Viral video: మెట్రోలో రచ్చ రచ్చ.. ఇద్దరు యువకుల మధ్య ముష్టి యుద్ధం..పాపం మూడో వాడు..! వీడియో చూస్తే పొట్ట చెక్కలే..
వైరల్ వీడియోలో ఇద్దరు ప్రయాణికుల మధ్య ఏదో వివాదం తలెత్తినట్టుగా తెలుస్తోంది. దాంతో ఇరువురు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే మూడో వ్యక్తి వీరి మధ్యలోకి వచ్చాడు..ఈ క్రమంలోనే వారి మధ్య తలెత్తిన వివాదం కాస్త ఘర్షణకు దారితీసింది.. ఆ తర్వాత గొడవ హింసాత్మకంగా మారడంతో ఇద్దరు ప్రయాణికులు మూడో వ్యక్తిని కార్నర్ చేసేందుకు ప్రయత్నించారు.
ఢిల్లీ మెట్రో మరోమారు వార్తల్లోకెక్కింది..ఈ సారి ఢిల్లీ మెట్రో రైలులో ముగ్గురు యువకులు ముష్టియుద్ధానికి పాల్పడ్డారు. జనవరి 27న ఆన్‌లైన్‌లో కనిపించిన ఈ గొడవకు సంబంధించిన వీడియో గతంలో ట్విటర్‌లో Xలో విస్తృతంగా షేర్ చేయబడింది. వైరల్ వీడియోలో ఇద్దరు ప్రయాణికుల మధ్య ఏదో వివాదం తలెత్తినట్టుగా తెలుస్తోంది. దాంతో ఇరువురు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే మూడో వ్యక్తి వీరి మధ్యలోకి వచ్చాడు..ఈ క్రమంలోనే వారి మధ్య తలెత్తిన వివాదం కాస్త ఘర్షణకు దారితీసింది.. ఆ తర్వాత గొడవ హింసాత్మకంగా మారడంతో ఇద్దరు ప్రయాణికులు మూడో వ్యక్తిని కార్నర్ చేసేందుకు ప్రయత్నించారు.
వైరల్ వీడియోలో ఇద్దరు ప్రయాణికులు మరో ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగడంతో వీడియో ప్రారంభమవుతుంది. మూడవ ప్రయాణీకుడు గొడవ పడుతున్న ఇద్దరినీ వారించేందుకు ప్రయత్నించాడు.. కానీ, ఆ ఇద్దరు ప్రయాణీకులు ఏ మాత్రం తగ్గటం లేదు..మరింత ఆగ్రహంతో ఊగిపోతున్నారు..వారిలో ఒకరు దుర్భాషలాడిన వ్యక్తితో ముష్టియుద్ధానికి దిగాడు. రెండు కాళ్లు పైకి ఎత్తి అతనిని తన్నేందుకు ప్రయత్నిస్తున్నాడు..మధ్యలో ఉన్న మూడో ప్రయాణీకుడు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇద్దరి మధ్య గొడవను ఆపేందుకు ఎంత ట్రై చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. వారిలో ఒక వ్యక్తి రెండు కాళ్లు పైకెత్తి, మెట్రోలో స్తంభం పట్టుకుని వేలాడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈవీడియోలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది..
देखिए दिल्ली मेट्रो मे लड़ाई का #वायरलवीडियो#dmrc #Metro #Delhi pic.twitter.com/GmHaevXFPD
— Lavely Bakshi (@lavelybakshi) January 27, 2024
వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఢిల్లీ మెట్రో సిబ్బందిని ఉద్దేశిస్తూ.. మీరు ఇలాంటి పరిస్థితిని ఆపలేకపోతే కనీసం ప్రజల నుండి వినోదపు పన్ను వసూలు చేయండి..అంటూ సోషల్ మీడియా వినియోగదారు ఒకరు వ్యాఖ్యనించారు. DMRC కూడా ప్రయాణీకుల మద్య తలెత్తె ఇలాంటి కార్యకలాపాలను ఆనందిస్తుందని, అందుకే కఠిన చర్యలు తీసుకోవడం లేదని మరొకరు రాశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..