AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌తో వైరం పెట్టుకున్న మాల్దీవులకు మరో షాక్!! అగ్రస్థానం నుండి ఐదో స్థానంలోకి..

అవును.. మాల్దీవుల ప్రభుత్వ దురహంకారంతో మాల్దీవుల్లో కలకలం రేగుతోంది. అంతకుముందు పార్లమెంటు లోపల నేతలు పోరాడుతున్న వీడియో వైరల్‌గా మారి దేశ పరువును వేలం వేసింది. ఇదిలా ఉంటే పర్యాటక పరంగా మాల్దీవులకు మరో షాక్ తగిలింది. సహాజమైన ప్రకృతి అందాలతో పర్యాటకుల్ని అలరించే మాల్దీవులకు భారతదేశం నుండి

భారత్‌తో వైరం పెట్టుకున్న మాల్దీవులకు మరో షాక్!! అగ్రస్థానం నుండి ఐదో స్థానంలోకి..
Maldives
Jyothi Gadda
|

Updated on: Jan 30, 2024 | 3:01 PM

Share

Maldives : పర్యాటక ప్రాంతం విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీని దూషిస్తూ భారత్‌పై విద్వేషం చూపిన మాల్దీవులకు ఇప్పుడు మరో షాక్ తగిలింది. అవును.. మాల్దీవుల ప్రభుత్వ దురహంకారంతో మాల్దీవుల్లో కలకలం రేగుతోంది. అంతకుముందు పార్లమెంటు లోపల నేతలు పోరాడుతున్న వీడియో వైరల్‌గా మారి దేశ పరువును వేలం వేసింది. ఇదిలా ఉంటే పర్యాటక పరంగా మాల్దీవులకు మరో షాక్ తగిలింది. సహాజమైన ప్రకృతి అందాలతో పర్యాటకుల్ని అలరించే మాల్దీవులకు భారతదేశం నుండి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. మాల్దీవుల పార్లమెంటు అభిశంసన తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత పర్యాటక శాఖ జాబితాను విడుదల చేసింది. ద్వీప దేశానికి చెందిన పర్యాటక శాఖ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

మాల్దీవుల పర్యాటకానికి భారతదేశం అతిపెద్ద సహకారాన్ని అందిస్తూ వచ్చింది. మాల్దీవులకు మన దేశం నుండి పెద్ద ఎత్తున పర్యాటకులు వెళ్లేవారు. ఈ నెల 28 నాటికి అధికారిక గణాంకాల మేరకు భారతీయ సందర్శకులలో గణనీయమైన తగ్గుదల కన్పిస్తుంది. గతంలో అగ్రస్థానంలో ఉన్న భారత పర్యాటకుల సంఖ్య ప్రస్తుతం 5వ స్థానానికి పడిపోయింది. ఈ విధంగా, జనవరి నెలలో మాల్దీవులకు ప్రయాణించిన మొత్తం పర్యాటకుల సంఖ్య 174,400. కాగా, వీరిలో భారతీయుల సంఖ్య 13,989. భారతీయ పర్యాటకుల సంఖ్య 8 శాతం క్షీణించింది. ఈ నెల 28 నాటికి అధికారిక గణాంకాల మేరకు భారతీయ సందర్శకులలో గణనీయమైన తగ్గుదల కన్పిస్తుంది.

మాల్దీవుల ప్రభుత్వం డేటా విడుదల చేసిన గణాంకాలు

ఇవి కూడా చదవండి

1. రష్యా: 18,561 మంది పర్యాటకులు ( 10.6 శాతం మార్కెట్ వాటా, 2023 లో ర్యాంక్ లో రెండో స్థానం)

2. ఇటలీ: 18,111 పర్యాటకులు (మార్కెట్ లో 10.4 శాతం, 2023లో ఆరో ర్యాంక్)

3. చైనా: 16,529 పర్యాటకులు(మార్కెట్ లో 9.5 శాతం వాటా, 2023లో మూడో ర్యాంక్)

4. యూకే: 14,588 పర్యాటకులు( మార్కెట్ లో 8.4 శాతం, 2023లో నాలుగో ర్యాంక్)

5. భారత్ : 13,989 పర్యాటకులు (మార్కెట్ లో 8.0 శాతం వాటా, 2023లో ర్యాంక్ 1)

6. జర్మనీ: 10,652 పర్యాటకులు (మార్కెట్ లో 8.0 శాతం వాటా)

7. అమెరికా: 6,299 పర్యాటకులు (మార్కెట్ లో 3.6 శాతం వాటా, 2023లో ఏడో ర్యాంక్)

8. ఫ్రాన్స్:6,168 పర్యాటకులు (మార్కెట్ లో 3.5 శాతం వాటా, 2023లో ఎనిమిదో ర్యాంక్)

9. పోలాండ్: 5,109 పర్యాటకులు(మార్కెట్ లో 2.9 శాతం వాటా, 2023లో 14వ, ర్యాంక్)

10. స్విట్జర్లాండ్: 3,330 పర్యాటకులు (మార్కెట్ లో 1.9 శాతం వాటా, 2023లో 10వ, ర్యాంక్)

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…