AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఫ్యామిలీ జోక్.. 6 గంటలు పని చేయించుకుని రూ.74 వేల బిల్లు ఎగవేసింది? మీరే న్యాయం చేయండి

యూకేకు చెందిన మార్క్ హాచ్ అనే వ్యక్తికి క్లీన్ మి అనే క్లీనింగ్ వ్యాపారం ఉంది. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే భార్య కూడా ఉద్యోగి కావడంతో వారి ఇంటిని శుభ్రం చేసుకోవడానికి ఇద్దరికీ తీరికలేకుండ ఆపోయింది. భర్త మార్క్‌ ఓ రోజు తన ఇంటిని 6 గంటల పాటు శ్రమించి శుభ్రం చేశాడు. పని పూర్తయిన తర్వాత, భార్య నుంచి ఎలాగైనా బిల్లు రాబట్టాలని అనుకున్నాడు. అంతే.. భార్య జాస్మిన్‌ (34) కి ఇన్‌వాయిస్ మెసేజ్‌ పంపాడు..

Viral News: ఫ్యామిలీ జోక్.. 6 గంటలు పని చేయించుకుని రూ.74 వేల బిల్లు ఎగవేసింది? మీరే న్యాయం చేయండి
UK Man WhatsApp chat
Srilakshmi C
|

Updated on: Jan 30, 2024 | 8:01 AM

Share

యూకేకు చెందిన మార్క్ హాచ్ అనే వ్యక్తికి క్లీన్ మి అనే క్లీనింగ్ వ్యాపారం ఉంది. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే భార్య కూడా ఉద్యోగి కావడంతో వారి ఇంటిని శుభ్రం చేసుకోవడానికి ఇద్దరికీ తీరికలేకుండ ఆపోయింది. భర్త మార్క్‌ ఓ రోజు తన ఇంటిని 6 గంటల పాటు శ్రమించి శుభ్రం చేశాడు. పని పూర్తయిన తర్వాత, భార్య నుంచి ఎలాగైనా బిల్లు రాబట్టాలని అనుకున్నాడు. అంతే.. భార్య జాస్మిన్‌ (34) కి ఇన్‌వాయిస్ మెసేజ్‌ పంపాడు. ఆరు గంటలపాటు ఇంటిని శుభ్రం చేశాను. దయచేసి 700 పౌండ్ల (రూ. 73,955) బిల్లు చెల్లించాలంటూ మెసేజ్‌లో పేర్కొన్నాడు. అయితే దీనిని అతని భార్య పట్టించుకోలేదు. దీంతో నిరాశకు గురైన భర్త మార్క్‌ ఫేస్‌బుక్‌లో తన భార్యపై ఫిర్యాదు చేస్తూ ఇలా రాసుకొచ్చాడు.. ‘బిల్ చెల్లించడానికి నిరాకరించిన కస్టమర్’ అనే క్యాప్షన్‌తో తన గోడంత చెప్పుకొచ్చాడు. గత వారం తనకు దురదృష్టకర సంఘటన జరిగిందని, ఒక కస్టమర్ బిల్లు చెల్లించడానికి నిరాకరించిందని తెలిపాడు. UKలోని ఒక వ్యక్తి

ఒక పెద్ద సోఫా, మూడు బెడ్‌రూమ్ కార్పెట్‌లు, ఒక గదిని.. దాదాపు 6 గంటలపాటు శుభ్రపరిచానని, తన పని తనాన్ని చూసి కస్టమర్‌ కూడా పొంగిపోయిందని రాసుకొచ్చాడు. కానీ తీరా బిల్లు చెల్లించమని కోరితే సదరు నిరాకరించిందని తన బాధను నెటిజన్లతో షేర్‌ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి భార్యకు తాను వాట్సాప్ చాట్‌లో పంపిన ఇన్‌వాయిస్ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశాడు. అందులో ‘హాయ్ జాస్మిన్, నిన్నటి క్లీరింగ్‌ పనికి సంబంధించి మీ చెల్లింపు లింక్‌ను ఈ కింద కనుగొనండి. దయచేసి లింక్‌పై క్లిక్ చేసి, మీకు అనుగుణమైన చెల్లింపు పద్ధతిని ఎంచుకోండి.. అంటూ డబ్బు కోసం భార్యను వేడుకున్నాడు. దీనిని ఆమె పంపించిన రిప్లై చూసి కళ్లు తేలేశాడు.

‘మనకు వివాహమైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు’ అంటూ ప్రత్యుత్తరం ఇచ్చింది. నేను చాలా కష్టపడ్డాను. దాదాపు ఒక పూట అంతా కష్టపడి పనిచేశాను.. అంటూ ఫేస్‌బుక్‌లో తన గోడును చెప్పుకుంటూ భార్యపై ఫిర్యాదు చేశాడు. ఈ భార్యభర్తల సంభాషణ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ‘కస్టమర్‌ భార్యే అనే విషయం పూర్తిగా చదివే వరకు అర్ధం కాలేదు.. అపై నవ్వకుండా ఉండలేకపోయాను’, ‘సో ఫన్నీ’ అంటూ కామెంట్‌ సెక్షన్‌లో జోకులు పేల్చుతున్నారు. ఇక ఈ జంట మధ్య సరదాగా సాగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.