Viral Video: బాల రాముడు చూస్తున్నాడు.. నవ్వుతున్నాడు.. మీరు చూసి తరించండి..

ఉదాహరణకు సినీ హీరో శోభన్ బాబు. ఆయన చిత్రాలను వినియోగించుకొని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేసిన అద్భుత దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో అయోధ్య బాల రాముడి విగ్రహ నమూనాతో చేసిన ఓ వీడియో అబ్బురపరుస్తోంది. ఆ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ రామ్ లలా నిజంగానే తమను చూస్తున్నట్లు, నవ్వుతున్నట్లు ఉందని కితాబిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్ ఫుల్ వైరల్ గా మారింది.

Viral Video: బాల రాముడు చూస్తున్నాడు.. నవ్వుతున్నాడు.. మీరు చూసి తరించండి..
Ram Lalla
Follow us
Madhu

|

Updated on: Jan 25, 2024 | 6:30 AM

ప్రస్తుతం టెక్ సర్కిళ్లలో అత్యధికంగా వినిపిస్తున్న పేరు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ). ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏఐ అద్భుతాలు సృష్టిస్తోంది. పనిని వేగంగా, సమర్థంగా నిర్వహిస్తుండటంతో అందరూ దాని వెంట పడుతున్నారు. దీంతో ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనేక మార్పులు మనకు కనిపిస్తున్నాయి. మరో పక్క ఈ ఏఐ టెక్నాలజీతో అనేక రకాల ఆవిష్కరణలు మన కళ్ల ముందు సాక్షాత్కారమవుతున్నాయి. గతంలోని మనుష్యులను ప్రస్తుత ట్రెండ్ కు అనుగుణంగా మార్చి లోకానికి ప్రజెంట్ చేస్తున్నాయి. ఉదాహరణకు సినీ హీరో శోభన్ బాబు. ఆయన చిత్రాలను వినియోగించుకొని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేసిన అద్భుత దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో అయోధ్య బాల రాముడి విగ్రహ నమూనాతో చేసిన ఓ వీడియో అబ్బురపరుస్తోంది. ఆ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ రామ్ లలా నిజంగానే తమను చూస్తున్నట్లు, నవ్వుతున్నట్లు ఉందని కితాబిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్ ఫుల్ వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఆ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

అయోధ్య కల సాకారం..

దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన అయోధ్య రామమందిర ప్రతిష్టోత్సవం అట్టహాసంగా జరిగింది. దేశంలోని హిందువుల 500ఏళ్ల నాటి కల సాకారం కావడంతో అంతటా జై శ్రీరామ్ నామ స్మరణతో మార్మోగింది. అద్భుత రూపంలో కొలువుదీరిడన బాల రాముడిని దర్శించుకునేందుకు ప్రముఖలు, సినీతారలు, భక్తులు లక్షలాదిగా అయోధ్య వైపు నడిచారు. అయితే అయోధ్య బాల రాముడి చిత్రం ప్రతిష్టకు ముందే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇప్పుడు మరో వీడియో ఒక సెన్సేషన్ సృష్టిస్తోంది. బాల రాముడి విగ్రహాన్ని వినియోగించి, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతను జోడించి ఒక వీడియోను చేశారు. ఆ వీడియోలో బాల రాముడు చిరునవ్వులు చిందిస్తూ.. కంటి రెప్పులు వాల్చుతూ, అటు ఇటు చూస్తున్నట్లుగా ఉంది. దీనిని చూసిన వారంతా ఇది నిజమా? అని నోరెళ్లబెడుతూ పరవశించిపోతున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఫలితంగా ఇది ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఈ వీడియోను ఎవరు చేశారో తెలీదు గానీ @happymi అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఇది పోస్ట్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఫుల్ వైరల్..

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని ఎవరు చేశారు అన్న దానిపై నెటిజనులు సెర్చింగ్ మొదలు పెట్టారు. గొప్ప వీడియోను చేశారంటూ అభినందనలతో ముంచెత్తుతున్నారు. ట్విట్టర్ లో షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటికే 2 మిలియన్ల మందికిపైగా వీక్షించారు. 65మందికి పైగా లైక్ చేశారు. తమ తమ సోషల్ మీడియా వాల్స్ పై రీ పోస్ట్ చేస్తున్నారు. వాట్సాప్ స్టేటస్ లలో పెట్టుకుంటున్నారు. వాస్తవానికి అయోధ్య రామ మందిరంలో కొలువైన 51 అడుగుల పొడవైన బాల రాముడిని కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. ఇది ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..