Nokia Feature Phone: యూపీఐ పేమెంట్ ఆప్షన్‌తో రూ. 999కే నోకియా కొత్త ఫోన్.. ఆకట్టుకునే డిజైన్.. ఆకర్షించే ఫీచర్లు..

హెచ్ఎండీ గ్లోబల్ ఆధ్వర్యంలో కొత్త నోకియా ఫీచర్ ఫోన్లు వస్తున్నాయి. ఇప్పటికే పలు మోడళ్లు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు మరో కొత్త వేరియంట్ ను అందుబాటులోకి తెచ్చింది హెచ్ఎండీ గ్లోబల్. నోకియా 105 క్లాసిక్ పేరుతో 2జీ ఫోన్ ని మన దేశంలో లాంచ్ చేసింది. ఇది అల్ఫాన్యూమరిక్ కీప్యాడ్ ను కలిగి ఉంటుంది. అలాగే ఇన్ బిల్ట్ యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్(యూపీఐ) అప్లికేషన్ ను కలిగి ఉంటుంది.

Nokia Feature Phone: యూపీఐ పేమెంట్ ఆప్షన్‌తో రూ. 999కే నోకియా కొత్త ఫోన్.. ఆకట్టుకునే డిజైన్.. ఆకర్షించే ఫీచర్లు..
Nokia 105 Classic Feature Phone
Follow us
Madhu

|

Updated on: Oct 27, 2023 | 3:42 PM

ఒకప్పుడు ఫోన్ అంటే అది నోకియానే. అరచేతిలో చిన్నగా ఇమిడిపోయే ఆ బేసిక్ మోడళ్లకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అయితే అడ్వాన్స్ డ్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో అవి కనుమరుగయ్యాయి. అయితే మరోసారి బేసిక్ ఫీచర్ ఫోన్లు నోకియా లాంచ్ చేస్తోంది. హెచ్ఎండీ గ్లోబల్ ఆధ్వర్యంలో కొత్త నోకియా ఫీచర్ ఫోన్లు వస్తున్నాయి. ఇప్పటికే పలు మోడళ్లు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు మరో కొత్త వేరియంట్ ను అందుబాటులోకి తెచ్చింది హెచ్ఎండీ గ్లోబల్. నోకియా 105 క్లాసిక్ పేరుతో 2జీ ఫోన్ ని మన దేశంలో లాంచ్ చేసింది. ఇది అల్ఫాన్యూమరిక్ కీప్యాడ్ ను కలిగి ఉంటుంది. అలాగే ఇన్ బిల్ట్ యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్(యూపీఐ) అప్లికేషన్ ను కలిగి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

నోకియా 105 క్లాసిక్ ధర, లభ్యత..

ఈ నోకియా 105 క్లాసిక్ ఫీచర్ ఫోన్ ధర రూ. 999గా ఉంది. ఇది చార్ కోల్, బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ 2జీ ఫీచర్ ఫోన్ మన దేశంలో అక్టోబర్ 26 నుంచి అందుబాటులోకి వచ్చింది. నాలుగు వేరియంట్లలో ఇది లభ్యమవుతోంది. సింగిల్ సిమ్, డ్యూయల్ సిమ్, చార్జర్ తో పాటు, చార్జర్ లేకుండా కూడా కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ పై కంపెనీ ఏడాది పాటు రిప్లేస్ మెంట్ గ్యారంటీని అందిస్తోంది.

నోకియా 105 క్లాసిక్ ఫీచర్ ఫోన్ ఫీచర్స్..

ఈ ఫీచర్ ఫోన్ ఆకట్టుకునే డిజైన్ ను కలిగి ఉంటుంది. 800ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ 2జీ ఫోన్లో పలు ఆసక్తికర ఫీచర్లు ఉన్నాయి. వైర్ లెస్ ఎఫ్ఎం రేడియోను అందిస్తుంది. ఇయర్ ఫోన్లు లేకుండానే ఎంచక్కా వినియోగదారులకు ఇష్టమైన స్టేషన్లను పెట్టుకొని ప్రోగ్రామ్లను ఆస్వాదించవచ్చు. ఈ ఫోన్ సింగిల్ సిమ్, డ్యూయల్ సిమ్ ఆప్షన్లలో కూడా లభ్యమవుతోంది. ఈ ఫోన్ మన్నికపై అనేకరకాల పరీక్షలు కూడా నిర్వహించినట్లు కంపెనీ చెబుతోంది. అదనంగా దీనిలో యూపీఐ పేమెంట్స్ ఫీచర్ కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

స్టైలిష్ డిజైన్..

హెచ్ఎండీ గ్లోబల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రవి కున్వర్ మాట్లాడుతూ తాము ఈ అప్ గ్రేడెడ్ మోడల్ ను లాంచ్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని చెప్పారు. ఇంతకుముందు ఉన్న మోడళ్లు అన్నింటి కంటే ఈ 105 క్లాసిక్ మోడల్ చాలా స్టైలిష్ డిజైన్ ను కలిగి ఉంటుందన్నారు. రూ. 1000లోపు బడ్జెట్లో ఇది ఫీచర్ ప్యాక్ గా వస్తుందని చెప్పారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..