Viral Video: ఈ టీచరమ్మ టీచింగ్‌కు ఎవరైనా ఫిదానే.. పాటలతో స్టూడెంట్స్‌కు పాఠాలు
ఈ పాటను చిత్రీకరించి సామాజిక మాధ్యమంలో పోస్టు చేయగా కోటీ మంది వీక్షించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు సైతం ఈ వీడియోను గ్రూపుల్లో షేర్ చేశారు. పిల్లలను ఆకట్టుకునేలా బోధన చేస్తున్న సాధనను 2023లో తెలంగాణ ఆల్ టీచర్స్ ప్రైవేటు అసోసియేషన్, వరంగల్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందజేశారు.
విద్యార్థులకు పాటలతో పాఠాలను వినూత్నంగా బోధిస్తున్నారు టీచర్ తేరాల సాధన. ఖమ్మం లోని షైన్ ఇండియా ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న సాధన పేరడీ పాటలు రాసి రాగయుక్తంగా ఆలపిస్తూ పిల్లలకు ఉత్సాహంగా పాఠాలు చెబుతున్నారు. భారతదేశం చిత్ర పటంలోని సరిహద్దులను సులభంగా గుర్తు పట్టేందుకు ఓ సినిమా లోని పాటకు పేరడీగా ‘దాని కుడిభుజమ్మీద పాకిస్థాన్.. దాని పైనే ఉంది అఫ్ఘనిస్తాన్.. దాని ఎడం భుజమ్మీద నేపాల్.. దాని పైనే ఉంది చైనా’ అంటూ చిన్నారులకు గుర్తుండేలా బోధిస్తున్నారు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాధాపురం గ్రామానికి చెందిన తేరాల సాధన.
దీంతో పిల్లలు ఈజీగా గుర్తుంచుకొని మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు…ఈ పాటను చిత్రీకరించి సామాజిక మాధ్యమంలో పోస్టు చేయగా కోటీ మంది వీక్షించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు సైతం ఈ వీడియోను గ్రూపుల్లో షేర్ చేశారు. పిల్లలను ఆకట్టుకునేలా బోధన చేస్తున్న సాధనను 2023లో తెలంగాణ ఆల్ టీచర్స్ ప్రైవేటు అసోసియేషన్, వరంగల్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందజేశారు.
కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ప్రైడ్ ఆఫ్ ఇండియా పురస్కారం, ఏషియన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇన్నోవేటివ్ టీచర్ ఆఫ్ ది ఇయర్-2023 అవార్డు, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో నగదు బహుమతి, ప్రశంసాపత్రం, కవితాలయం-సాహిత్య, సామాజిక సేవా సంస్థ నుంచి ప్రశంసాపత్రం, బాలల దినోత్సవం-2016లో నందిని సిధారెడ్డి నుంచి అభినందన పత్రం, తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ప్రశంసాపత్రాలు అందుకున్నారు…ఈ టీచర్ వినూత్న ఆలోచనలకు, భోధన కు స్టూడెంట్స్ ఫిదా అవుతున్నారు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..