మీ కళ్లల్లోంచి తరచూ నీరు కారుతోందా? కారణం ఇదేనట..! ఏం చేయాలంటే..

పంచేంద్రియాలలో కళ్లు అత్యంత ప్రధానమైన, అందమైన అవయవం. కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కళ్లలో తరచుగా నీరు కారడం అనేది కొందరిని వేధించే సమస్య. అనేక కారణాల వల్ల కళ్లలో నీరు రావచ్చు. మీరు చల్లని వాతావరణంలో బయటికి వెళ్లినప్పుడు మాత్రమే మీరు దానిని అనుభవిస్తే, అది ఎపిఫోరా అని పిలువబడే శీతాకాలపు అనారోగ్యం కావచ్చు. కళ్లలో నీళ్లు రావడానికి కారణాలేంటో చూద్దాం...

Jyothi Gadda

|

Updated on: Jan 27, 2024 | 5:36 PM

పుప్పొడి, దుమ్ము లేదా పెంపుడు జంతువుల చర్మం వంటివి కళ్లలో పడినప్పుడు అలెర్జీలు వస్తాయి. దాంతో కళ్ల వెంట నీళ్లు కారటం ఏర్పడుతుంది. కొందరికి పొగ, రసాయనాలు మొదలైన వాటి వల్ల కలిగే అలర్జీల వల్ల కూడా కళ్లలో నీరు కారుతుంది. కళ్లు తరచూ పొడిబారడం కూడా ఈ సమస్యకున్న ప్రధాన కారణం.

1 / 6
వాయు కాలుష్యం కూడా కొంతమందిలో కన్నీటికి కారణం కావచ్చు. కంజెక్టివైటిస్ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా కన్నీరు ఆగకుండా కారే సమస్యకు దారి తీయొచ్చు. కంటిలో ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కూడా కళ్లలో నీరు కారుతుంది.

2 / 6
కండ్లకలక వంటి బాక్టీరియల్ లేదా వైరల్ కంటి ఇన్ఫెక్షన్ల వల్ల కూడా కళ్లలో నీరు కారుతుంది. కన్నీటి నాళాలలో అడ్డంకులు ఏర్పడటం వల్ల కూడా కళ్లలోంచి నీరు కారుతుంది.. కారణమేమిటో గుర్తించి చికిత్స తీసుకోవాలి.

3 / 6
కళ్లలోంచి నీరు ఎక్కువగా కారుతున్నట్టయితే.. చూపు మసకబారడం, కంటికి అసౌకర్యం, ఎరుపు, కళ్లలో దురద వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రకాశవంతమైన కాంతిలో చూడటం కష్టంగా మారుతుంది.

4 / 6
కంటి పరిశుభ్రతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. పొగ, ధూళి, బలమైన రసాయనాల నుండి జాగ్రత్తగా ఉండాలి. అలాంటి సందర్భాల్లో కళ్లద్దాలు వంటివి ధరించటం ముఖ్యం. వీలైనంత వరకు అలెర్జీలకు కారణమయ్యే కారకాలను గుర్తించడం, వాటికి దూరంగా ఉండటం మంచిది.

5 / 6
కన్నీరు ఆగకుండా కారుతున్న సందర్భాల్లో గోరువెచ్చని వస్త్రంతో కళ్లు అద్దుకుంటే టియర్ డక్ట్స్‌లోని అడ్డంకులు తొలగి ఉపశమనం లభిస్తుంది. సమస్య మరీ ఇబ్బంది పెడుతుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

6 / 6
Follow us