- Telugu News Photo Gallery Cinema photos 6 Tollywood movies which are a rare record in overseas with huge collection
Overseas Record: ఈ 6 సినిమాలకు మాత్రమే సాధ్యమైన ఓవర్సీస్ అరుదైనా రికార్డు.. భారీ కలెక్షన్స్ తో జెండా పాతిన మూవీస్..
ఒకప్పుడు ఓవర్సీస్ మార్కెట్ నుంచి 10 కోట్లు వస్తేనే అబ్బో అద్భుతం అనుకునే వాళ్లు నిర్మాతలు.. ఇక హీరోలైతే 10 కోట్లకే పండగ చేసుకునే వాళ్లు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. అక్కడ్నుంచే 50 కోట్లు వచ్చేస్తున్నాయి. కాకపోతే అది చాలా అరుదు. 9 ఏళ్లలో కేవలం 6 సినిమాలు మాత్రమే ఈ ఫీట్ అందుకున్నాయి. మరి ఆ అరడజన్ సినిమాలేంటి.. అందులో లేటెస్ట్ ఎంట్రీ ఏది..?
Updated on: Jan 27, 2024 | 4:48 PM

ఓవర్సీస్ మార్కెట్ అనేది ఒకప్పుడు బోనస్.. కానీ ఇప్పుడు అదే కలెక్షన్లను, సినిమా రేంజ్‌ను డిసైడ్ చేసే స్థాయికి ఎదిగిపోయింది. స్టార్స్ అందరికీ అక్కడ అదిరిపోయే మార్కెట్ వచ్చేసింది. అయితే ఎంత మార్కెట్ ఉన్నా 50 కోట్లు అనేది మాత్రం చాలా మంది హీరోలకు అందని ద్రాక్షే. దాన్ని అందుకున్నది ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ మాత్రమే.. తాజాగా తేజ సజ్జా ఈ లిస్టులో ఎంట్రీ ఇచ్చారు.

ఓవర్సీస్‌లో 50 కోట్ల మార్క్ అందుకోవడం అనేది చిన్న విషయం కాదు. 2015లో బాహుబలితో మొదటిసారి ఆ ఫీట్ చేసి చూపించారు దర్శక ధీరుడు రాజమౌళి. 9 ఏళ్ళ కిందే బాహుబలి ఓవర్సీస్ మార్కెట్‌లో 85 కోట్లు వసూలు చేసింది.. ఆ తర్వాత 2017లో బాహుబలి 2 ఏకంగా ఓవర్సీస్ నుంచే 290 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

సాహో సినిమా కూడా 2019లో 82 కోట్ల వరకు వసూలు చేసింది. రాజమౌళి సపోర్ట్ లేకుండా ప్రభాస్ ఈ ఫీట్ సాధించారు. ఆ తర్వాత 2022లో ట్రిపుల్ ఆర్ మరోసారి ఓవర్సీస్ కలెక్షన్స్ రికార్డ్స్ తిరగరాసింది. ఈ చిత్రం 200 కోట్లకు పైగానే విదేశాల నుంచి రాబట్టింది. దీని తర్వాత మొన్న సలార్ సినిమాతో 175 కోట్లకు పైగానే గ్రాస్ వసూలు చేసారు ప్రభాస్.

తాజాగా హనుమాన్ సినిమా కూడా ఓవర్సీస్ నుంచి 50 కోట్లు గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం అక్కడ అద్భుతాలు చేస్తుంది. చాలా మంది స్టార్ హీరోలకు సాధ్యం కాని ఫీట్ చేసి చూపించింది హనుమాన్ సినిమా. 13 రోజుల్లోనే ఓవర్సీస్‌లో 50 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఆరో సినిమాగా రికార్డ్ తిరగరాసింది హనుమాన్.