AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భగవంతుడా.. మాకు ఇలాంటి భార్యనే ప్రసాదించు.. బైక్ నడుపుతున్న భర్త కోసం ఆ భార్య ఏం చేసిందంటే..

సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న ఈ వీడియోను చూసి జనాలు సోషల్ మీడియా వేదికగా ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. దీనిపై ఓ యూజర్ స్పందిస్తూ.. 'అలాంటి భార్యను పొందాలంటే ఎలాంటి కోర్సు తీసుకోవాలి?' అని అడిగారు. కామెంట్ చేసిన మరో యూజర్ 'అందరికీ ఇలాంటి భార్య దొరికితే దేశం నాశనమైపోతుంది' అని రాశాడు. మరో వినియోగదారు స్పందిస్తూ..బ్రో తను గత జన్మలో ఏదైనా మంచి చేసి ఉండాలి అందుకే అలాంటి భార్య దొరికింది అంటున్నారు. ఇకపోతే,

భగవంతుడా.. మాకు ఇలాంటి భార్యనే ప్రసాదించు.. బైక్ నడుపుతున్న భర్త కోసం ఆ భార్య ఏం చేసిందంటే..
Wifes Helarious Act
Jyothi Gadda
|

Updated on: Jan 27, 2024 | 6:41 PM

Share

సోషల్ మీడియా అంటే చాలా విచిత్రమైన వార్తలు, వీడియోలకు వేదిక. ఇక్కడ ఎవరు ఎప్పుడు ఎలాంటి సంఘటనలు చూస్తారో ఊహించడం కూడా అసాధ్యం. నేటి ఇంటర్నెట్ యుగంలో ఎవరైనా ఎక్కడ ఏం చేసినా నిమిషాల వ్యవధిలో ఆ వార్త ప్రజలకు చేరుతుంది. కొందరు తప్పు చేస్తూ కూడా దానిని ఎవరైనా చూస్తున్నారా అనే భావన కూడా లేకుండా పోతున్నారు. తమ తప్పులను ఇతరులు వీడియోలు తీస్తున్నారా..? లేదంటే ఫోటోలు తీస్తున్నారా అని కూడా ఆలోచించకుండా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా వారు ఏదైనా విచిత్రమైన పని చేసినప్పుడు… తీసిన వీడియోలు..ఇంటర్నెట్‌లోకి వచ్చిన వెంటనే వైరల్ అవుతాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఓ ఆదర్శ దంపతులు చేసిన పనికి అందరూ అవాక్కవ్వాల్సిందే..

సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒక్క క్షణం షాక్ అవుతారు. వైరల్ అవుతున్న వీడియోలో భార్యాభర్తలు బైక్‌పై వెళ్తున్న దృశ్యాలను చూడవచ్చు. బైక్ ముందు వారి బిడ్డ కూడా కూర్చుని ఉన్నాడు. అయితే, ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే..భర్త బైక్‌ నడుపుతుండగా, వెనుక కూర్చున్న భార్య అతడికి గొప్ప సాయం చేస్తోంది.. కుడిచేతిలో సిగరెట్‌ పట్టుకుని అతని నోటికి అందిస్తోంది. అతడు బైక్‌ నడుపుతూ..హాయిగా ఒక్కో పఫ్‌ ఎంజాయ్‌ చేస్తు్న్నాడు. భర్త రెండు చేతులతో బైక్ నడుపుతుండగా, సిగరెట్‌ తాగటం ఇబ్బందిగా మారింది.. అందుకే ఆ మహా ఇల్లాలు అతడికి ఇలా సాయం చేస్తోంది. ఈ వీడియోను @HasnaZaruriHai అనే పేజీ ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో షేర్‌ చేసారు. ఇది ఇప్పటివరకు 6 లక్షలకు పైగా వీక్షించబడింది.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న ఈ వీడియోను చూసి జనాలు సోషల్ మీడియా వేదికగా ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. దీనిపై ఓ యూజర్ స్పందిస్తూ.. ‘అలాంటి భార్యను పొందాలంటే ఎలాంటి కోర్సు తీసుకోవాలి?’ అని అడిగారు. కామెంట్ చేసిన మరో యూజర్ ‘అందరికీ ఇలాంటి భార్య దొరికితే దేశం నాశనమైపోతుంది’ అని రాశాడు. మరో వినియోగదారు స్పందిస్తూ..బ్రో తను గత జన్మలో ఏదైనా మంచి చేసి ఉండాలి అందుకే అలాంటి భార్య దొరికింది అంటున్నారు. ఇకపోతే, ఆ వీడియో ఎక్కడ నుండి వచ్చిందో గుర్తించి..పోలీసులు అతడికి చలాన్ విధించాలని, తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..