AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Jugaad: కుక్కర్‌ విజిల్‌లో 4 చుక్కల నూనె వేసి చూడండి.. ఏం జరుగుతుందో తెలిస్తే.. హమ్మయ్యా అనుకుంటారు..

ఈజీగా తక్కువ సమయంలో వంట పూర్తి చేయాలంటే.. పప్పు, మసాలా రైస్‌లు వంటివి ఎక్కువగా కుక్కర్‌లోనే చేస్తుంటారు. అయితే కుక్కర్‌ను ఉపయోగించేటప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుక్కర్‌లో అప్పుడప్పుడు నీళ్లు ఎక్కువ కావటం దాంతో, విజిల్, మూత ద్వారా బయటకు వస్తుంది. దీంతో కుక్కర్ చెడిపోవడమే కాకుండా పొయ్యి చుట్టుముట్టు ప్రాంతమంతా పాడైపోతుంది. ఆ తర్వాత అదంతా శుభ్రం చేయడం కూడా

Kitchen Jugaad: కుక్కర్‌ విజిల్‌లో 4 చుక్కల నూనె వేసి చూడండి.. ఏం జరుగుతుందో తెలిస్తే.. హమ్మయ్యా అనుకుంటారు..
Kitchen Jugaad
Jyothi Gadda
|

Updated on: Jan 27, 2024 | 7:38 PM

Share

Kitchen Jugaad: వంట చేసేటప్పుడు దాదాపుగా అందరూ కిచెన్ జుగాడ్‌ కుక్కర్‌నే ఉపయోగిస్తారు. కుక్కర్‌లో ఆహారాన్ని వండటం వల్ల సమయం ఆదా కావడమే కాకుండా గ్యాస్ కూడా ఆదా అవుతుంది. కుక్కర్‌లో చేసే వంట ఏదైనా సరే త్వరగా ఉడికించేందుకు సహాయపడుతుంది. పప్పు, కూరగాయలు, బంగాళదుంపలతో సహా వివిధ వంటకాలు కుక్కర్‌ను ఉపయోగించి త్వరగా తయారు చేస్తారు. అంతేకాదు..ఈజీగా తక్కువ సమయంలో వంట పూర్తి చేయాలంటే.. పప్పు, మసాలా రైస్‌లు వంటివి ఎక్కువగా కుక్కర్‌లోనే చేస్తుంటారు. అయితే కుక్కర్‌ను ఉపయోగించేటప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుక్కర్‌లో అప్పుడప్పుడు నీళ్లు ఎక్కువ కావటం దాంతో, విజిల్, మూత ద్వారా బయటకు వస్తుంది. దీంతో కుక్కర్ చెడిపోవడమే కాకుండా పొయ్యి చుట్టుముట్టు ప్రాంతమంతా పాడైపోతుంది. ఆ తర్వాత అదంతా శుభ్రం చేయడం కూడా సమయం వృధా అవుతుంది.

అయితే, మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే చింతించకండి.. ప్రతి చిన్న సమస్యకు మా వద్ద పరిష్కారం ఉంది. కుక్కర్ విజిల్ లేదా మూత నుండి నీరు లీక్ అయ్యే సమస్య నుండి బయటపడటానికి యూట్యూబ్‌లో ఒక పరిష్కారం ఉంది. ఈ ట్రిక్ ఉపయోగిస్తే విజిల్ నుండి లేదా కుక్కర్ మూత నుండి నీరు బయటకు రాదు. దానికోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనవసరం లేదు. వంటగదిలో ఒక వస్తువును ఉపయోగించడం ద్వారా మీరు ఈ సమస్యను వదిలించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

అందరి వంటగదుల్లో నూనె తప్పనిసరిగా ఉంటుంది. ఏదైనా నూనె తీసుకుని కుక్కర్ విజిల్‌లో 4 చుక్కల నూనె వేయండి. తర్వాత కుక్కర్ మూతపై ఉన్న నల్లటి రబ్బరు తీసి అక్కడ కూడా నూనె వేయాలి. అప్పుడు మళ్ళీ రబ్బర్‌ తొడిగించండి..ఆ తర్వాత కుక్కర్‌లో పప్పు, అన్నం లేదా మరేదైనా ఆహారం వండుకోవచ్చు. నూనె వేసిన తర్వాత కుక్కర్ విజిల్ లేదా మూత నుండి నీరు బయటకు రాదు.

View this post on Instagram

A post shared by Karnal Plus (@karnalplus)

ఇన్‌స్టాగ్రామ్‌లోని కర్నాల్ ప్లస్ అనే పేజీలో ఈ ట్రిక్ ప్రస్తావించబడింది. ఈ ట్రిక్ ఎలా చేయాలో మీరు వీడియోలో చూడవచ్చు. ఇది పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఈ ట్రిక్ని మీరే ప్రయత్నించండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..