Health Tips: ఆఫీస్ వర్క్‌తో అలసిపోతున్నారా..? రిలీఫ్ కోసం ఈ ఐదు పనులు చేయండి…
జంతా గంటల తరబడి పని ఒత్తిడితో బిజీగా ఉండటం వల్ల మీరు శారీరకంగా అలసిపోయినట్లు అనిపించినపుడు విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటితో మీరు మీ అలసటను ఇట్టే దూరం చేసుకోవచ్చు. అంతేకాదు.. కరోనా తర్వాత చాలా మంది ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారు. ఇంట్లో ఒకే చోట కూర్చుని పని చేయడం వల్ల కూడా నడుము నొప్పి, అలసటతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి
ఏ ఉద్యోగం చేసినా అందరూ రోజంతా కష్టపడాల్సిందే. పొద్దున్నే లేచి ఉద్యోగానికి వెళ్లడం, ప్రయాణం చేయడం, రోజంతా పని చేయడం, ఇంటికి తిరిగి వెళ్లడం ఇవన్నీంటి మధ్య చాలా మంది శారీరకంగా అలసిపోతారు. రోజంతా గంటల తరబడి పని ఒత్తిడితో బిజీగా ఉండటం వల్ల మీరు శారీరకంగా అలసిపోయినట్లు అనిపించినపుడు విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటితో మీరు మీ అలసటను ఇట్టే దూరం చేసుకోవచ్చు. అంతేకాదు.. కరోనా తర్వాత చాలా మంది ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారు. ఇంట్లో ఒకే చోట కూర్చుని పని చేయడం వల్ల కూడా నడుము నొప్పి, అలసటతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు ఆఫీసు వర్క్ లేదంటే, వర్క్‌ఫ్రం హోం ఏదైనా సరే.. పని తర్వాత అలసిపోయినట్లు అనిపిస్తే ఈ చిట్కాలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి.
పని తర్వాత అలసట నుండి బయటపడటానికి ఈ క్రింది నివారణలను తప్పకుండా ప్రయత్నించండి…
* స్నానం చేయండి: అలసట నుండి ఉపశమనం పొందేందుకు ఇంటికి రాగానే స్నానం చేయడం మంచిది. ఇది మీకు తాజా అనుభూతిని కలిగిస్తుంది. మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
* వాకింగ్‌కి వెళ్లండి: ఆఫీసు పని ముగించుకుని ఇంటి రాగానే బయట కాసేపు వాకింగ్ చేయండి..ఇది అలసట నుండి బయటపడటానికి సహాయపడుతుంది.
* పాటలు వినండి: పని నుండి ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు మీకు ఇష్టమైన పాటలు వినండి.. ఇది మీ ఒత్తిడిని కొంత వరకు తగ్గిస్తుంది.
* ధ్యానం: కొంత సమయం ధ్యానం చేయండి. ధ్యానం మనస్సును కేంద్రీకరించడానికి సహాయపడుతుంది.
* ముఖ్యంగా కాసేపు మీ ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. ఇది మీ కళ్లకు విశ్రాంతినిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..