Heart Rate Monitor: హార్ట్ రేట్ ఎంతో చెవిలో చెబుతా అంటున్న గూగుల్.. వింటారా? కొత్త ఆవిష్కరణ మామూలుగా లేదుగా..
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తూ మనం రోజూ వాడే వైర్ లెస్ ఇయర్ ఫోన్ల ద్వారానే హార్ట్ రేట్ తెలుసుకునే వెసులుబాటును కల్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దీనిపై పలు అధ్యయనాలు చేసి, పరీక్షించినట్లు కూడా గూగుల్ ప్రకటించింది. అదేంటి? ఇయర్ బడ్స్‌తో హార్ట్ రేట్ ఎలా తెలుస్తుంది అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ కథనం పూర్తిగా చదవండి.
ఆధునిక సాంకేతిక అన్ని రంగాల్లో గొప్ప మార్పులను తీసుకొస్తోంది. నిన్నమొన్నటి వరకూ బ్లడ్ ప్రెజర్(బీపీ), ఆక్సిజన్ శాతం వంటివి తెలుసుకోవాలంటే ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోవాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. డిజిటల్ యంత్రాలు వచ్చాక రోగులే ఇంటి వద్ద ఉండి తెలుసుకునే వెసులుబాటు ఏర్పడింది. ఇక స్మార్ట్ వాచ్‌ల రాకతో పరిస్థితి మరింత మెరుగైంది. మణికట్టుకే పెట్టుకున్న వాచ్ నుంచి హెల్త్, ఫిట్‌నెట్ ట్రాకర్లు వస్తుండటంతో అందరూ వాటిని వినియోగిస్తున్నారు. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తూ మనం రోజూ వాడే వైర్ లెస్ ఇయర్ ఫోన్ల ద్వారానే హార్ట్ రేట్ తెలుసుకునే వెసులుబాటును కల్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దీనిపై పలు అధ్యయనాలు చేసి, పరీక్షించినట్లు కూడా గూగుల్ ప్రకటించింది. అదేంటి? ఇయర్ బడ్స్‌తో హార్ట్ రేట్ ఎలా తెలుస్తుంది అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ కథనం పూర్తిగా చదవండి.
ట్రెండీ గ్యాడ్జెట్‌తో హార్ట్ రేట్..
వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్‌ల వాడకం రోజురోజుకు పెరుగుతోంది. సమావేశాలు, మెట్రో, బస్సులు సహా ప్రతిచోటా ప్రజలు ఈ గా‍్యడ్జెట్‌లను ఉపయోగిస్తున్నారు. వినగలిగే గాడ్జెట్‌ల వినియోగం పెరుగుతున్న దృష్ట్యా, ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్‌ల ద్వారా మీరు మీ హృదయ స్పందన రేటును తెలుసుకునేలా గూగుల్ ఒక సాంకేతికతను అభివృద్ధి చేసింది. అంటే పాటలు వినడంతోపాటు మీ ఆరోగ్య స్థితిని కూడా తెలుసుకోవచ్చు. గూగుల్ శాస్త్రవేత్తలు ఆడియోప్లెథిస్మోగ్రఫీ (ఏపీజీ)ని విజయవంతంగా పరీక్షించారు. ఇందులో అల్ట్రాసౌండ్ సహాయంతో ఇయరబడ్స్ ద్వారా ఒక వ్యక్తి హృదయ స్పందనను కొలుస్తారు. మంచి విషయమేమిటంటే, దీనికి అదనపు సెన్సార్ అవసరం లేదు. ఇయర్ బడ్స్‌లోని యాక్టివ్ నాయిస్ కేన్సలేషన్(ఏఎన్‌సీ) సాంకేతికత ఒకటి ఉంటే సరిపోతుంది. అంతేకాక దీని వల్ల చెవికి ఎటువంటి చెడు ప్రభావం ఉండదు.
అధ్యయనం ఇలా..
గూగుల్ శాస్త్రవేత్తలు 153 మందిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఏపీజీ సాంకేతికత కలిగిన ఇయర్ బడ్స్ అందించిన డేటాను ఈసీజీ, పీపీజీ లతో పోల్చి చూశారు. ఇలా చూసినప్పుడు ఏపీజీతో కూడిన ఇయర్ బడ్స్ చాలా కచ్చితమైన డేటాను అందించినట్లు పరిశోధకులు వెల్లడించారు. హార్ట్ రేట్ లో 3.21శాతం, హార్ట్ రేట్ వేరియబులిటీలో 2.70శాతం మాత్రమే తేడా కనిపించినట్లు ప్రకటించారు. అంటే అందులో పెద్దగా లోపం లేదన్నది స్పష్టమైంది.
ఎలా లెక్కిస్తుంది..
ఆడియోప్లెథిస్మోగ్రఫీ(ఏపీజీ) అనేది వ్యక్తి హార్ట్ బీట్‌ను లెక్కించడానికి ఉపయోగించే టెక్నిక్. ఇది అల్ట్రాసౌండ్‌ను వినియోగించుకుంటున్నారు. ఇయర్ బడ్‌లోని స్పీకర్ ద్వారా లో-ఇంటెన్సిటీ గల అల్ట్రాసౌండ్ సిగ్నల్‌ను పంపి.. లోపలి నుంచి వచ్చే ప్రతిధ్వనులను ఆన్ బోర్డ్ మైక్రోఫోన్లను ఉపయోగించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అంటే అల్ట్రాసౌండ్ తరంగాలు.. చెవి గుండా లోపలికి వెళ్లి తిరిగి మైక్‌కి వస్తాయి. రక్తనాళాలలో మార్పులను హృదయ స్పందనలతో అల్ట్రాసౌండ్ ప్రతిధ్వనులను అడ్జస్ట్ చేస్తాయి. సాధారణంగా గుండె కొట్టుకునేటప్పుడు రక్తనాళాలు నిరంతరం విస్తరించడం, సంకోచించడం చేస్తాయి. వాటి ఆకారంలో మార్పులు అల్ట్రాసౌండ్ తరంగాలలో వివిధ మార్గాల్లో ప్రతిబింబిస్తాయి. ఈ అల్ట్రా సౌండ్ ప్రతి ధ్వనులను విశ్లేషించడం ద్వారా గూగుల్ సంస్థ హార్ట్ రేట్ ను లెక్కించేందుకు ప్రయత్నిస్తోంది.
సరికొత్త యాక్టివ్ ఇన్-ఇయర్ హెల్త్ సెన్సింగ్ పద్ధతిని ప్రవేశపెట్టామని గూగుల్ తన బ్లాగ్‌పోస్ట్ తెలిపింది. ఏపీజీకి అదనపు సెన్సార్‌లను జోడించకుండా హృదయ స్పందన రేటు, హృదయ స్పందన వేరియబిలిటీ లెక్కించామన్నారు. అందుకు ప్రస్తుతం ఇయర్‌బడ్స్‌లో ఉన్న ఏఎన్‌సీ సాంకేతికతతో పాటు ఆడియోప్లెథిస్మోగ్రఫీ(ఏపీజీ)నీ వినియోగించి లెక్కించామన్నారు.
సాఫ్ట్‌వేర్ అప్ గ్రేడ్ చాలు..
చిన్న సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో ఇయర్‌బడ్‌లు, హెడ్‌ఫోన్‌లు హృదయ స్పందన రేటును చెబుతాయి. గూగుల్ బ్లాగ్ పోస్ట్ ప్రకారం, ఏపీజీ ద్వారా ఏదైనా ట్రూ వైర్‌లెస్ స్టీరియో (టీడబ్ల్యూఎస్) యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్‌లను ఒక సాధారణ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌తో స్మార్ట్ సెన్సింగ్ హెడ్‌ఫోన్‌లుగా మారుస్తుంది. వినియోగదారులు ఏ పనుల్లో ఉన్న అది సజావుగా పనిచేస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..