Tech layoffs: టెక్ సంస్థల్లో మళ్లీ మొదలైన లేఆఫ్‌ల పర్వం.! మైక్రోసాఫ్ట్ నుంచి 1900 మంది తొలగింపు.
టెక్ రంగంలో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. గత ఏడాది టెక్ రంగంలో అనిశ్చితి నెలకొంది. అది ఈ ఏడాదికూడా కొనసాగేలా కనిపిస్తోంది. గతేడాదిని లేఆఫ్ సంవత్సరంగా మార్చిన టెక్ సంస్థలు చూస్తుంటే ఈ ఏడాది కూడా దానిని కొనసాగించేలా కనిపిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహా సేల్స్‌ఫోర్స్, లెవిస్ స్ట్రాస్, స్విగ్గీ వంటి సంస్థలు వందలాదిమంది ఉద్యోగులను తొలిగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.
టెక్ రంగంలో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. గత ఏడాది టెక్ రంగంలో అనిశ్చితి నెలకొంది. అది ఈ ఏడాదికూడా కొనసాగేలా కనిపిస్తోంది. గతేడాదిని లేఆఫ్ సంవత్సరంగా మార్చిన టెక్ సంస్థలు చూస్తుంటే ఈ ఏడాది కూడా దానిని కొనసాగించేలా కనిపిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహా సేల్స్‌ఫోర్స్, లెవిస్ స్ట్రాస్, స్విగ్గీ వంటి సంస్థలు వందలాదిమంది ఉద్యోగులను తొలిగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ డివిజన్‌లో 1900 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్టు ప్రకటించింది. ఆ సంస్థలో మొత్తం 22 వేల మంది ఉద్యోగుల్లో ఇది దాదాపు 8 శాతం. ఇక సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ సేల్స్‌ఫోర్స్ మరోమారు ఉద్యోగుల తొలగింపునకు తెరలేపింది. 700 మందిని తొలగిస్తున్నట్టు తెలిపింది. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో గతేడాది 8 వేల మందిని ఇంటికి పంపిన సేల్స్‌ఫోర్స్ ఈ ఏడాది ప్రారంభంలోనే ఒకశాతం ఉద్యోగులపై వేటుకు సిద్ధమైంది. దుస్తుల తయారీ కంపెనీ లెవిస్ స్ట్రాస్ తన వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో దాదాపు 15 శాతం మందిని తీసేస్తున్నట్టు ప్రకటించింది. ఇక, దేశీయ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా టెక్నాలజీ, కాల్ సెంటర్, కార్పొరేట్ విభాగాల్లో పనిచేస్తున్న 400 మందిని తొలగించాలని నిర్ణయించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

