగించే శంఖాన్ని మరే కార్యక్రమంలో వినియోగించరాదు. ముఖ్యంగా పూజా ప్రారంభంలో శంఖాన్ని ఊదేందుకు మరొక శంఖాన్ని అందుబాటులోకి పెట్టుకోవాలి. ఎందుకంటే శంఖం ఊదేటప్పుడు నోటిలో పెట్టాలి.. కనుక ఇది ఎంగిలి అవుతుంది. కనుక మళ్ళీ ఈ శంఖాన్ని పూజ కోసం వినియోగించరాదు. పూజ గదిలో ఉంచిన శంఖాన్ని ఊదకూడదు. పూజ సమయంలో ఊదడానికి మరో శంఖం వాడాలి. అందుచేత ఇంట్లో రెండు శంఖాలు పెట్టుకోవాలి. ఆలయంలో పూజకు ఒక శంఖం, పూజ సమయంలో ఊదడానికి మరొకటి అన్నమాట.

వాస్తు దోషాలను నివారించే మార్గాలు

రాత్రిపూట పూజ శంఖాన్ని నీటితో నింపి ఉంచి, ఉదయాన్నే ఇంటిలో ఈ నీటిని చల్లాలి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్మకం.

ఇవి కూడా చదవండి

శంఖంతో ఇంట్లో పూజ

విశ్వాసాల ప్రకారం పూజకు దక్షిణావర్తి శంఖాన్ని మాత్రమే ఉపయోగించాలి. దక్షిణావర్తి శంఖం లక్ష్మీ దేవి వాస్తవ రూపం అని నమ్ముతారు. కనుక దక్షిణావర్తి శంఖాన్ని పూజలో ఉపయోగించడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, సిరి సంపదలను లక్ష్మీ దేవి అనుగ్రహంతో కలుగుతాయని విశ్వాసం. అందువల్ల ఈ శంఖం పూజకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

శంఖాన్ని ఎరుపు రంగు గుడ్డతో కప్పి ఉంచండి.

హిందూ మత విశ్వాసాల ప్రకారం పూజ కోసం పూజ గదిలో ఉంచిన శంఖం ఇతరులకు కనిపించకూడదు. కుటుంబ సభ్యులు మాత్రమే ఈ శంఖాన్ని దర్శించి పూజించాలి. కనుక శంఖాన్ని పూజ అనంతరం ఎప్పుడూ శుభ్రమైన ఎరుపు రంగు వస్త్రంతో కప్పి ఉంచాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని  ఇంట్లో ఐశ్వర్యం, శ్రేయస్సు ఉంటాయని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు