- Telugu News Photo Gallery Business photos Finance Minister Nirmala Sitharaman Makes Budget 2024 Her Budget Army Key Members 5 Officer
Budget 2024: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 బడ్జెట్ టీమ్‌లో ఈ ఐదుగురు సభ్యులు కీలకం
ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది మోడీ ప్రభుత్వానికి మధ్యంతర బడ్జెట్. ఆ తర్వాత ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్‌ను సమర్పించనుంది. అయితే ఈ నిర్మలాసీతారామ్ రూపొందించిన 2024 బడ్జెట్ టీమ్‌లో ఈ ఐదుగురు సభ్యులు కీలకంగా వ్యవహరించారు..
Updated on: Jan 29, 2024 | 4:53 PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీ గురువారం పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆమె ఈసారి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు. అందువల్ల నరేంద్రమోడీ ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్ ప్రజాభిప్రాయంతో ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

దేశ బడ్జెట్‌ను రూపొందించడం అంత తేలికైన పని కాదు. నిర్మలా సీతారామన్‌కు 'బడ్జెట్' వెనుక ఎంతో మంది కృషి ఉంది. నిర్మలమ్మ బడ్జెట్ టీమ్‌లో ఐదుగురు సభ్యులు కీలకంగా ఉంది.

వి. అనంత్ నాగేశ్వరన్, భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు. ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేసిన ఈయన నిర్మలా సీతారామన్‌కు సన్నిహిత సలహాదారుగా పేరుంది.

సీతారామన్ బడ్జెట్ టీమ్‌లో ఒకరు ఆర్థిక మంత్రిత్వ శాఖలో సీనియర్ కార్యదర్శి టీవీ సోమనాథన్. 1987 బ్యాచ్ IAS అధికారి. సోమనాథన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ, వ్యయ శాఖ కార్యదర్శి.

తుహిన్ కాంత్ పాండే ప్రభుత్వ పెట్టుబడి కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్నారు. ఈ 1987 బ్యాచ్ అధికారి ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించడంలో, ఎల్‌ఐసిని జాబితా చేయడంలో కీలకపాత్ర పోషించారు.

సంజయ్ మల్హోత్రా. రెవెన్యూ కార్యదర్శి, ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఈ 1990 బ్యాచ్ అధికారి సీతారామన్ బడ్జెట్ ఆర్మీ సభ్యులలో ఒకరు.

అజయ్ సేథ్ ఆర్థిక వ్యవహారాల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి. ఆయన కూడా 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గత సంవత్సరం G20 విజయవంతంగా నిర్వహించడం, సావరిన్ గోల్డ్ బాండ్ ఇష్యూలో కీలక పాత్ర పోషించారు.




