AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యాషన్‌ షోలో మెరిసిన రైతు బిడ్డ.. ! అందమైన డ్రెస్‌తో అదరహో అనిపించింది.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

మీరు కూడా ఈ వీడియోను చూస్తే యువతి సృజనాత్మకతను అభినందిస్తారు. ఈ వీడియో ఫ్యాషన్ షో నుండి వచ్చిందని చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే... ఫ్యాషన్ షోకు సంబంధించిన పెద్ద బ్యానర్, ఇతర ప్రేక్షకులు కూడా కనిపిస్తారు. మీరు ప్రత్యేకమైన దుస్తుల రూపకల్పన, అద్భుతమైన ఆటతో ఆశ్చర్యపోతారు. ఇలాంటి సృజనాత్మకత భారతదేశంలోనే కనిపిస్తుంది.

ఫ్యాషన్‌ షోలో మెరిసిన రైతు బిడ్డ.. ! అందమైన డ్రెస్‌తో అదరహో అనిపించింది.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Farmers girl a beautiful dress
Jyothi Gadda
|

Updated on: Jan 27, 2024 | 6:11 PM

Share

సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు మీరు నమ్మలేనంత అద్భుతంగా ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి షాకింగ్ వీడియో చర్చనీయాంశమైంది. ఈ వీడియోలో బియ్యం బస్తాలతో తయారు చేసిన అందమైన దుస్తులు ధరించిన ఒక యువతి అందరినీ అదరగొట్టేసింది. ఓ ఫ్యాషన్ షోలో బియ్యం బస్తాలతో తయారు చేసిన ఈ డ్రెస్ వేసుకున్న ఆ యువతి అందరినీ దృష్టిని ఆకర్షించింది. ఆమె లుక్ చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు మీరు ఫ్యాషన్ షోలలో చాలా రకాల డ్రెస్‌లను చూసి ఉంటారు.. కానీ ఈ డ్రెస్ కాస్త అసాధారణంగా ఉంది.

ఈ వైరల్ వీడియోలో ఒక యువతిని ఇలాంటి వెరైటీ డ్రెస్‌ వేసుకోవటం మీరు చూస్తారు. ఆమె వేసుకున్న డ్రెస్ నిజంగా చాలా అందంగా ఉంది. ఆ డ్రెస్‌లో ఆమె లుక్ కూడా చాలా అందంగా ఉంది. మొదట్లో ఈ డ్రెస్ దేనితో తయారు చేశారో ముందుగా ఎవరూ గమనించలేరు… కానీ నిశితంగా పరిశీలిస్తే ఈ డ్రెస్ అసలైన బియ్యపు బస్తాలతో తయారైందని మీకు అర్థమవుతుంది. ఈ అందమైన ఫ్రాక్ బియ్యం బస్తాలతో తయారు చేశారు.. ఈ అందమైన ఫ్రాక్‌లో యువతి చాలా అందంగా కనిపించింది. మీరు కూడా ఈ వీడియోను చూస్తే యువతి సృజనాత్మకతను అభినందిస్తారు. ఈ వీడియో ఫ్యాషన్ షో నుండి వచ్చిందని చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే… ఫ్యాషన్ షోకు సంబంధించిన పెద్ద బ్యానర్, ఇతర ప్రేక్షకులు కూడా కనిపిస్తారు. మీరు ప్రత్యేకమైన దుస్తుల రూపకల్పన, అద్భుతమైన ఆటతో ఆశ్చర్యపోతారు. ఇలాంటి సృజనాత్మకత భారతదేశంలోనే కనిపిస్తుంది. ఇక ఫ్యాషన్‌ షోలో యువతి బియ్యం బస్తాలతో స్టిచ్‌ చేసిన దుస్తుల్లో కనిపించగానే..అందరూ అలా చూస్తుండిపోయారు..ఎవరికీ ఏమీ అర్థం కాలేదు..కానీ, యువతి మాత్రం క్యాజువల్‌గా నటిస్తూ కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో Instagram ఖాతా lionize_world_records షేర్‌ చేయబడింది. చాలా మంది వినియోగదారులు వీడియో క్యాప్షన్‌పై స్పందించారు. బియ్యం బస్తాలతో తయారు చేసిన డ్రెస్‌ అదుర్స్‌ అంటున్నారు. ఇది చాలా మంచి ఆలోచన అని ఒకరు రాయగా, ఇది వాటర్ ప్రూఫ్ అంటూ మరొకరు వ్యాఖ్యనించారు. మరొక వినియోగదారు ఈ దుస్తుల ధరను అడిగారు. కొంతమందికి ఈ వీడియో చాలా నచ్చింది. కొంతమందికి ఈ జుగాడ్ కూడా నచ్చినట్లు అనిపిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..