New Smartwatch: మణికట్టుకు మరమనిషి! స్మార్ట్ వాచ్‌లోనూ చాట్ జీపీటీ.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..

ఇటీవల కాలంలో చాట్ జీపీటీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఓపెన్ ఏఐ నుంచి వచ్చిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత చాట్ బాట్ గత కొంతకాలంగా చాలా పాపులర్ అయ్యింది. ఇప్పుడు దీనిని స్మార్ట్ వాచ్ తో ఇంటిగ్రేట్ చేసి క్రాస్ బీట్స్ సరికొత్త ఫీచర్లతో నెక్సస్ మోడల్ ను ఆవిష్కరిస్తోంది. అంతేకాక ఈ స్మార్ట్ వాచ్ లో తొలిసారిగి ఈ-బుక్ రీడర్ ను తీసుకొస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.

New Smartwatch: మణికట్టుకు మరమనిషి! స్మార్ట్ వాచ్‌లోనూ చాట్ జీపీటీ.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..
Crossbeats Nexus Smartwatch
Follow us
Madhu

|

Updated on: Oct 27, 2023 | 4:15 PM

స్మార్ట్ వాచ్ మార్కెట్ బాగా పెరిగింది. అందులో ఉంటున్న అత్యాధునిక ఫీచర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ స్మార్ట్ వాచ్ లను కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా కంపెనీల మధ్య పోటీ వాతావరణం కూడా బాగా పెరిగింది. తక్కువ ధరలతో పాటు కొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్ వాచ్ లను కంపెనీలు లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో దేశీయ బ్రాండ్ అయిన క్రాస్ బీట్స్ ఓ కొత్త స్మార్ట్ వాచ్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దాని పేరు క్రాస్ బీట్స్ నెక్సస్. ఇది మన చాట్ జీపీటీ అనుసంధానంతో వస్తుంది. ఈ సాంకేతికతో మన దేశంలో అందుబాటులోకి వస్తున్న మొట్టమొదటి స్మార్ట్ వాచ్ క్రాస్ బీట్స్ ప్రకటించింది.  ఇటీవల కాలంలో చాట్ జీపీటీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఓపెన్ ఏఐ నుంచి వచ్చిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత చాట్ బాట్ గత కొంతకాలంగా చాలా పాపులర్ అయ్యింది. ఇప్పుడు దీనిని స్మార్ట్ వాచ్ తో ఇంటిగ్రేట్ చేసి క్రాస్ బీట్స్ సరికొత్త ఫీచర్లతో నెక్సస్ మోడల్ ను ఆవిష్కరిస్తోంది. అంతేకాక ఈ స్మార్ట్ వాచ్ లో తొలిసారిగి ఈ-బుక్ రీడర్ ను తీసుకొస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.

ఈ స్మార్ట్ వాచ్ గురించి క్రాస్ బీట్స్ కో ఫౌండర్ అర్చిత్ అగర్వాల్ మాట్లాడుతూ ఒక గొప్ప ఉద్ధేశంతో సరికొత్త ఆవిష్కరణలను తీసుకొస్తున్నట్లు చెప్పారు. చాట్ జీపీటీ అనుసంధానంతో వినియోగదారులకు మంచి అనుభూతిని ఈ స్మార్ట్ వాచ్ అందిస్తున్నారు. అంతేకాక కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీని వినియోగించి స్మార్ట్ వాచ్ లను సరికొత్త లుక్ లో తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు.

క్రాస్ బీట్స్ నెక్సల్ ధర, లభ్యత..

ఈ స్మార్ట్ వాచ్ దీపావళికి ఇండియా లాంచ్ కానుంది. దీని ధర రూ. 5,999గా ఉంది. ఇది రెండు కలర్ ఆప్షన్లు బ్లాక్ అండ్ సిల్వర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రారంభ ఆఫర్ కింద రూ. 999ప్రీ ఆర్డర్ పాస్ ను కంపెనీ అందిస్తోంది. దీని ద్వారా డిస్కౌంట్ ను అందిస్తోంది. అంతేకాక గూడీస్ ను పొందుతారు.

ఇవి కూడా చదవండి

క్రాస్ బీట్స్ నెక్సస్ ఫీచర్లు..

ఈ క్రాస్ బీట్స్ నెక్సస్ స్మార్ట్ వాచ్ ప్రధాన ఫీచర్ చాట్ జీపీటీ ఇంటిగ్రేషన్. దీని ద్వారా ఎటువంటి ఫీచర్లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి అనే విషయంతో ఇంకా క్లారిటీ లేదు. కాగా ఈ స్మార్ట్ వాచ్ లో 2.1 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. 500 కస్టమైజ్డ్ వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి. దీనిలో ఈ-బుక్ రీడింగ్ ఫంక్షన్ కూడా అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ మంచిదే అయినా.. స్మార్ట్ వాచ్ లో బుక్ చదవడం అంత సౌకర్యంగా ఉండకపోవచ్చు.

ఇదికాక మరో ఆసక్తికర ఫీచర్ ఇందులో ఉన్నది ఎంటంటే డైనమిక్ ఐల్యాండ్. ఇది ఐఫోన్లలో ఉండే ఫీచర్. దీని సాయంతో నోటిఫికేషన్లను త్వరితగతిన చూడొచ్చు.

ఇక హెల్త్ ఫీచర్ల విషయానికి వస్తే.. హార్ట్ రేట్ ట్రాకింగ్, బ్లడ్ ఆక్సిజన్ ట్రాకింగ్, బ్లడ్ ప్రెజర్ ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్, యాక్టివిటీ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. జీపీఎస్ డైనమిక్ రూట్ ట్రాకింగ్, అల్టీమీటర్, బారోమీటర్, కంపాస్ వంటి అదనపు ఫీచర్లు ఉంటాయి. దీనిలో బ్యాటరీ సింగిల్ చార్జ్ పై ఏడురోజుల పనిచేస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు