AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anakapalli: డోలీలతో గిరిజనుల పాద యాత్ర.. ఎందుకో తెలుసా..?!

వాళ్ళంతా ఆదివాసీలు.. కొండ శిఖర గ్రామాల్లో నివాసముండేవారు. రెండు వందల యాభై మంది వరకు జనాభా. అంతా ఏకతాటిపైకి వచ్చారు. డోలీలతో యాత్ర చేపట్టారు. డోలీలతో యాత్ర నిర్వహించారు. పాదయాత్ర చేస్తూ తమ గోడు వినండి మహాప్రభో అంటూ నినదించారు. వాళ్ల ఆవేదన ఏంటో తెలుసా..?

Anakapalli: డోలీలతో గిరిజనుల పాద యాత్ర.. ఎందుకో తెలుసా..?!
Tribals March
Maqdood Husain Khaja
| Edited By: Jyothi Gadda|

Updated on: Jan 25, 2024 | 7:54 PM

Share

విశాఖపట్టణం, జనవరి 25; అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ కొండ శిఖరంలో గిరిజనగ్రామాలున్నాయి. పెదగరువు, పాత లో సింగి, కొత్త లోసింగి గ్రామాల్లో 250 మంది పీవిటీజిలు నివాసముంటున్నారు. ఆయా గ్రామాల గిరిజనులంతా ఒకచోట చేరారు. డోలీలతో యాత్ర నిర్వహించారు. పాదయాత్ర చేస్తూ తమ గోడు వినండి మహాప్రభో అంటూ నినదించారు.

– వాళ్ల ఆవేదన ఏంటో తెలుసా..? ఆర్ల పంచాయతీలోని కొండ శిఖర రెవిన్యూ గ్రామాల్లో… అడవి బిడ్డలకు నాన్ షెడ్యూల్ ట్రైబల్స్ గా గుర్తించాలని దశాబ్దాలుగా వాళ్ళ అభ్యర్థన. తరాలు మారుతున్న తలరాతలు మారడం లేదని వాళ్ళ ఆవేదన. కనీస సౌకర్యాలు మాట దేవుడెరుగు.. తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూములకు రక్షణ లేకుండా పోయిందని వారిలో ఆందోళన.

– గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో… అనారోగ్యం పాలైనా, గర్భిణీలకు అత్యవసరమైనా నరకయాతన అనుభవిస్తున్నామని అంటున్నారు ఆ గిరిజనులు. నెలలో నాలుగు రోజులు గర్భిణీ బాలింత డోలి మార్గ ద్ద్వారా బుచ్చింపేట ఆస్పత్రికి తరలించాల్సి వస్తుందని అంటున్నారు. గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామన్న హామీలు కార్యరూపం దాల్చక… సొంతంగా చందాలు వేసుకొని రోడ్డు నిర్మాణం చేసుకుంటున్నామంటున్నారు ఆదివాసీలు. కనీసం మా గ్రామంలో ఆశా కార్యకర్తలేరని, అంగన్వాడి కేంద్రం లేదని.. కొన్నిచోట్ల కరెంటు సౌకర్యం కూడా లేదని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

– గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన… తమ సమస్యలు పరిష్కారం చేయాలని డోలీ మోసారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే గోవిందరావు, పి టి జి సంఘం నాయకులు కిల్లో నరసయ్య, గిరిజనులు పాల్గొన్నారు.