AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neuralink: సంచలనం.. మనిషి మెదడులో తొలిసారిగా చిప్ అమరిక.. న్యూరోటెక్నాలజీ కీలక ప్రకటన..

ఆధునిక యుగంలో టెక్నాలజీ అత్యంత వేగంగా పెరుగుతోంది. ఈ క్రమంలో నేరుగా మనిషి మెదడు, కంప్యూటర్‌ల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పరచడమే లక్ష్యంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. టెస్లా దిగ్గజం ఎలాన్ మస్క్ సహ వ్యవస్థాపకుడిగా 2016లో స్థాపించిన న్యూరోటెక్నాలజీ కంపెనీ ‘న్యూరాలింక్’ చేపట్టిన కీలకమైన ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యాంశంగా మారింది. మొట్టమొదటిసారిగా ఒక పేషెంట్ మెదడులో న్యూరాలింక్ చిప్‌ను అమర్చినట్లు ఎలాన్ మస్క్ తెలిపారు.

Neuralink: సంచలనం.. మనిషి మెదడులో తొలిసారిగా చిప్ అమరిక.. న్యూరోటెక్నాలజీ కీలక ప్రకటన..
Brain
Shaik Madar Saheb
|

Updated on: Jan 30, 2024 | 8:42 AM

Share

ఆధునిక యుగంలో టెక్నాలజీ అత్యంత వేగంగా పెరుగుతోంది. ఈ క్రమంలో నేరుగా మనిషి మెదడు, కంప్యూటర్‌ల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పరచడమే లక్ష్యంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. టెస్లా దిగ్గజం ఎలాన్ మస్క్ సహ వ్యవస్థాపకుడిగా 2016లో స్థాపించిన న్యూరోటెక్నాలజీ కంపెనీ ‘న్యూరాలింక్’ చేపట్టిన కీలకమైన ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యాంశంగా మారింది. మొట్టమొదటిసారిగా ఒక పేషెంట్ మెదడులో న్యూరాలింక్ చిప్‌ను అమర్చినట్లు ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ ప్రయోగం ఆశాజనక ఫలితాలను కూడా అందిస్తోంటూ.. ఎలాన్ మస్క్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ‘‘సోమవారం మొదటిసారి మనిషి మెదడులో న్యూరాలింక్‌ను అమర్చారు. పేషెంట్ కోలుకుంటున్నాడు. ఆరంభ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. నాడీ కణాలను (న్యూరాన్‌ స్పైక్‌ డిటెక్షన్‌) గుర్తించడం ఖచ్చితంగా కనిపిస్తోంది’’ అని న్యూరాలింక్ సీఈఓ ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.

కాగా.. కంప్యూటర్‌తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకొనే ‘బ్రెయిన్‌ -కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌’ (BCI) ప్రయోగాలకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA) గతేడాది మేలో ఆమోదం తెలిపింది. న్యూరాలింక్‌ చిప్‌ను ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించారు. ఈ సాధనం అత్యంత సురక్షితమైనదని, విశ్వసనీయమైందని న్యూరాలింక్ సంస్థ నిపుణులు చెప్పారు. దీని సాయంతో ఒక కోతి పాంగ్‌ వీడియో గేమ్‌ను ఆడినట్లు కూడా వెల్లడించారు.

కాగా.. మనిషి సామర్థ్యాలను ఉత్తేజం చేయడం, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత వ్యాధులకు చికిత్స ప్రధాన లక్ష్యాలుగా ఈ ప్రయోగం కొనసాగుతోందని సంస్థ పేర్కొంది. మనుషులు, కృత్రిమ మేధస్సు మధ్య సహజీవన సంబంధాన్ని సాధించడం ఒక ఆశయంగా ఉందని గతంలో న్యూరాలింక్ కంపెనీ పేర్కొంది.

5 నాణేల పరిమాణంలో ఉండే చిప్‌ను సర్జరీ ద్వారా మనిషి మెదడులో అమర్చుతారు. ఇది సాంకేతికత ఆధారంగా ఈ చిప్ పనిచేస్తుంది. కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ‘న్యూరాలింక్’ కంపెనీలో 400 కంటే ఎక్కువ మంది నిపుణులు పనిచేస్తున్నారు. కాగా.. ఈ కంపెనీ ప్రయోగాల కోసం ఇప్పటికే 363 మిలియన్ డాలర్ల నిధులు సేకరించి.. ప్రయోగాలను కొనసాగిస్తోంది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..