Chandigarh Mayor Election: తొలి ఎన్నికల్లోనే ఇండియా కూటమి ఓడిపోయింది.. జేపీ నడ్డా కీలక ట్వీట్..

విప‌క్ష ఇండియా కూట‌మికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇండియా కూట‌మి పోటీ చేసిన తొలి ఎన్నిక‌ల్లో ఓటమి పాలయ్యింది. చండీఘ‌ఢ్ మేయర్ ఎన్నిక‌ల్లో విప‌క్ష కూటమిపై బీజేపీ ఘన విజ‌యం సాధించింది. బీజేపీ అభ్యర్ధి మ‌నోజ్ కుమార్ సోంక‌ర్ ఆప్‌-కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్ధి కుల్దీప్ సింగ్‌పై విజ‌యం సాధించారు. ఎక్స్అఫిషియో స‌భ్యుడు కిర‌ణ్ ఖేర్ ఓటుతో స‌హా మ‌నోజ్ సోంక‌ర్‌కు 16 ఓట్లు వచ్చాయి.

Chandigarh Mayor Election: తొలి ఎన్నికల్లోనే ఇండియా కూటమి ఓడిపోయింది.. జేపీ నడ్డా కీలక ట్వీట్..
JP Nadda
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 30, 2024 | 1:58 PM

విప‌క్ష ఇండియా కూట‌మికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇండియా కూట‌మి పోటీ చేసిన తొలి ఎన్నిక‌ల్లో ఓటమి పాలయ్యింది. చండీఘ‌ఢ్ మేయర్ ఎన్నిక‌ల్లో విప‌క్ష కూటమిపై బీజేపీ ఘన విజ‌యం సాధించింది. బీజేపీ అభ్యర్ధి మ‌నోజ్ కుమార్ సోంక‌ర్ ఆప్‌-కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్ధి కుల్దీప్ సింగ్‌పై విజ‌యం సాధించారు. ఎక్స్అఫిషియో స‌భ్యుడు కిర‌ణ్ ఖేర్ ఓటుతో స‌హా మ‌నోజ్ సోంక‌ర్‌కు 16 ఓట్లు వచ్చాయి. 35 మంది స‌భ్యులు క‌లిగిన చండీఘ‌ఢ్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో బీజేపీ 16 స్ధానాల‌ను గెలుపొందింది. ఈ ఎన్నికలో బీజేపీకి 16 ఓట్లు రాగా, ఇండియా కూటమికి 12 ఓట్లు వచ్చాయి. 8 ఓట్లు రద్దయ్యాయి.

రద్దయిన ఓట్లు ఇండియా అలయన్స్ పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవి. భారత కూటమికి 20 మంది బలం ఉండగా, వారికి కేవలం 12 ఓట్లు వచ్చాయి. 8 ఓట్లు రద్దవ్వడం సంచలనంగా మారింది. కౌంటింగ్ సమయంలో ప్రిసైడింగ్ అధికారి ఏజెంట్‌ను ముందుకు రానివ్వలేదని, ఈ సందర్భంగా ఆయన పెన్నుతో కొన్ని మార్కింగ్‌లు చేశారని, ఆ తర్వాత ఓట్లను రద్దు చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లు ఆరోపిస్తున్నాయి. బీజేపీని ఓడించాలన్న ల‌క్ష్యంతో ఆప్‌-కాంగ్రెస్ కూట‌మి చెమ‌టోడ్చినా విప‌క్ష కూట‌మికి చుక్కెదురైంది.

వారి స్ట్రాటజీ పనిచేయలేదు.. జేపీ నడ్డా..

చండీఘ‌ఢ్ మేయర్ ఎన్నిక‌ల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక ట్వీట్ చేశారు. చండీగఢ్ లో బీజేపీ విజయం సాధించడం పట్ల అభినందనలు తెలిపారు. మేయర్ ఎన్నికల్లో గెలుపు కోసం యూనిట్ తీవ్రంగా కృషి చేసిందన్నారు. ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో యూటీలు రికార్డు స్థాయిలో అభివృద్ధిని సాధించాయన్నారు. INDIA అలయన్స్ మొదటి ఎన్నికల యుద్ధంలో పోరాడి.. BJP చేతిలో ఓడిపోయిందంటూ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో వారి స్ట్రాటజీ.. భాగస్వామ్య అంచనా పని చేయలేదని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..