NRI Aadhaar: ఎన్ఆర్ఐలకు, వారి పిల్లలకూ ఆధార్.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

నాన్ రెసిడెంట్ ఇండియన్స్(ఎన్ఆర్ఐ)లు కూడా ఈ ఆధార్ కార్డు పొందుకొనేందుకు అర్హులు. వీరు కూడా సాధారణంగా ఆధార్ కార్డుకి ఎలా అప్లై చేస్తారో అలాగే చేయడంతో పాటు వారి బయోమెట్రిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఆధార్ నమోదు ప్రక్రియలో వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌లు, ఫోటోతో కూడిన బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ డేటా వంటివి తీసుకుంటారు. అలాగే ఎన్ఆర్ఐలతో పాటు వారి పిల్లలు కూడా ఆధార్ పొందేందుకు అర్హులే.

NRI Aadhaar: ఎన్ఆర్ఐలకు, వారి పిల్లలకూ ఆధార్.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Aadhaar
Follow us

|

Updated on: Oct 27, 2023 | 5:35 PM

ఆధార్ కార్డు అంటే మనందరికీ తెలిసిందే. మన దేశ పౌరులు అని ధ్రువీకరించే ఓ గుర్తింపు కార్డు. దీనిని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) జారీ చేస్తుంది. ఇది 12 అంకెలు కలిగిన ప్రత్యేక గుర్తింపు సంఖ్య. మన దేశంలో నివాసితులకు ఒక గుర్తింపుగా అలాగే అడ్రస్ రుజువుగా ఉపయోగపడుతుంది. కాగా నాన్ రెసిడెంట్ ఇండియన్స్(ఎన్ఆర్ఐ)లు కూడా ఈ ఆధార్ కార్డు పొందుకొనేందుకు అర్హులు. వీరు కూడా సాధారణంగా ఆధార్ కార్డుకి ఎలా అప్లై చేస్తారో అలాగే చేయడంతో పాటు వారి బయోమెట్రిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఆధార్ నమోదు ప్రక్రియలో వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌లు, ఫోటోతో కూడిన బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ డేటా వంటివి తీసుకుంటారు. అలాగే ఎన్ఆర్ఐలతో పాటు వారి పిల్లలు కూడా ఆధార్ పొందేందుకు అర్హులే. ఆ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకుందాం రండి.

ఎన్ఆర్ఐ ఆధార్ నమోదు ఇలా..

చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్‌ను కలిగి ఉన్న ఎన్‌ఆర్‌ఐ (మైనర్ లేదా పెద్దవారైనా) ఏదైనా ఆధార్ కేంద్రం నుంచి ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకోసం స్టెప్ బై స్టెప్ విధానం ఇది..

 • ఏదైనా ఆధార్ కేంద్రాన్ని సందర్శించండి.
 • చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్‌ని తీసుకెళ్లండి.
 • నమోదు ఫారమ్‌లో వివరాలను పూరించండి.
 • ఎన్‌ఆర్‌ఐలకు ఈమెయిల్ ఐడీ ఇవ్వడం తప్పనిసరి.
 • ఎన్ఆర్ఐ నమోదు కోసం డిక్లరేషన్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. మీ నమోదు ఫారమ్‌లో దాన్ని చదివి సంతకం చేయాలి.
 • మిమ్మల్ని ఎన్ఆర్ఐగా నమోదు చేయాలని కేంద్రంలో ఆపరేటర్‌కి సూచించండి.
 • గుర్తింపు రుజువుగా మీ పాస్‌పోర్ట్ ఇవ్వండి.
 • యూఐడీఏఐ పత్రాల జాబితా ప్రకారం, మీరు మీ పాస్‌పోర్ట్‌ చిరునామా, పుట్టిన తేదీ రుజువుగా ఉపయోగించడాన్ని ఎంచుకోవచ్చు లేదా దీని కోసం కొన్ని ఇతర చెల్లుబాటు అయ్యే పత్రాలని ఇవ్వవచ్చు.
 • బయోమెట్రిక్ క్యాప్చర్ ప్రక్రియను పూర్తి చేయండి.
 • మీరు అప్లికేషన్ సమర్పించడానికి ముందు స్క్రీన్‌పై అన్ని వివరాలను (ఇంగ్లీష్, స్థానిక భాషలో) తనిఖీ చేయండి.
 • మీ 14 అంకెల ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, తేదీ, సమయ స్టాంప్‌ను కలిగి ఉన్న రసీదు స్లిప్/ నమోదు స్లిప్‌ను ఆపరేటర్ నుంచి తీసుకోండి.

ఎన్ఆర్ఐ పిల్లలకు ఆధార్ నమోదు ఇలా..

5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు అయితే తల్లిదండ్రులు/సంరక్షకుల్లో ఒకరు పిల్లల తరఫున ప్రామాణీకరించాలి. ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్‌పై సంతకం చేయడం ద్వారా మీ అంగీకారాన్ని తెలపాలి. పిల్లల చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్ గుర్తింపు రుజువుగా తప్పనిసరి. పిల్లల వయస్సు 5 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉంటే మళ్లీ తల్లిదండ్రులు/సంరక్షకుల్లో ఒకరు ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్‌పై సంతకం చేయడం ద్వారా మైనర్‌ను నమోదు చేసుకోవడానికి సమ్మతి ఇవ్వాలి. అయితే ఎన్ఆర్ఐలు ఆధార్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, అంతర్జాతీయ లేదా భారతీయేతర మొబైల్ నంబర్‌లను యూఐడీఏఐ అంగీకరించదని గమనించడం ముఖ్యం. కాబట్టి, దరఖాస్తు ప్రక్రియ సమయంలో మీరు భారతీయ మొబైల్ నంబర్‌ను అందించారని నిర్ధారించుకోవడం చాలా అవసరం.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
నేడు లోక్‌సభ స్పీకర్ అభ్యర్థిపై రానున్న స్పష్టత..!
నేడు లోక్‌సభ స్పీకర్ అభ్యర్థిపై రానున్న స్పష్టత..!
మళ్లీ తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.?
మళ్లీ తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.?
కల్కి సినిమా టికెట్ రేట్లు పెంపునకు AP ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
కల్కి సినిమా టికెట్ రేట్లు పెంపునకు AP ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
టాయిలెట్‌ కమోడ్‌లో దూరిన పాము.. వీడియో చూస్తే కళ్లు బైర్లే
టాయిలెట్‌ కమోడ్‌లో దూరిన పాము.. వీడియో చూస్తే కళ్లు బైర్లే
తుఫాన్ హాఫ్ సెంచరీ.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో రోహిత్ భారీ రికార్డ్
తుఫాన్ హాఫ్ సెంచరీ.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో రోహిత్ భారీ రికార్డ్
ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి ఎందుకు కోపమొచ్చింది?
ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి ఎందుకు కోపమొచ్చింది?
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో హీరోయిన్.. జాగ్రత్తగా ఉండాలంటున్న అనన్య..
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో హీరోయిన్.. జాగ్రత్తగా ఉండాలంటున్న అనన్య..
విశ్వేశ్వరుడిని దర్శించుకున్న నీతా అంబానీ, 2. 5 కోట్లు విరాళం..
విశ్వేశ్వరుడిని దర్శించుకున్న నీతా అంబానీ, 2. 5 కోట్లు విరాళం..
కాఫీ ప్రియులకు శుభవార్త.. మీ ఆయుష్షు పెరిగినట్టే.. తాజా అధ్యయనంలో
కాఫీ ప్రియులకు శుభవార్త.. మీ ఆయుష్షు పెరిగినట్టే.. తాజా అధ్యయనంలో
Virat Kohli: రన్ మెషీన్ ఖాతాలో చెత్త రికార్డ్..
Virat Kohli: రన్ మెషీన్ ఖాతాలో చెత్త రికార్డ్..