Cumin Water in Weight Loss: ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే బరువు తగ్గుతారా.. నిపుణుల సూచన..?

మన వంటింట్లో ఉండే వంటపదార్థాల్లో ఆరోగ్యానికి మేలు చేసేవి అనేకం ఉన్నాయి. పూర్వ కాలం నుండి కొన్ని మసాలా దినుసులు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తున్నాయి. అందులో ప్రతి వంటింట్లో లభించే అత్యంత సాధారణ మసాలా జీలకర్ర. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. జీలకర్ర వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు. ఉదయం లేచిన వెంటనే జీలకర్ర నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది. సరైన జీర్ణప్రక్రియకు దోహదం చేస్తుంది.

|

Updated on: Jan 24, 2024 | 8:51 PM

జీలకర్ర నీళ్లు తాగడం వల్ల చాలా సమస్యలు పరిష్కరించుకో వచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో చాలా మంది జీర్ణ సమస్యల తో సతమతమవుతున్నారు. అలాంటి వారికి జీలకర్రని వాడితే ఉపశమనం ఉంటుందని చెబుతున్నారు. అయితే మరి జీలకర్రకు సంబంధించి మరిన్ని ఉపయోగాలు, ముఖ్యమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

1 / 7
ఉదయం లేచిన వెంటనే జీలకర్ర నీళ్లు తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలను పొందొచ్చు. జీలకర్ర నీళ్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగటం వల్ల ఇది శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. ఈ నీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

2 / 7
జీలకర్రలో ఐరన్ వంటి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇది హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయడంలో, రక్తంలో ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడంలో సహాయపడుతుంది.  ఇది రక్తం గడ్డకట్టడం, శారీరక మంట ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

3 / 7
జీలకర్రలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీలకర్ర నీటిని తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీలకర్ర నీరు అజీర్తికి చాలా మేలు చేస్తుంది. కడుపు ఉబ్బరం, బరువు వంటి సమస్యల నుంచి బయటపడేందుకు జీలకర్ర నీటిని తాగండి. ఇది కడుపులో అసౌకర్యాన్ని కూడా తొలగిస్తుంది.

4 / 7
జీలకర్రలో పొటాషియం ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి పొటాషియం ముఖ్యం. జీలకర్ర నీటిని తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలన్నా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా జీలకర్ర నీళ్లు తాగండి.

5 / 7
జీలకర్ర నీటిని తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా, షుగర్ నుండి ప్రతిదీ నియంత్రణలో ఉంటుంది. జీలకర్ర శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని త్వరగా పెంచదు. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు జీలకర్ర నీటిని తాగవచ్చు.

6 / 7
జీలకర్ర నీరు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తద్వారా ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండి, శరీరం సరిగ్గా నిర్విషీకరణకు గురైనప్పుడు బరువు తగ్గడం సులభం.

7 / 7
Follow us