Cycling Health Benefits: రోజూ సైక్లింగ్ తో బెల్లీ ఫ్యాట్ మాయం.. మరెన్నో ప్రయోజనాలు..! తెలిస్తే..

సుమారు 40 - 50 సంవత్సరాల క్రితం తిరిగి చూస్తే ప్రజలు సైకిల్‌ను ప్రధాన రవాణా మార్గంగా ఉపయోగించారు. కానీ క్రమంగా సైకిల్ కనుమరుగై దాని స్థానంలో మోటారు వాహనాలు ఆక్రమించాయి. కానీ, నేడు మళ్లీ సైకిల్ మన జీవితంలో తన స్థానాన్ని సంపాదించుకుంది..ప్రస్తుతం సైక్లింగ్‌ ప్రజల జీవన విధానంలో ఒక గొప్ప వ్యాయామ సాధనంగా మారింది. సైక్లింగ్‌ అనేది కాలుష్య రహిత ప్రయాణ విధానం. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజూ అరగంట పాటు సైకిల్‌ చేస్తే స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం, మానసిక వ్యాధుల నుంచి బయటపడవచ్చని పలు పరిశోధనల్లో తేలింది.

Cycling Health Benefits: రోజూ సైక్లింగ్ తో బెల్లీ ఫ్యాట్ మాయం.. మరెన్నో ప్రయోజనాలు..! తెలిస్తే..
Cycling
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 25, 2024 | 7:00 PM

నేడు పర్యావరణ కాలుష్యం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న అంశం..పెరిగి పోయిన వాహనాల రద్దీ, పరిశ్రమల కారణంగా రోజు రోజుకు కాలుష్యం తీవ్రత విపరీతంగా పెరిగిపోతుంది. అందుకే సైకిల్‌ వాడకం ఎలాంటి పర్యావరణ కాలుష్యాన్ని ఉత్పత్తి చేయదు. సైకిల్ తొక్కడం వల్ల శరీరం ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటుంది. సైక్లింగ్ అనేది గొప్ప వ్యాయామంగా చెప్పాలి. కానీ, ఇది చాలా సరదాగా ఉంటుంది. సైక్లింగ్ కూడా మంచి కార్డియో వ్యాయామం.. ఇది ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది.

సైక్లింగ్ కండరాల బలాన్ని పెంచుతుంది..

సైక్లింగ్ అనేది పూర్తి శరీర వ్యాయామం. రోజువారీ సైక్లింగ్‌లో అరచేతుల నుండి పాదాల వరకు అన్ని కండరాలను ఉపయోగించడం జరుగుతుంది. ఇది కొవ్వును కాల్చడంలో సహాయపడుతుంది. విపరీతంగా చెమట పట్టేలా చేస్తుంది. సైక్లింగ్ కాళ్లు, వీపు, భుజాలను బలపరిచే కండరాలకు మరింత బలాన్ని అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

మానసిక ఆరోగ్యానికి మంచిది ..

క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారిలో మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సైక్లింగ్‌తో సహా వివిధ రకాల వ్యాయామాలను క్రమం తప్పకుండా చేసే వ్యక్తులు, మిగతా వారికంటే.. మానసికంగా 32 శాతం ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. డిప్రెషన్‌తో బాధపడేవారికి సైక్లింగ్ చాలా ఉపయోగపడుతుంది.

ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి సైకిల్ తొక్కడం మంచిది..

సైకిల్ తొక్కడం అనేది బరువు తగ్గడానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి. సైకిల్ తొక్కేటప్పుడు, ఎక్కువసేపు సైకిల్ తొక్కడం వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి

సైక్లింగ్ ఒత్తిడిని తగ్గిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

ఒత్తిడి నేడు అనేక వ్యాధులకు ప్రధాన కారణంగా పరిగణించబడుతుంది. ఇది బరువు పెరగడం, మధుమేహం, ఉబ్బసం, ఆందోళన, జీర్ణ సమస్యలు, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, నిరాశ వంటి మరిన్ని అనేక సమస్యలకు దారి తీస్తుంది. అయినప్పటికీ, సైక్లింగ్ అనేది ఒక మంచి వ్యాయామం. ఇది ఒత్తిడిని అధిగమించడంలో మీకు సహాయపడుతుంది.

శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి మంచిది ..

సాధారణ సైక్లింగ్ మొత్తం శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. కొండలు లేదా మైదానాల్లో సైకిల్ తొక్కడం వల్ల మీ కండరాలన్నింటికీ వర్కవుట్ అవుతుంది. శరీర కొవ్వు తగ్గుతుంది. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవడానికి సైక్లింగ్ ఉత్తమమైన వ్యాయామం.

మంచి నిద్ర కోసం సైకిల్ తొక్కడం..

వ్యాయామం, మంచి నిద్రకు అవినాభావ సంబంధం ఉంది. మంచి వర్కవుట్ చేస్తే మంచి నిద్ర వస్తుందని అందరికీ తెలుసు. ప్రతిరోజూ సైకిల్ తొక్కడం వల్ల మంచి నిద్ర వస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..