చియా విత్తనాలు ఫైబర్ కు మంచి మూలం. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రొటీన్లు, వివిధ రకాల అవసరమైన పోషకాలు ఉంటాయి. అంతేకాదు.. ఈ చిన్న విత్తనాలు ఎన్నో ముఖ్యమైన పోషకాల భాండాగారం. వీటిలో కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, సెలీనియం, కాపర్, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. చియా సీడ్స్ తినడం వల్ల ఫిట్‌గా ఉండగలరనడంలో సందేహం లేదు. ఈ విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకుంటే మన పేగుల్లో మంచి బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. అయినప్పటికీ ఎక్కువ ఫైబర్ కొంతమందికి ఎన్నో సమస్యలను కలిగిస్తుంది.