AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణ హత్యకు గురైన బీజేపీ నేత.. 15 మంది నిందితులకు ఉరిశిక్ష విధించిన కోర్టు..

కేరళ 2021లో ఒక వ్యక్తిని 12 మందితో కూడిన ముఠా అతి కిరాతకంగా నరికి చంపింది. హత్య జరిగిన కాసేపటికి వరకు హత్యకు గురైంది ఎవరన్నది అక్కడే ఉన్న స్థానికులకు కూడా తెలియదు. కాసేపటికి తేరుకుని అక్కడున్న స్థానికులు వెళ్లి చూడగా అందరూ షాక్ అయ్యారు. దాడికి గురైంది కేరళ బిజెపిలోని ఓబీసీ నాయకుడు రంజిత్ శ్రీనివాసన్ అని తెలిసింది. దాడి జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు.

దారుణ హత్యకు గురైన బీజేపీ నేత.. 15 మంది నిందితులకు ఉరిశిక్ష విధించిన కోర్టు..
Bjp Obc Leader Ranjith Srin
Ch Murali
| Edited By: Srikar T|

Updated on: Jan 30, 2024 | 4:28 PM

Share

కేరళ 2021లో ఒక వ్యక్తిని 12 మందితో కూడిన ముఠా అతి కిరాతకంగా నరికి చంపింది. హత్య జరిగిన కాసేపటికి వరకు హత్యకు గురైంది ఎవరన్నది అక్కడే ఉన్న స్థానికులకు కూడా తెలియదు. కాసేపటికి తేరుకుని అక్కడున్న స్థానికులు వెళ్లి చూడగా అందరూ షాక్ అయ్యారు. దాడికి గురైంది కేరళ బిజెపిలోని ఓబీసీ నాయకుడు రంజిత్ శ్రీనివాసన్ అని తెలిసింది. దాడి జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు. ఆ కేసులో విచారణ పూర్తయింది. సెషన్ కోర్టు ఈ కేసులో తాజాగా తీర్పును వెలువరించింది.

2021 డిసెంబర్ 19.. కేరళలోని అలప్పుర పట్టణంలోని వెల్లకినార్ ప్రాంతానికి చెందిన రంజిత్ శ్రీనివాసన్ అక్కడే నివాసం ఉంటున్నారు. ఈయన బీజేపీలో ఓబీసీ నాయకుడు. అతని ఇంట్లోకి చొరబడ్డ 12 మందితో కూడిన ముఠా కుటుంబ సభ్యుల ముందే మారణాయుధాలతో విచక్షణ రహితంగా దాడి చేసింది. ముఠా ఇంట్లోకి చొరబడ్డ సందర్భంలో అందరూ దాడికి భయపడి పరుగెత్తి వెళ్లారు. ఎవరో ఆ ఇంట్లో దాక్కొనే ప్రయత్నం చేశారనుకున్న స్థానికులు ఇదే విషయాన్ని పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చే లోపే దారుణం జరిగిపోయింది. రంజిత్ అక్కడికక్కడే మరణించారు. ఆ తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

రంజిత్ శ్రీనివాసన్ ఒంటిపై 56 కత్తి పోట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. హత్యలు పాల్పడింది నిషేధిత తీవ్రవాద సంస్థ అయిన SDPI అని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు విచారణ చేపట్టారు. దాడిలో పాల్గొన్న 12 మంది తోపాటు సూత్రదారులతో కలిసి మొత్తం 15 మంది నిందితులు ఉన్నట్లు గుర్తించారు. అంతకుముందు రోజు SDPI రాష్ట్ర కార్యదర్శి కే.ఎస్ షాన్‎ను ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు చేసిన హత్యకు ప్రతీకారంగా రంజిత్ హత్య జరిగినట్లు నిర్ధారించారు. రెండేళ్లపాటు జరిగిన విచారణలో సాక్షాధారాలను సేకరించిన పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఈనెల 20 న 15 మందిని హాంతకులుగా న్యాయస్థానం గుర్తించింది. దీంతో జనవరి 30న హత్యకు పాల్పడిన 15 మందికి మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది.

ఇవి కూడా చదవండి
Accused

Accused

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..