- Telugu News Photo Gallery Cinema photos Ram Charan Game Changer and buchi babu Movie Update details Telugu Heroes Photos
Ram Charan: ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ రెడీ చేస్తున్న రామ్ చరణ్.. ఇకపై యుద్ధమే.
ఒక్క అప్‌డేట్ చెప్పండయ్యా.. సింగిల్ అప్‌డేట్ ఇవ్వండయ్యా అంటూ గేమ్ ఛేంజర్ మేకర్స్‌ను రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా రోజులుగా అడుగుతున్నారు. కానీ వాళ్ల నుంచి మాత్రం నో రియాక్షన్. అది చూసి ఫ్యాన్స్‌కు కూడా విసుగు వచ్చేసింది. అయితే ఎడారిలో ఎండమావిలా ఓ గుడ్ న్యూస్ వచ్చేలా ఉందిప్పుడు. మరి ఏంటది..? ఎప్పుడు రానుంది..? రాజమౌళి, శంకర్ లాంటి దర్శకులతో సినిమాలకు కమిట్ అయినపుడు తెలియకుండానే హీరోలకు భారీ గ్యాప్ తప్పదు.
Updated on: Jan 27, 2024 | 6:06 PM

ఒక్క అప్‌డేట్ చెప్పండయ్యా.. సింగిల్ అప్‌డేట్ ఇవ్వండయ్యా అంటూ గేమ్ ఛేంజర్ మేకర్స్‌ను రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా రోజులుగా అడుగుతున్నారు. కానీ వాళ్ల నుంచి మాత్రం నో రియాక్షన్. అది చూసి ఫ్యాన్స్‌కు కూడా విసుగు వచ్చేసింది.

అయితే ఎడారిలో ఎండమావిలా ఓ గుడ్ న్యూస్ వచ్చేలా ఉందిప్పుడు. మరి ఏంటది..? ఎప్పుడు రానుంది..? రాజమౌళి, శంకర్ లాంటి దర్శకులతో సినిమాలకు కమిట్ అయినపుడు తెలియకుండానే హీరోలకు భారీ గ్యాప్ తప్పదు.

వాళ్లెలాగూ త్వరగా సినిమాలు పూర్తి చేయలేరు. బోనస్ కింద రామ్ చరణ్ అయితే రాజమౌళి తర్వాత శంకర్‌తో సినిమాకు కమిటయ్యారు. ట్రిపుల్ ఆర్ వచ్చి రెండేళ్లవుతున్నా.. గేమ్ ఛేంజర్ ఇంకా రాలేదు.

ఇండియన్ 2 కారణంగా గేమ్ ఛేంజర్ ఆలస్యం అవుతూనే ఉంది. ముందు కమల్ హాసన్ ప్రాజెక్ట్ పూర్తి చేసాకే.. చరణ్ సినిమాపై ఫోకస్ చేస్తున్నారు శంకర్. ఇండియన్ 2 పూర్తైనా.. దానికి పార్ట్ 3 కూడా ఉండటంతో.. ఆ ప్రభావం కూడా చరణ్ సినిమాపైనే పడనుంది.

అందుకే అనుకున్న దానికంటే మరింత ఆలస్యమవుతుంది గేమ్ ఛేంజర్. సినిమా సంగతి పక్కనబెట్టండి.. దాన్నెప్పుడు విడుదల చేసినా పర్లేదు కానీ కనీసం అప్‌డేట్స్ అయినా ఇవ్వండనేది ఫ్యాన్స్ డిమాండ్. ఇప్పుడు అదే చేయాలని చూస్తున్నారు మేకర్స్.

మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ విడుదల చేయనున్నారు. దీన్ని భారీ స్థాయిలో విడుదల చేయాలని ఏర్పాట్లు జరుగుతున్నాయి. గేమ్ ఛేంజర్ మాత్రమే కాదు.. బుచ్చిబాబు సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కూడా అదే రోజు రానుంది.

అన్నీ కుదిర్తే ఎప్రిల్ నుంచే RC16 సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు చరణ్. ఈ లోపు గేమ్ ఛేంజర్ పూర్తి చేయాలి అనేది చరణ్ ప్లాన్. మార్చ్ 27న ఇటు గేమ్ ఛేంజర్ టీజర్‌తో పాటు.. బుచ్చిబాబు సినిమా టైటిల్ రివీల్ చేస్తారని తెలుస్తుంది.




