Andhra Pradesh: ఈ కేటుగాళ్లు మహా ముదుర్లు… ఆర్టీసీ బస్సుల్లో గంజాయి రవాణా… ఎలా చిక్కారంటే..?

Visakhapatnam: ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఏజెన్సీ నుంచి సిటీకి గంజాయి తరలిస్తున్న ప్లాన్ ను గుర్తించి.. వాటిపై నిఘాను మరింత ముమ్మరం చేశారు. ఆర్టీసీ సిబ్బందికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ చేస్తున్న పోలీసులు.. ఎటువంటి అనుమానం ఉన్నా సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. అయితే ఆర్టీసీ బస్సుల్లో తరలిస్తున్న.. వాళ్లు రోజువారి కూలీలే అని, అసలు ముఠాలు వెనకుండి నడిపిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా వారిని ట్రాక్ చేసే పనిలో పడ్డారు.

Andhra Pradesh: ఈ కేటుగాళ్లు మహా ముదుర్లు... ఆర్టీసీ బస్సుల్లో గంజాయి రవాణా... ఎలా చిక్కారంటే..?
Rtc Buses In Agency Area
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Jyothi Gadda

Updated on: Jan 29, 2024 | 6:46 PM

విశాఖపట్టణం, జనవరి 29; గంజాయి అనగానే.. టక్కున గుర్తొచ్చేది అల్లూరి ఏజెన్సీ. ఇప్పుడు ఏజెన్సీలో దాదాపుగా గంజాయిని నిర్మూలించినా.. ఆంధ్ర- ఒరిస్సా సరిహద్దులోని మారుమూల ప్రాంతాల్లో గంజాయి జాడలు గుప్పుమంటున్నాయి. దానికి తోడు ఒడిస్సా వైపు నుంచి గంజాయి.. ఏపీ పైనుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. దానికి అల్లూరి ఏజెన్సీ.. ఉమ్మడి విశాఖ జిల్లాలోని రుట్లను ఎంచుకుంటున్నారు స్మగ్లర్లు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి పై ఉక్కు పాదం మోపుతుండడంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ వర్గాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి. గంజాయి ముఠాలను పట్టుకొని కేసులు పెడుతున్నాయి. చాలామందిని ఇప్పటికే గంజాయి కేసుల్లో జైలుకు కూడా పంపించారు అధికారులు. గిరిజనులను కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ప్రత్యమ్నయ మార్గాల వైపు దారి చూపిస్తున్నారు. దింతో స్మగ్లర్ల మాయమాటల్లో పడిన గిరిజనులు.. ఇప్పుడు దాదాపుగా అల్లూరి ఏజెన్సీలో గంజాయి వైపు నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లారు.

ఒడిస్సా నుంచేనా…

– అయితే.. ఇప్పుడు ఒడిస్సా లో పండుతున్న గంజాయిని తరలించేందుకు కొంతమందిని కొరియర్లుగా మార్చుకుంటున్నారు. అల్లూరు ఏజెన్సీ రూట్లను తెలుసున్న వారికి ఎరచూపి.. గంజాయి అప్పగించి తరలించే సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. వాటిపైనా పోలీసులు, ఎస్ఈబి అధికారులు ప్రత్యేకంగా ద్రుష్టి సారించడంతో.. ఇప్పుడు ఎవరికి అనుమానం రాకుండా మరో మార్గాన్ని ఎంచుకుంటున్నాయి మత్తు ముఠాలు. మధ్యవర్తులను పెట్టి ఆర్టీసీ బస్సుల్లో గుడ్డు చప్పుడు కాకుండా గంజాయిని తరలించేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అలా అయితే తరలించడం ఈజీ అని..

– ఏఓబి నుంచి విశాఖ వరకు వచ్చేస్తే.. విశాఖ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించడం ఈజీగా భావిస్తున్న స్మగ్లర్లు.. అందుకు ప్రత్యేక మార్గాన్ని ఎంచుకున్నారు. ఘాట్ రోడ్ నుంచి అనకాపల్లి జిల్లా మీదుగా పెందుర్తి వైపు నుంచి సిటీ లోకి ఎంటర్ అయ్యే ఆర్టీసీ బస్సు రూట్లను ఎంచుకున్నారు. బస్సుల్లోనే ప్రత్యేకంగా మూటలు పెట్టి.. ఎవరికి అనుమానం రాకుండా బ్యాగుల్లో గంజాయిని కుక్కీ తరలించేస్తున్నారు. ప్రయాణికుల్లా ఒకసారి.. టూరిస్టుల్లా మరోసారి.. గుట్ట చప్పుడు కాకుండా గంజాయిని ఆర్టీసీ బస్సుల్లో సరిహద్దులు దాటించేస్తున్నారు.

ఒకే రూట్లో.. వారం వ్యవధిలో..

– తాజాగా వారం రోజుల వ్యవధిలో వరుసగా మూడు సార్లు గంజాయి కేసులను పట్టుకున్నారు పెందుర్తి పోలీసులు. ఒక కేసులో ముగ్గురిని… మరో కేసులో నలుగురిని.. ఇంకో కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో కేరళ తమిళనాడు రాష్ట్రంలో చెందిన వారు కూడా ఉన్నారు. స్థానికంగా ఉన్న వారి నుంచి గంజాయిని కొనుగోలు చేసి.. మధ్యవర్తులను పెట్టి ముఠాలు గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. బస్సులో తరలిస్తున్న పదుల కిలోల గంజాయిని స్వాదీనం చేసుకున్నామని అన్నారు పెందుర్తి సీఐ శ్రీనివాసరావు అన్నారు. ఇకనుంచి ఏజెన్సీ వైపు నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని.. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులపైనా నిఘా పెంచుతామన్నారు. ఇందుకోసం ఆర్టీసీ సిబ్బందిని సమన్వయం చేసుకుని గంజాయి స్మగ్లింగ్ కు చెక్ పెడతామన్నారు.

– ఆర్టీసీ బస్సుల్లో గంజాయి తరలించిన వ్యవహారం వెలుగులోకి రావడంతో.. పోలీసులే అవాక్కయ్యారు. ఇప్పటికే విశాఖ కేంద్రంగా గంజాయి స్టాక్ పాయింట్లను గుర్తించిన పోలీసులు.. ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఏజెన్సీ నుంచి సిటీకి గంజాయి తరలిస్తున్న ప్లాన్ ను గుర్తించి.. వాటిపై నిఘాను మరింత ముమ్మరం చేశారు. ఆర్టీసీ సిబ్బందికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ చేస్తున్న పోలీసులు.. ఎటువంటి అనుమానం ఉన్నా సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. అయితే ఆర్టీసీ బస్సుల్లో తరలిస్తున్న.. వాళ్లు రోజువారి కూలీలే అని, అసలు ముఠాలు వెనకుండి నడిపిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా వారిని ట్రాక్ చేసే పనిలో పడ్డారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..