No Liquor Today: మందుబాబులకు బిగ్‌షాక్‌.. నేడు మద్యం దుకాణాలు బంద్!

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో శుక్రవారం మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు బంద్‌ కానున్నాయి. అలాగే మాంసం దుకాణాలు కూడా ఈ రోజు మూతపడనున్నాయి. తిరిగి శనివారం ఇవన్నీ యథావిథిగా తెరుచుకోనున్నాయి. దీంతో మందుబాబులు గురువారం ఉదయం నుంచే లిక్కర్ షాపుల ముందు క్యూలో నిలబడి మరీ మద్యాన్ని కొనుగోలు చేశారు. కాగా జాతీయ సెలవుల సందర్భంగా దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు..

No Liquor Today: మందుబాబులకు బిగ్‌షాక్‌.. నేడు మద్యం దుకాణాలు బంద్!
No Liquor Today
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 26, 2024 | 7:04 AM

న్యూఢిల్లీ, జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో శుక్రవారం మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు బంద్‌ కానున్నాయి. అలాగే మాంసం దుకాణాలు కూడా ఈ రోజు మూతపడనున్నాయి. తిరిగి శనివారం ఇవన్నీ యథావిథిగా తెరుచుకోనున్నాయి. దీంతో మందుబాబులు గురువారం ఉదయం నుంచే లిక్కర్ షాపుల ముందు క్యూలో నిలబడి మరీ మద్యాన్ని కొనుగోలు చేశారు. కాగా జాతీయ సెలవుల సందర్భంగా దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు ‘డ్రై డే’గా ప్రకటిస్తాయన్న సంగతి తెలిసిందే. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరుపుకునే గణతంత్ర దినోత్సవంకూడా డ్రై డే కిందకు వస్తుంది. డ్రై డే అంటే దేశ వ్యాప్తంగా మద్యాం దుకాణాలు, రెస్టారెంట్లు వంటి ఇతర ప్రదేశాలలో మద్యం కొనుగోలు, వినియోగం పూర్తిగా నిషేధంలో ఉంటుంది.

అండమాన్ నికోబార్ ద్వీపం, ఢిల్లీ, జమ్మూ, కాశ్మీర్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఇతర రాష్ట్రాలు జనవరి 26న డ్రై డేగా ప్రకటించబడ్డాయి. ప్రాంతాల వారీగా సంప్రదాయాలు, సంస్కృతులను బట్టి మద్యంపై నిషేదం ఉంటుంది. ఇక బీహార్, గుజరాత్, నాగాలాండ్, మిజోరాం, లక్షద్వీప్ వంటి రాష్ట్రాల్లో మద్యం అధికారికంగా పూర్తి స్థాయిలో నిషేధించిన విషయం తెలిసిందే. మణిపూర్‌లోని కొన్ని జిల్లాల్లో పాక్షికంగా మధ్యంపై నిషేధం ఉంది. స్టాటిస్టా నివేదిక ప్రకారం.. భారత్‌లో మద్యం వినియోగం 2020లో దాదాపు ఐదు బిలియన్ లీటర్లు ఉండగా.. అది 2024 నాటికి దాదాపు 6.21 బిలియన్ లీటర్లకు చేరుకుంటుందని అంచనా.

జనవరి 26న భారతదేశం అంతటా దేశభక్తి ఉప్పొంగుతుంది. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌కు దేశానికి నాయకత్వం వహించనున్నారు. ‘విక్షిత్ భారత్’, ‘భారత్ – లోక్తంత్ర కి మాతృక’ అనే రెండు థీమ్‌లతో ఈ యేట కవాతులో దాదాపు 13,000 మంది మహిళలు పాల్గొననున్నారు. నారీ శక్తిలో వీరంతా పరేడ్‌లో సైనిక కవాతు చేస్తారు. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యం, ఏకత్వాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాటు చేయబడిన ఈ పరేడ్‌కు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.