Andhra Pradesh: రెచ్చిపోతున్న సముద్రపు దొంగలు.. వెంటాడి వేటాడుతున్న ఇండియన్ నేవీ

visakhapatnam: నెల క్రితం గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌ సముద్ర జలాల్లో బ్రిటన్‌కు చెందిన యుద్దనౌకపై యెమన్ హౌతీ మిలిటెంట్లు డ్రోన్ తో దాడి చేశారు. దాని నుంచి ఎస్ఓఎస్ మెసేజ్ అందుకున్న భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ విశాఖ హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి బ్రిటన్ నౌకకు అంటుకున్న మంటలను ఆర్పేసి రక్షించిన వైనం ప్రపంచ దేశాల ప్రశంసలు పొందింది. ఆ ఘటన మరువక ముందే తాజా ఘటన లో మరోసారి భారత నౌకా దళం తన పౌరుషాన్ని చూపడం ప్రశంసనీయమైంది.

Andhra Pradesh: రెచ్చిపోతున్న సముద్రపు దొంగలు.. వెంటాడి వేటాడుతున్న ఇండియన్ నేవీ
Indian Navy Ship
Follow us
Eswar Chennupalli

| Edited By: Jyothi Gadda

Updated on: Jan 29, 2024 | 7:32 PM

విశాఖపట్నం, జనవరి 29; అరేబియా మహా సముద్రంలో సముద్రపు దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఇటీవలనే విఫలయత్నం చేసిన సముద్రపు దొంగలు తాజాగా మరోసారి రెచ్చిపోయారు. తాజాగా ఇరాన్‌కు చెందిన ‘ఎంవీ ఇమాన్’ అనే నౌకను హై జాక్ చేశారు సోమాలియా సముద్రపు దొంగలు. అయితే ఆ సమాచారం అందుకున్న ఈ ఫిషింగ్ నౌకను సాహసోపేతంగా వ్యవహరించి కాపాడింది భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్ర.

తీర ప్రాంత గస్తీ లో చురుగ్గా వ్యవహరిస్తున్న ఇండియన్ నేవీ

ఇవి కూడా చదవండి

హైజాక్ విషయాన్ని బాధిత నౌక ఎంవీ ఇమాన్ క్రూ బాహ్య ప్రపంచానికి తెలియచేసిన వెంటనే తీర ప్రాంత గస్తీ విధుల్లో ఉన్న భారత రక్షణశాఖ వెంటనే స్పందించింది. నౌకలోని మొత్తం 17 మంది మత్స్యకారులను కాపాడింది. అరేబియా సముద్రంలో కొచ్చికి పశ్చిమాన 700 నాటికల్ మైళ్ల దూరంలో సోమాలియా సముద్రపు దొంగలు ఈ హైజాక్ కు పాల్పడ్డారు. సముద్రపు దొంగలు ఎంవీ ఇమాన్ నౌకను హైజాక్ చేసిన వెంటనే దాని నుంచి భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్రకు ఎస్ఓఎస్ – సేవ్ ఔర్ షిప్ అంటూ ఒక మెసేజ్ ఒక వచ్చింది. ఈ మెసేజ్ తో అలర్ట్ అయిన భారత యుద్ధనౌక ఐ ఎన్ ఎస్ సుమిత్ర వెంటనే బాధిత నౌక ను లోకేట్ చేసింది. తాను ఉన్న ప్రాంతానికి 100 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నట్టు గుర్తించింది. ఘటనా స్థలం దిశగా వేగంగా వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది.

సముద్రపు దొంగలను తరిమికొట్టి…

తీర ప్రాంతం తో సాయుధ నావికా దళాలు వెంటనే బాధిత నౌక ను చుట్టి ముట్టాయి. వెంటనే సముద్రపు దొంగలను హెచ్చరికలను జారీ చేసింది. వెంటనే ఎం వీ ఇమాన్ నౌక లోకి భారత నౌకా దళం ప్రవేశించింది. భారత నౌకాదళ ప్రకోపాన్ని గుర్తించిన సముద్రపు దొంగలు ఫలాయనం చిత్తగించే మార్గాలు ప్రారంభించారు. కాసేపటికి ఇక భారత సైన్యాన్ని తట్టుకోలేమని భావించి వెనక్కు పారిపోవడానికి సిద్దం అయ్యారు. అలా సముద్రపు దొంగలను తరిమికొట్టి ఇరాన్ ఫిషింగ్ నౌకను రక్షించింది ఐ ఎన్ ఎస్ సుమిత్ర.

ఇటీవల కాలంలో వరుసగా హైజాక్

ప్రత్యేకించి అరేబియా సముద్రంలో దొంగల బెడద ఎక్కువైపోయింది. నెల క్రితం గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌ సముద్ర జలాల్లో బ్రిటన్‌కు చెందిన యుద్దనౌకపై యెమన్ హౌతీ మిలిటెంట్లు డ్రోన్ తో దాడి చేశారు. దాని నుంచి ఎస్ఓఎస్ మెసేజ్ అందుకున్న భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ విశాఖ హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి బ్రిటన్ నౌకకు అంటుకున్న మంటలను ఆర్పేసి రక్షించిన వైనం ప్రపంచ దేశాల ప్రశంసలు పొందింది. ఆ ఘటన మరువక ముందే తాజా ఘటన లో మరోసారి భారత నౌకా దళం తన పౌరుషాన్ని చూపడం ప్రశంసనీయమైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..