Viral Video: ప్రపంచంలోనే తొలిసారిగా.. అయోధ్య రామమందిరానికి అపూర్వ కానుక.. వెండి చీపురును బహుమతిగా ఇచ్చిన భక్తబృందం..

అవును బాల రాముని గర్భగుడిని శుభ్రం చేయడానికి 1.751 కిలోల బరువున్న వెండి చీపురును బహుమతిగా ఇచ్చింది భక్త బృందం. ఈ వెండి చీపురు తయారీకి11 రోజుల సమయం పట్టిందట. చీపురు పైభాగంలో లక్ష్మీ దేవి చిత్రం కూడా చెక్కబడి ఉంటుంది. ఈ వెండి చీపురులో 108 పుల్లలు ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Viral Video: ప్రపంచంలోనే తొలిసారిగా.. అయోధ్య రామమందిరానికి అపూర్వ కానుక.. వెండి చీపురును బహుమతిగా ఇచ్చిన భక్తబృందం..
Silver Broom
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 30, 2024 | 5:19 PM

జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో బలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. లక్షలాది హిందువుల రామమందిర కల సాకారమైంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభమైనప్పటి నుండి, భక్తులు వివిధ రూపాల్లో రామమందిరానికి విరాళాలు అందజేస్తున్నారు. దేశం నలుమూలల నుంచి రామమందిరానికి కానుకల వరద వెల్లువెత్తింది. భారీ తాళం చేయి, పంచధాతువులతో చేసిన అతిపెద్ద దీపం, భారీ గంట, వజ్రాల హారం, బంగారు పూత పూసిన బ్యాండ్, 108 అడుగుల అగరుబత్తీ, పాదుకె, వెండి ఇటుక తదితర వస్తువులు తీసుకొచ్చారు. ఇప్పుడు అఖిల భారత మోంగ్ సమాజ్ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు వెండి చీపురును బహుమతిగా ఇచ్చింది.

అవును ఆల్ ఇండియా మోంగ్ సమాజ్ బాల రాముని గర్భగుడిని శుభ్రం చేయడానికి 1.751 కిలోల బరువున్న వెండి చీపురును బహుమతిగా ఇచ్చింది. ఈ వెండి చీపురు తయారీకి11 రోజుల సమయం పట్టిందట. చీపురు పైభాగంలో లక్ష్మీ దేవి చిత్రం కూడా చెక్కబడి ఉంటుంది. ఈ వెండి చీపురులో 108 పుల్లలు ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

అఖిల భారత మోంగ్ సమాజ్ సభ్యుడు మధుకర్ రావు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే తొలి వెండి చీపురును శ్రీరాముడికి అంకితమిచ్చామన్నారు. అయోధ్యలో రామ్‌ లల్లా ప్రాణ ప్రతిష్ట రోజు అయిన జనవరి 22న దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకున్నారని చెప్పారు.. దీపావళి రోజున లక్ష్మీదేవి రూపంలో చీపురు పూజిస్తారు. అందుకే ఆల్ ఇండియా మాంగ్ సమాజ్ శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు వెండి చీపురును కానుకగా ఇచ్చినట్టుగా వెల్లడించారు.

ఈ వీడియోను వార్తా సంస్థ ANI తన X ఖాతాలో, “ఆల్ ఇండియా మోంగ్ సమాజ్ రామ భక్తులు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు వెండి చీపురును విరాళంగా ఇచ్చారని వ్యాఖ్యానించింది. గర్భగుడిని శుభ్రపరచడానికి మాత్రమే ఉపయోగించమని అభ్యర్థిస్తున్నారు” అనే శీర్షికతో షేర్ చేయబడింది. వైరల్ వీడియోలో, 108 కర్రలతో కూడిన వెండి చీపురును భక్తులు పెద్ద ఊరేగింపుగా రామమందిరానికి తీసుకువెళ్లడం చూడవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..