AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bottle Gourd Benefits: ఈ కూరగాయ ఉపయోగాలు తెలిస్తే.. దాన్ని అస్సలు వదిలిపెట్టారు

మన శరీరంలో మంచి, చెడు అనే రెండు రకాల కొలెస్ట్రాల్ ఉన్నాయి. కానీ ఏదైనా సరే.. అధిక కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది గుండెపై ఒత్తిడి తెస్తుంది. దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. అందుకే మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవాలి. ఏదైనా సరే మితంగా తినటం అలవాటు చేసుకోవాలి. ఏ విధంగానూ అతిగా తినకూడదు. ఇది అనారోగ్య ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి

Bottle Gourd Benefits: ఈ కూరగాయ ఉపయోగాలు తెలిస్తే.. దాన్ని అస్సలు వదిలిపెట్టారు
Bottle Gourd
Jyothi Gadda
|

Updated on: Jan 25, 2024 | 9:48 AM

Share

కూరగాయాల్లో సొరకాయకు ఉన్న ప్రత్యేకత వేరు. ఎందుకంటే సొరకాయను ఎలాంటి రసాయనాలు లేకుండా పండిస్తారు. తెలంగాణలో దీన్ని ఆనిగపుకాయ అని కూడా అంటారు. సొరకాయ ఎక్కువ పీచు, నీటితో నిండి ఉంటుంది. అయితే, ఈ పేరు వినగానే చాలా మందికి తినాలనిపించదు.. కానీ, ఈ వెజిటేబుల్‌తో మేలు తెలిస్తే.. ఎవరూ వదిలిపెట్టారు. ఏడాది పొడవునా దీన్ని తినడం వల్ల కడుపు చల్లగా ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉండవు. ఇదేంతో పోషకమైనది. కేలరీలు చాలా తక్కువగా ఉంటుంది. చెప్పాలంటే కేలరీలు, కార్బోహైడ్రేట్లు లేవు. అందుకే సొరకాయ బరువు తగ్గడానికి ఉత్తమమైనది. దీంతో పలుచని సూప్‌లతో పాటు పప్పు పులుసు పచ్చడి కూడా చేసుకుంటారు. అంతేకాకుండా, చేపలతో సొరకాయ, రొయ్యలతో సొరకాయ కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది.

ఈ కూరగాయలలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడానికి, ప్రేగులను జాగ్రత్తగా చూసుకోవడానికి ఈ కూరగాయను తప్పనిసరిగా మీ ఆహారంలో చేర్చుకోవాలి.. పొట్ట, కాలేయాన్ని శుభ్రంగా ఉంచడంలో, ఎలాంటి చర్మవ్యాధులైనా నయం చేయడంలో సొరకాయ పాత్ర కాదనలేనిది. సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఇందులో కేలరీలు కూడా ఉండవు కాబట్టి గుండెకు కూడా చాలా మేలు చేస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్‌గా ఉండటం వల్ల, సొరకాయ జ్వరం, కామెర్లు, మధుమేహం, జీర్ణ సమస్యలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మన శరీరంలో మంచి, చెడు అనే రెండు రకాల కొలెస్ట్రాల్ ఉన్నాయి. కానీ ఏదైనా సరే.. అధిక కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది గుండెపై ఒత్తిడి తెస్తుంది. దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. అందుకే మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవాలి. ఏదైనా సరే మితంగా తినటం అలవాటు చేసుకోవాలి. ఏ విధంగానూ అతిగా తినకూడదు. ఇది అనారోగ్య ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి సమతుల్య ఆహారం, తేలికపాటి ఆహారం శరీరానికి ఉత్తమం. సొరకాయలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా, మలబద్ధకం సమస్య ఉండదు, ప్రేగులు శుభ్రంగా ఉంటాయి. కాబట్టి ఈ సొరకాయను రెగ్యులర్ గా తినండి. రోజూ ఒక సొరకాయ తింటే పొట్ట చాలా చల్లగా ఉంటుంది. చాలా మందికి చిన్న వయసులోనే ముఖంలో ముడతలు వస్తాయి. ఆ ముడతలను తొలగించేందుకు కూడా సొరకాయ పని చేస్తుంది.

ఇవి కూడా చదవండి

సొరకాయలో నీటి శాతం చాలా తక్కువ. క్యాలరీలను కలిగి ఉంటుంది. దీని వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఆకలి అనిపించదు. ఫలితంగా, కొవ్వు త్వరగా కరగడం ప్రారంభమవుతుంది. శరీర నిర్విషీకరణకు సొరకాయ. అందువల్ల, శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే, క్రమం తప్పకుండా సొరకాయను తినండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..