Watch Video: 3 నెలల పిల్లలతో కలిసి ఆడపులి ‘ర్యాంప్ వాక్’.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

గతంలో కనిపించిన 'ఫెయిరీ' దాని ఐదు పిల్లలు ప్రసిద్ధి చెందిన ఈ గేట్‌వే వారసత్వాన్ని ఇప్పుడు 'F2' అనే పులి, దాని రెండు పిల్లలు ముందుకు తీసుకువెళుతున్నాయి. ఈ పులి పిల్లలు పుట్టిన తర్వాత వాటిని నోటిలో పెట్టుకుని తిరుగుతున్న దృశ్యాలు అక్కడక్కడా చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. కానీ అలాంటి అరుదైన దృశ్యాలు కూడా ఇప్పుడు పర్యాటకులకు తరచూగా దర్శనం ఇస్తున్నాయి.

Watch Video: 3 నెలల పిల్లలతో కలిసి ఆడపులి 'ర్యాంప్ వాక్'.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Tigresses And Cubs
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 25, 2024 | 12:00 PM

సున్నితత్వం, ఆహ్లాదకరమైన అనుభూతి, మాతృత్వం అనేది కేవలం మనుషులకే కాదు.. నిజానికి ఇది జంతువులలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. క్రూర మృగాలుగా పిలిచే పులులకు సైతం ఇవన్నీ ఉంటాయి… పులి పిల్లలు రెండు సంవత్సరాల వరకు తల్లి పులితో ఉంటాయి. ఈ కాలంలో ఆ తల్లే వారికి ఆహారం తినటం, వేట వరకు శిక్షణ ఇస్తుంది. ఇదిలా ఉంటే వారిలో కూడా మాతృత్వం కనిపిస్తుంది. అలాంటి ఒక మరపురాని అనుభూతిని పర్యాటకులు ఉమ్రేద్-కర్హండ్ల అభయారణ్యంలో అనుభవించారు. ‘F2’ అనే పులి మూడు నెలల వయసున్న తన రెండు పిల్లలతో కలిసి అడవిలో తిరుగుతూ కనిపించింది.

గతంలో ఒక పులి దాని ఐదు పిల్లలతో కలిసి అభయారణ్యంలో తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావటం అందరూ చూశారు.. ఇప్పుడు కూడా అలాంటి వీడియో మరొకటి కనిపించింది. వైరల్‌ వీడియోలో ఒక పులి దాని పిల్లలతో కలిసి హాయిగా తిరుగుతున్న వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ‘F2’ అనే పులి తన మూడు నెలల పిల్లలతో అభయారణ్యంలో స్వేచ్ఛగా తిరగడం ప్రారంభించింది. ఉమ్రేద్-కర్హండ్ల అభయారణ్యంలో ‘F2’ పులి, దాని పిల్లలతో కలిసి గోతంగావ్ గేట్ సఫారీ పర్యాటకులకు కనిపించింది. గతంలో కనిపించిన ‘ఫెయిరీ’ దాని ఐదు పిల్లలు ప్రసిద్ధి చెందిన ఈ గేట్‌వే వారసత్వాన్ని ఇప్పుడు ‘F2’ అనే పులి, దాని రెండు పిల్లలు ముందుకు తీసుకువెళుతున్నాయి. ఈ పులి పిల్లలు పుట్టిన తర్వాత వాటిని నోటిలో పెట్టుకుని తిరుగుతున్న దృశ్యాలు అక్కడక్కడా చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. కానీ అలాంటి అరుదైన దృశ్యాలు కూడా ఇప్పుడు పర్యాటకులకు తరచూగా దర్శనం ఇస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

జనవరి 23, సాయంత్రం, ఉమ్రేడ్-కర్హండ్ల అభయారణ్యంలోని గోతంగావ్ సఫారీ ప్రవేశద్వారం వద్ద ‘F2’ అనే పులి తన మూడు నెలల పిల్లలతో షికారు చేసింది. అది తన పిల్లలను వాటి ఆవాసాలకు పరిచయం చేస్తున్నట్లుగా ఉంది. ఈ మనోహరమైన అనుభవాన్ని ‘డెక్కండ్రిఫ్ట్స్’ వన్యప్రాణుల పరిశోధకులు పియూష్ అక్రే, నితిన్ బారాపాత్రే కెమెరాలో బంధించారు. మూడున్నరేళ్ల వయసున్న ‘ఎఫ్2’ అనే పులి తొలిసారి పిల్లలకు జన్మనిచ్చింది. తడోబా-అంధారి పులుల ప్రాజెక్టుకు చెందిన మాయ అనే పులి అంతకుముందు మూడు నెలల పిల్లలను బహిరంగ అడవిలో పర్యాటకులకు బహిర్గతం చేయడానికి సాహసించింది. ఆ తర్వాత ఉమ్రేడ్-కర్హండ్ల అభయారణ్యంలోని గోథాంగావ్ రాణిగా పేరుగాంచిన ‘ఎఫ్2’ అనే పులి ఇలా దాని పిల్లలతో కలిసి కనిపించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..