- Telugu News Photo Gallery Business photos Budget 2024 finance minister Nirmala sitharaman networth and salary
Nirmala Sitharaman: ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఆస్తులు, జీతం ఎంతో తెలుసా..?
కేంద్ర ప్రభుత్వం మధ్యంత బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను సమర్పించనున్నారు. మోడీ ప్రభుత్వానికి ఇది మధ్యంతర బడ్జెట్. ఆ తర్వాత ఎన్నికలు జరుగనున్నాయి. తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అయితే ఈ బడ్జెట్‌పై, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌పై చర్చ జరుగుతోంది. .
Updated on: Jan 29, 2024 | 2:37 PM

ఫిబ్రవరి 1న మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో మధ్యంత బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇతర క్యాబినెట్ మంత్రులతో పోలిస్తే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆస్తులు చాలా తక్కువ. మైనేటా తెలిపిన వివరాల ప్రకారం ఆమె ఆస్తుల విలువ దాదాపు రూ.2,74,95,222.

సీతారామన్ లండన్‌లోని హాబిటాట్ సెంటర్‌లో సేల్స్‌పర్సన్‌గా పనిచేశారు. ఆమె అసోసియేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీర్స్ (UK)లో ఆర్థికవేత్తకు సహాయకురాలిగా కూడా పనిచేశాడు.

ఆమె ఎలాంటి పన్ను ఆదా పథకంలో పెట్టుబడి పెట్టలేదు. అదే సమయంలో నిర్మలాసీతారామన్‌కు 4 బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. ఇందులో దాదాపు రూ.8,44,935 జమ అయ్యాయి.

ఆమె తన భర్తతో జాయింట్ షేర్‌గా రూ.99.36 లక్షల విలువైన ఇంటిని, వ్యవసాయేతర భూమితో పాటు సుమారు రూ.16.02 లక్షల విలువైన భూమిని కలిగి ఉన్నట్లు తెలిసింది.

భారత ప్రభుత్వ జీతం డేటా ప్రకారం.. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ నెలవారీ జీతం దాదాపు రూ. 4,00,000 అని వెబ్‌సైట్‌లో పేర్కొంది.




