Hot Water : చలికాలంలో వేడినీటి స్నానం చేస్తున్నారా..? ఇలాంటి వ్యాధులకు స్వాగతం పలికినట్టే..!

అధిక బీపీ ఉన్నవారు వేడి నీళ్లతో స్నానం చేయకూడదు. దీని వల్ల బీపీ పెరుగుతుంది. అధిక బిపి, గుండె జబ్బులతో బాధపడుతున్న రోగి ఎప్పుడూ వేడి నీటితో స్నానం చేయకూడదు. అలాంటి వారు ఉదయాన్నే వేడి నీళ్లతో తలస్నానానికి దూరంగా ఉండాలి. జలుబు పెరిగినప్పుడు వేడి నీళ్లలో కాస్త

Hot Water : చలికాలంలో వేడినీటి స్నానం చేస్తున్నారా..? ఇలాంటి వ్యాధులకు స్వాగతం పలికినట్టే..!
Bath
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 25, 2024 | 10:08 AM

చలికాలంలో అందరూ వేడి నీటితో స్నానం చేయడానికే ఇష్టపడతారు. పైగా పొద్దున్నే వేడి నీళ్లతో స్నానం చేస్తే ఎంత బాగుంటుందోనని చెబుతుంటారు. కానీ, వేడి నీటితో స్నానం చేయడం రక్త ప్రసరణకు, ఎముకలకు మంచిదని భావిస్తారు.. కానీ, వేడి నీటి స్నానం కారణంగా చాలా నష్టాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా..? ఇది చర్మం నుండి తేమను దూరం చేస్తుంది. చర్మంపై పాచెస్‌ను కూడా కలిగిస్తుంది. చర్మం పొడిబారేలా చేస్తుంది. దీని కారణంగా చర్మంపై దురద, పొడిగా అనిపిస్తుంది. అంతేకాదు.. చలికాలంలో వేడి నీటి స్నానం వల్ల ఇంకా అనేక సమ్యలు ఎదురవుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు..అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

వేడి నీళ్లతో స్నానం చర్మ వ్యాదులకు కారణం కావొచ్చు..అవేంటో చూద్దాం..

తామర వ్యాధిని ప్రేరేపిస్తుంది..

చాలా వేడిగా ఉండే నీటితో స్నానం చేయటం వల్ల చర్మాన్ని పొడిగా చేస్తుంది. ముఖ్యంగా ఎగ్జిమాతో బాధపడేవారు పొరపాటున కూడా వేడి నీళ్లతో స్నానం చేయకూడదు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల దురద వస్తుంది. తామర కూడా ప్రేరేపించబడవచ్చు. వేడి నీరు దురదను కలిగిస్తుంది. దీని కారణంగా తామర పాచెస్ పెరగడం ప్రారంభమవుతుంది. ఇది దురద సమస్యకు ఒక ముఖ్యమైన కారణం అవుతుంది.

ఇవి కూడా చదవండి

సోరియాసిస్ వ్యాధి..

సోరియాసిస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. ఎక్కువ వేడిగా ఉన్న నీటితో స్నానం చేస్తే సోరియాసిస్‌ వ్యాధి ప్రేరేపిస్తుంది. వేడి నీటితో చర్మం పొడిబారుతుంది. దీని కారణంగా చర్మం చికాకు కలుగుతుంది.. ఇది చర్మం బయటి పొరలో ఉండే కెరాటిన్ కణాలకు చాలా నష్టం కలిగిస్తుంది. దీని వల్ల చర్మం పొడిబారడం ప్రారంభమవుతుంది. సోరియాసిస్ లక్షణాలు క్రమంగా బయటకు వస్తుంటాయి.

హై బీపీ ఉన్నవారు వేడి నీళ్లతో స్నానం చేయకూడదు..

అధిక బీపీ ఉన్నవారు వేడి నీళ్లతో స్నానం చేయకూడదు. దీని వల్ల బీపీ పెరుగుతుంది. అధిక బిపి, గుండె జబ్బులతో బాధపడుతున్న రోగి ఎప్పుడూ వేడి నీటితో స్నానం చేయకూడదు. అలాంటి వారు ఉదయాన్నే వేడి నీళ్లతో తలస్నానానికి దూరంగా ఉండాలి. జలుబు పెరిగినప్పుడు వేడి నీళ్లలో కాస్త చల్లటి నీళ్లు కలిపి నార్మల్‌గా చేసి ఆ నీటితో స్నానం చేయాలి. ఇది మీ ఆరోగ్యంపై ఎలాంటి చెడు ప్రభావం చూపదు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..