AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో..ఇదేందక్కా..ఇదీ..! మరెక్కడా చోటు లేనట్టుగా.. రైల్వే ట్రాక్‌పై కూర్చుని తీరిగ్గా మహిళల ముచ్చట్లు, వంటావార్పు..

ఈ వీడియోలో కొందరు మహిళలు ట్రాక్‌పై కూర్చుని వంట చేస్తున్నారు. కొంత మంది బాలికలు కూడా అక్కడే కూర్చుని చదువుకుంటున్నారు. కొంత మంది చిన్న పిల్లలు అక్కడే ఆడుకుంటున్నారు. ఇంకొందరు ఆ ట్రాక్‌పైనే పడుకున్నారు. వీడియో చూసిన నెటిజన్లతో పాటు అధికారులు సైతం షాక్ అవుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం అంటూ ప్రతి ఒక్కరూ స్పందించారు.

Viral Video: వామ్మో..ఇదేందక్కా..ఇదీ..! మరెక్కడా చోటు లేనట్టుగా.. రైల్వే ట్రాక్‌పై కూర్చుని తీరిగ్గా మహిళల ముచ్చట్లు, వంటావార్పు..
Railway Track
Jyothi Gadda
|

Updated on: Jan 27, 2024 | 3:04 PM

Share

మనం ప్రతిరోజూ ఇంటర్‌నెట్‌ వెదికగా అనేకానేక విభిన్నమైన వార్తలు, వీడియోలను చూస్తాము.. సోషల్ మీడియాలో పాపులారీటి కోసం, ఎక్కువ వ్యూస్‌ సంపాదించాలనే ఆశతో చాలా మంది వెరైటీ వెరైటీ స్టంట్స్‌ చేస్తుంటారు. రోడ్ల వెంట, ప్రజా రవాణాలో డ్యాన్స్‌లు చేయటం, పాటలు పాడుతూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే, కొందరు ప్రాణాలకు తెగించి మరీ స్టంట్స్‌ చేస్తుంటారు. బైక్‌లపై ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ.. కదిలే వాహనాలపై విన్యాసాలు చేస్తుంటారు. మరికొందరు రైలు పట్టాలపై, వేగంగా వెళ్తున్న రైలులో, రైలుకు ఎదురుగా నిలబడి ఫోజులిస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు.. అలాంటి వైరల్ వీడియోలలో చాలా వరకు మనల్ని ఆశ్చర్యపరిచే, భయపెట్టే, ఆందోళన కలిగించేవిగా ఉంటాయి. కొన్ని ఉత్తేజపరిచే కంటెంట్‌ని కలిగి ఉంటాయి. ఇక్కడ కూడా అలాంటి వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. ముంబయిలో కొంత మంది స్థానిక మహిళలు రైల్వే ట్రాక్‌లపై తాపీగా కూర్చుని వంటావార్పు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వాళ్లంతా షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ముంబయికి చెందినగా తెలిసింది. స్థానికంగా ఉన్న ఓ రైల్వే స్టేషన్‌లో లోకల్‌ ట్రైన్ ట్రాక్‌లపై కొందరు మహిళలు తీరిగ్గా కూర్చుని వంటావార్పు చేస్తున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. Mumbai Matters అనే అకౌంట్ నుంచి ఈ వీడియో పోస్ట్ అయింది. ఇంట్లో కూర్చుని తీరిగ్గా వంట చేస్తున్నట్టుగా…అసలేమీ పట్టకుండా అలా రైల్వే ట్రాక్‌పై వంటలు చేసుకున్నారు వారంతా. వీడియో వైరల్‌ కావటంతో రైల్వే శాఖ దృష్టికి వెళ్లింది. ముంబయి డివిజన్ రైల్వే మేనేజర్ వెంటనే స్పందించారు. ఈ వీడియోలో కొందరు మహిళలు ట్రాక్‌పై కూర్చుని వంట చేస్తున్నారు. కొంత మంది బాలికలు కూడా అక్కడే కూర్చుని చదువుకుంటున్నారు. కొంత మంది చిన్న పిల్లలు అక్కడే ఆడుకుంటున్నారు. ఇంకొందరు ఆ ట్రాక్‌పైనే పడుకున్నారు. వీడియో చూసిన నెటిజన్లతో పాటు అధికారులు సైతం షాక్ అవుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం అంటూ ప్రతి ఒక్కరూ స్పందించారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఎవరు చిత్రీకరించారనేది స్పష్టంగా తెలియరాలేదు. కానీ, వీడియో మాత్రం వేగంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో వైరల్ కావడంతో రైల్వే శాఖ కూడా చర్యలు చేపట్టింది. ముంబై డివిజనల్ రైల్వే మేనేజర్ ఇప్పుడు సంబంధిత అధికారులను వివరణ కోరారు. వెంటనే ఆర్పీఎఫ్ వీడియోలో కనిపిస్తున్న ప్రదేశానికి చేరుకుని ప్రజలను ఖాళీ చేయించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..