Watch Video: బాబోయ్… పుచ్చకాయలు ఇందుకు కూడా వాడతారా..! వీళ్ల మాస్టర్ మైండ్‌కు..
ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు.. ప్రజలు ఇప్పటికీ గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు అంటే అది వారి పిచ్చితనంగా ఆరోపించారు. పుచ్చకాయ లోపల డ్రగ్స్ స్మగ్లింగ్ ఐడియా మీకు ఎలా వచ్చింది గురూ.. చాలా బాగుంది.. ఇలా చేస్తే ఎవరూ గుర్తించలేరు అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యనించారు. స్మగ్లర్ల గురించి కొందరు పోలీసు ఇన్‌ఫార్మర్‌లకు
గంజాయి స్మగ్లింగ్‌కు సంబంధించిన పలు వార్తలు తరచూ వైరల్ అవుతుంటాయి. అనేక దేశాల్లో ఇది చట్టవిరుద్ధం.. కాబట్టి, కొందరు స్మగ్లరు దానిని అక్రమంగా రవాణా చేయడానికి వివిధ మార్గాలను అన్వేషిస్తుంటారు. గంజాయి స్మగ్లింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది మిమ్మల్ని షాక్ అయ్యేలా చేస్తుంది. స్మగ్లర్లు గంజాయిని దాచిపెట్టాలనే కొత్త ఆలోచన అందరిలో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వింత పద్ధతిని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. వైరల్ అవుతున్న వీడియోపై జనాలు ఘాటుగా స్పందిస్తున్నారు.
ఈ వీడియో X హ్యాండిల్ @Crazy Clipsలో షేర్ చేయబడింది. ఈ వీడియోలో పోలీసులు పుచ్చకాయను కోస్తుండటం మీరు చూస్తారు. కానీ కోసిన తర్వాత దాని లోపల నుండి పుచ్చకాయ రంగుతో కూడిన ఒక బ్యాగ్ బయటకు వస్తుంది. ఆ సంచి కట్ చేయగా అందులో గంజాయి నిండిపోయింది. లారీలో లోడ్ చేసిన పలు పుచ్చకాయలను కోసి.. పుచ్చకాయల్లో దాచి పెద్ద ఎత్తున గంజాయిని ఈ విధంగా అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో అంతకంతకూ వైరల్ అవుతోంది. ఈ ఘటన కొలంబియాలో చోటుచేసుకుంది. ఈ వీడియో 2020 నాటిదిగా తెలిసింది. జనవరి 28న @Crazy Clips ద్వారా షేర్ చేయబడింది. ఈ వీడియోని ఇప్పటికే 34 మిలియన్ల మంది వీక్షించారు. దీనిపై వేలాది మంది కామెంట్లు చేశారు.
Thousands of pounds of marijuana found hidden inside watermelons pic.twitter.com/zaeSqa6qRK
— Crazy Clips (@crazyclipsonly) January 27, 2024
ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు.. ప్రజలు ఇప్పటికీ గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు అంటే అది వారి పిచ్చితనంగా ఆరోపించారు. పుచ్చకాయ లోపల డ్రగ్స్ స్మగ్లింగ్ ఐడియా మీకు ఎలా వచ్చింది గురూ.. చాలా బాగుంది.. ఇలా చేస్తే ఎవరూ గుర్తించలేరు అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యనించారు. స్మగ్లర్ల గురించి కొందరు పోలీసు ఇన్‌ఫార్మర్‌లకు తెలిసి ఉండవచ్చునని మరొకరు రాశారు. ఏది ఏమైనా, ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు? దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..