- Telugu News Photo Gallery Cinema photos Icon Star Allu Arjun Next Movies List after pushpa 2 goes viral in social media Telugu Heroes Photos
Allu Arjun: పుష్ప 2 తర్వాత బన్నీ చేయబోయే సినిమాలు ఇవే.! లిస్ట్ లో బోయపాటి కూడా..
అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఏంటి..? పుష్ప 2 తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేయబోతున్నారు..? అదేంటి త్రివిక్రమ్‌తో ఉండబోతుందని ఆల్రెడీ అనౌన్స్ చేసారు కదా అనుకోవచ్చు. ఇది సినిమా ఇండస్ట్రీ.. ఇక్కడ రాత్రికి రాత్రే కాంబినేషన్స్ మారిపోతుంటాయి. ఈ మారిన కాంబినేషన్స్‌లో అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నారు..? పుష్ప 2 రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేదు.. అనుకున్నట్లుగానే ఆగస్ట్ 15 నుంచి పుష్ప గాడి రూల్ ఇండియాలో ఉంటుందని మరోసారి చెప్పారు దర్శక నిర్మాతలు.
Updated on: Jan 27, 2024 | 5:13 PM

అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఏంటి..? పుష్ప 2 తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేయబోతున్నారు..? అదేంటి త్రివిక్రమ్‌తో ఉండబోతుందని ఆల్రెడీ అనౌన్స్ చేసారు కదా అనుకోవచ్చు. ఇది సినిమా ఇండస్ట్రీ.. ఇక్కడ రాత్రికి రాత్రే కాంబినేషన్స్ మారిపోతుంటాయి.

ఈ మారిన కాంబినేషన్స్‌లో అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నారు..? పుష్ప 2 రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేదు.. అనుకున్నట్లుగానే ఆగస్ట్ 15 నుంచి పుష్ప గాడి రూల్ ఇండియాలో ఉంటుందని మరోసారి చెప్పారు దర్శక నిర్మాతలు.

దాంతో బన్నీ తర్వాతి సినిమాపై చర్చ మొదలైందిపుడు. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ప్రకటించినా.. అది ఇంకాస్త ఆలస్యమయ్యేలా ఉంది. దాంతో బోయపాటి శ్రీను సడన్‌గా రేసులో ముందుకొచ్చారు.

2016లో బన్నీ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన సరైనోడు బ్లాక్‌బస్టర్ అయింది. సీనియర్ హీరోలు కాకుండా.. ఈ జనరేషన్ హీరోలలో బోయపాటి హిట్ కొట్టిన హీరో అల్లు అర్జున్ మాత్రమే. ఈ కాంబోనే మరోసారి రిపీట్ కానుంది.

గీతా ఆర్ట్స్‌లోనే బోయపాటి తర్వాతి సినిమా ఉండబోతుందని అధికారికంగా కన్ఫర్మేషన్ వచ్చింది. స్కంద ఫ్లాపైనా.. ఈయనపై నమ్మకంతో మరో ఛాన్స్ ఇచ్చారు అల్లు అరవింద్.

అయితే బోయపాటి తర్వాతి సినిమా బన్నీతోనే అయినా.. అల్లు అర్జున్ తర్వాతి సినిమా మాత్రం అట్లీతో ఉండే ఛాన్స్ ఉంది. ఆ ప్రాజెక్ట్ అయ్యాక బోయపాటి సినిమాపై ఫోకస్ చేయనున్నారీయన.

అప్పటి వరకు స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నారు ఈ మాస్ డైరెక్టర్. మొత్తానికి అట్లీ, బోయపాటి సినిమాలతో మరో మూడేళ్లు బిజీ అయిపోయారు బన్నీ.




