నేషనల్ పార్క్‌లో కనిపించిన అరుదైన బంగారు పులి.. రాష్ట్ర ముఖ్యమంత్రి షేర్‌ చేసిన ఫోటో వైరల్‌..

ప్రస్తుతం, బంగారు పులుల సంఖ్య తగ్గుతోంది. కాబట్టి అవి అంతర్జాతీయంగా అంతరించిపోతున్న జాతిగా పరిగణించబడుతున్నాయి.  ఈ పులి మొదటి ఫోటో 2020 లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రపంచంలో ఇదే ఏకైక బంగారు పులి అని చాలా మంది పేర్కొన్నారు. కానీ, కజిరంగా నేషనల్ పార్క్‌లో అలాంటి నాలుగు పులులు ఉన్నాయి. కానీ, ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి.

నేషనల్ పార్క్‌లో కనిపించిన అరుదైన బంగారు పులి.. రాష్ట్ర ముఖ్యమంత్రి షేర్‌ చేసిన ఫోటో వైరల్‌..
Rare TigerImage Credit source: @himantabiswa/X
Follow us
Jyothi Gadda

| Edited By: TV9 Telugu

Updated on: Jun 25, 2024 | 12:10 PM

అస్సాం రాష్ట్రంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో అరుదైన గోల్డెన్ టైగర్‌ కనిపించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బంగారు వర్ణంలో కనిపించిన పులి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. గోల్డ్‌ కలర్‌లో ఉన్న పులి అద్భుతమైన ఫోటోలు నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. సీఎం హిమంత ఫోటోను షేర్ చేస్తూ, “మెజెస్టిక్ బ్యూటీ అంటే ఇదే! కాజిరంగా నేషనల్ పార్క్‌లో అరుదైన బంగారు పులిని చూసే అదృష్టం కలిగింది” అని రాశారు.

ఈ అరుదైన పులి అస్సాంలోని గోలాఘాట్, నాగావ్ జిల్లాల్లో ఉన్న కజిరంగా నేషనల్ పార్క్‌లో కనిపించింది. ఈ ఫోటోకి సోషల్ మీడియాలో చాలా నుంచి విశేష స్పందన లభించింది. చాలా మంది ఈ ఫోటోపై అద్భుతమైన, అమూల్యమైనదని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే, బంగారు పులి చాలా అరుదైన రకం పులి అంటున్నారు. ఇది తూర్పు భారతదేశం, ఆగ్నేయాసియాలో మాత్రమే కనిపిస్తుంది. దీని రంగు సాధారణ పులుల కంటే పసుపు లేదా నారింజ రంగులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం, బంగారు పులుల సంఖ్య తగ్గుతోంది. కాబట్టి అవి అంతర్జాతీయంగా అంతరించిపోతున్న జాతిగా పరిగణించబడుతున్నాయి.  ఈ పులి మొదటి ఫోటో 2020 లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రపంచంలో ఇదే ఏకైక బంగారు పులి అని చాలా మంది పేర్కొన్నారు. కానీ, కజిరంగా నేషనల్ పార్క్‌లో అలాంటి నాలుగు పులులు ఉన్నాయి. కానీ, ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..