Tamarind Seeds: చింత గింజల ఉపయోగాలు తెలిస్తే ఒక్క గింజ పడేయరు..ఇలా వాడితే డార్క్‌స్పాట్‌ సమస్యకు చక్కటి పరిష్కారం..

ఇలా రాయడం వల్ల మెలనోసైట్స్‌లో అధికంగా ఉత్పత్తి అయ్యే టైరోసోనేస్ ఎంజైమ్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇది మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. నల్ల మచ్చలను తగ్గిస్తుంది. డార్క్ స్పాట్స్ సమస్యతో బాధపడేవారు ఎండకు దూరంగా ఉండడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది మరిన్ని సమస్యలను కలిగిస్తుంది. ఎండలో బయటకు వెళితే కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

Tamarind Seeds: చింత గింజల ఉపయోగాలు తెలిస్తే ఒక్క గింజ పడేయరు..ఇలా వాడితే డార్క్‌స్పాట్‌ సమస్యకు చక్కటి పరిష్కారం..
Tamarind Seeds
Follow us

|

Updated on: Jan 27, 2024 | 3:52 PM

Benefits of Tamarind Seeds: ప్రస్తుతం చాలా మందిలో ముఖంపై నల్ల మచ్చలు ఇబ్బంది పెడుతున్నాయి. ఆడవాళ్లు, మగవాళ్లు అనే తేడా లేకుండా నల్ల మచ్చలు కనిపిస్తాయి. దీని వల్ల ఎలాంటి హాని జరగదు కానీ ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది. మెలనోసైట్లు సాధారణంగా చర్మం క్రింద పొరలలో ఉంటాయి. అవి మెలనిన్‌ను విడుదల చేస్తాయి. మెలనిన్‌ను ఉత్పత్తి చేసే మెలనోసైట్‌ల ద్వారా టైరోసోనేస్ అనే ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఎంజైమ్ అధిక ఉత్పత్తి నల్ల వర్ణద్రవ్యం ఎక్కువ ఉత్పత్తికి దారితీస్తుంది. డార్క్ పిగ్మెంట్ విపరీతంగా ఉత్పత్తి కావడం వల్ల చర్మంపై డార్క్ స్పాట్స్ వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందుకోసం డార్క్ స్పాట్స్ సమస్యతో బాధపడేవారు మార్కెట్ లో లభించే మందులను వాడకూడదు. మన ఇంట్లో రోజూ వంటల్లో వాడే చింత పండు మిమ్మల్ని ఈ సమస్య నుంచి బయటపడవేస్తుంది.

డార్క్‌స్పాట్స్‌ సమస్యకు చింత గింజలు చాలా మేలు చేస్తాయి. ఇందులోని ఔషధ గుణాలు సమస్యను తగ్గిస్తాయి. వీటిని ఉపయోగించడం వల్ల డార్క్ స్పాట్స్ ను దూరం చేసుకోవచ్చునని నిపుణుల పరిశోధనలో తేలింది. ఎండిన చింత గింజలను పొడి చేసి తేనెతో కలిపి నల్లటి మచ్చలపై అప్లై చేయాలి. ఇలా రాయడం వల్ల మెలనోసైట్స్‌లో అధికంగా ఉత్పత్తి అయ్యే టైరోసోనేస్ ఎంజైమ్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇది మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. నల్ల మచ్చలను తగ్గిస్తుంది.

చింతపండు మీ చర్మ ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగుపరుస్తుంది. చింతపండు గింజల పదార్దాలు ప్రత్యేక సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని తేమగా, వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తాయి. మీరు మీ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, పోషణకు, ప్రకాశవంతంగా మార్చడానికి మీరు చింతపండు గింజల పొడిని నీరు లేదా తేనెతో కలిపి ఫేస్ మాస్క్‌గా ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

అలాగే, నల్లమచ్చలతో బాధపడేవారు బీట్‌రూట్‌ను గుడ్డలో వేసి రసాన్ని పిండాలి. రసంలో దూదిని ముంచి మచ్చలపై రాయండి. ఇలా చేయడం వల్ల మచ్చలు పోతాయి.

ముఖంపై మచ్చలను తగ్గించడంలో టమోటాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. టమాటా గుజ్జును మచ్చలపై రాసి చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే క్రమంగా మచ్చలు తగ్గుముఖం పడుతుంటాయి.

ముఖంపై ఇబ్బందిపెట్టే నల్లమచ్చలకు కలబంద కూడా దివ్యౌషధంగా పనిచేస్తుంది. కలబందను మచ్చలపై రాస్తే ముఖంపై ఉన్న మచ్చలు పోతాయి. డార్క్ స్పాట్స్ సమస్యతో బాధపడేవారు ఎండకు దూరంగా ఉండడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది మరిన్ని సమస్యలను కలిగిస్తుంది. ఎండలో బయటకు వెళితే కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆ పథకంలో నెలకు ఐదు వేల పెట్టుబడితో లాభాల పంట
ఆ పథకంలో నెలకు ఐదు వేల పెట్టుబడితో లాభాల పంట
చెర్రీలను రోజూ తింటే శరీరంలో కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోతుంది..
చెర్రీలను రోజూ తింటే శరీరంలో కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోతుంది..
ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
మొన్ననే ఎంగేజ్‌మెంట్.. ఇంతలోనే బ్రేకప్ .. పెళ్లి కాకుండానే..
మొన్ననే ఎంగేజ్‌మెంట్.. ఇంతలోనే బ్రేకప్ .. పెళ్లి కాకుండానే..
అధికారులకు కీలక ఆదేశాలు ఇవ్వనున్న చంద్రబాబు
అధికారులకు కీలక ఆదేశాలు ఇవ్వనున్న చంద్రబాబు
నేషనల్‌ క్రష్‌ రష్మికకి కో స్టార్స్ మీద ఎప్పుడైనా క్రష్‌ కలిగిందా
నేషనల్‌ క్రష్‌ రష్మికకి కో స్టార్స్ మీద ఎప్పుడైనా క్రష్‌ కలిగిందా
ట్యాక్స్ రీఫండ్ ఇంకా జమ కాలేదా? స్టేటస్‌ను ఇలా తనిఖీ చేసుకోండి..
ట్యాక్స్ రీఫండ్ ఇంకా జమ కాలేదా? స్టేటస్‌ను ఇలా తనిఖీ చేసుకోండి..
మీ అనుమతి లేకుండానే వాట్సాప్‌ గ్రూపుల్లో యాడ్‌ చేస్తున్నారా?
మీ అనుమతి లేకుండానే వాట్సాప్‌ గ్రూపుల్లో యాడ్‌ చేస్తున్నారా?
వర్షా కాలంలో జబ్బులను దూరం చేసే అల్లం.. తెలిస్తే వదిలి పెట్టరు..
వర్షా కాలంలో జబ్బులను దూరం చేసే అల్లం.. తెలిస్తే వదిలి పెట్టరు..
ఆగి ఉన్న విశాఖ - కోర్బా ట్రైన్‌లో చెలరేగిన మంటలు.. 4 బోగీలు దగ్ధం
ఆగి ఉన్న విశాఖ - కోర్బా ట్రైన్‌లో చెలరేగిన మంటలు.. 4 బోగీలు దగ్ధం