Watch Video: ఇలా చేపలు పట్టడం మీరు ఎప్పుడైనా చూసారా?.. ఒక్కోటి ఏరుకుంటూ పోవుడే..!
ఈ వీడియోలో ఒక పిల్లవాడు ఎవరూ ఊహించని టెక్నిక్‌తో చేపలు పట్టుకుంటున్నాడు. అతడు ముందుగా ఒక పెద్ద గిన్నెను తీసుకుని నీళ్లలోకి దిగాడు.. అందులో ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు ఉన్నాయి... వాటిని అతడు ఆ చెరువులో అక్కడక్కడ పెడుతూ పోయాడు... కాసేపటి తర్వాత అతడు తిరిగి ఆ బాటిళ్లను సేకరిస్తున్నాడు.. అంతే.. ఒక్కో బాటిల్‌ను పైకి లేపగానే.. దానికి వేలాడుతూ పెద్ద పెద్ద చేపలు బయటపడుతున్నాయి.. ప్రతి సీసాకు ఒక పెద్ద చేప చిక్కుకుని ఉండటం చూసి అందరూ అవాక్కవుతున్నారు.. ఇంతకీ అతడు చేసిన మ్యాజిక్ ఏంటంటే..
అందరూ సైన్స్ చదువుతారు.. కానీ, చాలా తక్కువ మంది మాత్రమే అవసరమైనప్పుడు దానిని అమలు చేస్తుంటారు.. సరైన సాంకేతికతను సరైన స్థలంలో ఉపయోగిస్తే పని సులువవుతుంది. తెలివైన ఆలోచనలను అలవర్చుకోవడం ద్వారా కష్టమైన పనులను కూడా తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు. ప్రస్తుతం అలాంటి పనిచేసిన ఓ కుర్రాడి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. వీడియోలో బుడ్డొడు చేసిన పనిని చూస్తే మీరు ఖచ్చింగా ఆశ్చర్యపోతారు. వీడియోలో ఒక బాలుడు ఫిషింగ్ కోసం ఒక ప్రత్యేకమైన టెక్నిక్‌ని ప్రయోగించాడు. దాంతో అతడు అతి తక్కువ సమయంలో ఒకేసారి అనేక చేపలను పట్టుకుంటాడు.సొంతం చేసుకోగలిగాడు..అదేలాగే చూసేద్దాం రండి…
ఈ వీడియోలో ఒక పిల్లవాడు ఎవరూ ఊహించని టెక్నిక్‌తో చేపలు పట్టుకుంటున్నాడు. అతడు ముందుగా ఒక పెద్ద గిన్నెను తీసుకుని నీళ్లలోకి దిగాడు.. అందులో ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు ఉన్నాయి… వాటిని అతడు ఆ చెరువులో అక్కడక్కడ పెడుతూ పోయాడు… కాసేపటి తర్వాత అతడు తిరిగి ఆ బాటిళ్లను సేకరిస్తున్నాడు.. అంతే.. ఒక్కో బాటిల్‌ను పైకి లేపగానే.. దానికి వేలాడుతూ పెద్ద పెద్ద చేపలు బయటపడుతున్నాయి.. ప్రతి సీసాకు ఒక పెద్ద చేప చిక్కుకుని ఉండటం చూసి అందరూ అవాక్కవుతున్నారు.. ఇంతకీ అతడు చేసిన మ్యాజిక్ ఏంటంటే..
అయితే, బాలుడు నీళ్లలో వేసిన సీసాలకు చేపలను పట్టుకోవడానికి అవసరమైన గాలాన్ని ఎరతో సహా ఏర్పాటు చేశాడు.. ఆ బాటిల్ మూతలకు చిన్న చిన్న దారంతో చేపలకు కావాల్సిన ఎరను కట్టి ఉంచాడు.. అలా నీటిలో వేసిన ఖాళీ ప్లాస్టిక్ బాటిల్ సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది..కాబట్టి ఆ బాటిల్ నీటిలో మునిగిపోవడానికి బదులుగా, అది తేలుతూ ఉంది. దాని మూతకు కట్టిన ఎరను పట్టుకునే క్రమంలో చేపలు చిక్కుకుపోతాయి.. ప్లాస్టిక్ సీసాలు నీటి పై తేలుతుండటంతో అతడు ఈజీగా ఒక్కొటి ఏరుకుంటూ పోతున్నాడు..వీడియో వైరల్ కావటంతో నెటిజన్లు ముక్కన వేలేసుకుంటున్నారు.. వావ్ చేపలు పట్టడం ఇంత ఈజీగా అనుకుంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Smart fishing🐠🎣
— Tansu Yegen (@TansuYegen) January 21, 2024
ఈ వీడియో X @TansuYegen హ్యాండిల్‌లో షేర్ చేయబడింది. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటి వరకు 7 లక్షల మందికి పైగా చూడగా, వందలాది మంది కామెంట్ చేశారు. ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు – స్మార్ట్ వర్క్ ఎప్పుడూ.. శ్రమను తగ్గిస్తుందని చెబుతున్నారు. ఫిషింగ్‌లో ఇదో అద్భుతమైన, తెలివైన మార్గంగా మరో వినియోగదారు వ్రాశారు. ఇది ఫిషింగ్‌లో కొత్త టెక్నిక్ అంటూ మరొకరు పేర్కొన్నారు. ఇకపోతే, చాలా మంది పిల్లవాడిని స్మార్ట్ కిడ్ అంటూ ప్రశంసిస్తున్నారు. మొత్తానికి వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..