AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఆడాళ్లా మజాకా?.. వాళ్ల క్రికెట్ మ్యాచ్ నెక్స్ట్ లెవల్ బ్రో.. తలుచుకుంటే ఏదైనా సరే..

ఈ 11 సెకన్ల నిడివి గల ఈ వీడియోను నెటిజన్లు ఎంతో ఆసక్తిగా వీక్షించారు. దానిపై స్పందిస్తూ ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు.. ఆట పట్ల ఆసక్తి, కోరిక ఉండాలే గానీ, స్థలం ఎక్కడైనా సరే ఆడేసుకోవచ్చు అంటున్నారు. మరొకరు స్పందిస్తూ.. ఇది నిజంగా 3డి క్రికెట్ బ్రో..అంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో చాలా మంది నెటిజన్లు వీడియోపై స్పందించారు.

Watch Video: ఆడాళ్లా మజాకా?.. వాళ్ల క్రికెట్ మ్యాచ్ నెక్స్ట్ లెవల్ బ్రో.. తలుచుకుంటే ఏదైనా సరే..
Girls Playing Cricket
Jyothi Gadda
|

Updated on: Jan 25, 2024 | 10:29 AM

Share

దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తరచుగా వారు ఆసక్తికరమైన, ఫన్నీ వీడియోలు, కథనాలను నెటిజన్లతో పంచుకుంటారు.. అలా ఎప్పటికప్పుడు ప్రజలను మనతో అనుసంధానం చేస్తారు. అతని కొన్ని వీడియోలు నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. వీటిని ప్రజలు కూడా ఆనందిస్తారు. అతను మరోసారి అలాంటి స్ఫూర్తిదాయకమైన వీడియోను ఇంటర్‌నెట్‌లో షేర్‌ చేశారు. అది చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.

మీరు క్రికెట్ ఆడేవారి చాలా మందిని చూసి ఉంటారు. అంతేకాదు.. ప్రజలకు క్రీడల పట్ల ఉన్న మక్కువ కూడా అందరికీ తెలిసిందే..అయితే, ఇప్పుడు ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అలాంటి వీడియోనే షేర్‌ చేశారు.. ఇందులో అమ్మాయిలు నెక్ట్‌ లెవల్‌లో క్రికెట్ ఆడుతున్నారు. ముక్యంగా భారతదేశంలో క్రికెట్ అనేది ఒక ఆట మాత్రమే కాదు క్రీడాకారుల అభిమానం. పిచ్ ఉన్నా లేకపోయినా ఏ మైదానాన్ని అయినా పిచ్‌గా మార్చుకుని ఎక్కడి నుంచి బ్యాటింగ్‌కు దిగుతారో దాన్ని బట్టి దాని క్రేజ్‌ను అంచనా వేయవచ్చు. ఈ రోజుల్లో ఆనంద్ మహీంద్రా అలాంటి వీడియోను షేర్ చేశారు. వీడియో శీర్షికలో ఆనంద్ మహీంద్రా ఇలా వ్రాశాడు.. భారతదేశం క్రికెట్‌ను వేరే స్థాయికి తీసుకువెళుతోంది.. ఆ స్థాయి ఎలా ఉందో కూడా నేను చెప్పలేనంటూ వ్యాఖ్యనించారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ వీడియోలో, కొండ ప్రాంతంలో అమ్మాయిల జట్టు క్రికెట్ ఆడుతున్నారు. వారి క్రికెట్ మ్యాచ్ చూసేందుకు చాలా మంది అక్కడ కూర్చొని ఉన్నారు. బ్యాటింగ్ చేసే అమ్మాయిలు ధోనీ స్టైల్‌లో బ్యాటింగ్ చేస్తూ ఫోర్లు, సిక్స్‌లు కొడుతున్నారు. ఆ తర్వాత వీర లెవల్‌ల్లో ఫీల్డింగ్‌ను ప్రదర్శించారు. దాంతో వారికి ఆనంద్ మహీంద్రా అభిమాని అయ్యాడు

తర్వాత వీడియోలో మీరు ఫీల్డింగ్ కోసం ఒక కొండపై నిలబడి ఉన్న అమ్మాయిని చూస్తారు. గాలిలో కొట్టిన బంతిని పట్టుకోవడానికి వేగంగా పరిగెత్తాడు. ఈ క్రికెట్ స్పెషాలిటీ ఏంటంటే.. ఎక్కడం, దిగడం చాలా కష్టం. అంతే ప్రమాదకరమైన కొండ ప్రాంతాల్లో ఈ అమ్మాయిలు పర్ఫెక్ట్ గా ఫీల్డింగ్ చేస్తూ హ్యాపీగా క్రికెట్ ఆడుతున్నారు.

ఈ 11 సెకన్ల నిడివి గల ఈ వీడియోను నెటిజన్లు ఎంతో ఆసక్తిగా వీక్షించారు. దానిపై స్పందిస్తూ ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు.. ఆట పట్ల ఆసక్తి, కోరిక ఉండాలే గానీ, స్థలం ఎక్కడైనా సరే ఆడేసుకోవచ్చు అంటున్నారు. మరోకరు స్పందిస్తూ.. ఇది నిజంగా 3డి క్రికెట్ బ్రో..అంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో చాలా మంది నెటిజన్లు వీడియోపై స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..