AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కూలీగా నటిస్తూ.. బైకులతో పరారవుతోన్న పాత నేరస్తుడు! ఏడాదిలో ఏకంగా 20 బైకులు స్వాహా

గత కొంత కాలంగా మెట్రో స్టేషన్లలో పార్కింగ్‌ చేసిన ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న పాత నేరస్తుడిని ఎల్బీనగర్‌ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి రూ.16 లక్షల విలువైన 20 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ..

Hyderabad: కూలీగా నటిస్తూ.. బైకులతో పరారవుతోన్న పాత నేరస్తుడు! ఏడాదిలో ఏకంగా 20 బైకులు స్వాహా
Man Arrested For Stolen 20 Bikes
Srilakshmi C
|

Updated on: Jan 26, 2024 | 8:59 AM

Share

హైదరాబాద్‌, జనవరి26: గత కొంత కాలంగా మెట్రో స్టేషన్లలో పార్కింగ్‌ చేసిన ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న పాత నేరస్తుడిని ఎల్బీనగర్‌ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి రూ.16 లక్షల విలువైన 20 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ ప్రవీణ్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లా కొయ్యవారిపాలెంకు చెందిన పలెపోగు సిద్దయ్య (44) హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ సుభాష్‌నగర్‌లో నివాసముంటున్నాడు. కూలీ పనులు చేస్తూ జీవనం సాగించే అతను జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో పలుచోట్ల పార్కింగ్‌ చేసిన ద్విచక్ర వాహనాలను అపహరించడం మొదలు పెట్టాడు. వాటిని అమ్మి సొమ్ము చేసుకునేవాడు.

ఇలా మర్రిపుడి పీఎస్‌, కొండపి పీఎస్‌, కావలి పీఎస్‌, ఒంగోలు పీఎస్‌, సింగరాయకొండ పీఎస్‌, పొదిలి పీఎస్‌, టంగుటూరు పీఎస్‌, ఒంగోలు పీఎస్‌ పరిధిల్లో 15 బైకులను అపహరించడంతో 2020లో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. జైలు నుంచి వచ్చిన అనంతరం సిద్ధయ్యపై ఏపీలో స్థానికంగా పోలీసులు నిఘా ఉంచారు. దీంతో అతడు హైదరాబాద్‌కు మకాం మార్చాడు. కూలీ పని చేస్తున్నట్లు నటిస్తూ నగరంలోని పలు మెట్రో స్టేషన్లలో పార్కు చేసిన బైకులను అపహరించడం మొదలు పెట్టాడు. పాత బైకుల తాళాలు సులువుగా తీయవచ్చునని గ్రహించిని సిద్ధయ్యా.. ఎక్కువగా పాత బైకులనే ఎంచుకునే వాడు. తాపీగా బైకుల వద్దకు వచ్చి తన వద్ద ఉన్న తాళాలతో బైక్‌లను దొంగిలించేవాడు. ఇలా 2023లో ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్డు, ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్‌ ప్రాంతాల్లో ఐదు బైకులను అపహరించాడు.

ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద పార్కింగ్‌లో బైకును దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తుండగా స్పెషల్‌ టీమ్‌ పోలీసులు సిద్దయ్యను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారించగా నిందితుడు సిద్ధయ్య నేరం అంగీకరించాడు. మొత్తం 20 బైక్‌లను అపహరించినట్లు తెలిపారు. ఎల్బీనగర్‌లో 5 బైకులు, ఉప్పల్‌లో 5 బైకులు, కూకట్‌పల్లిలో 3 బైకులు, మియాపూర్‌లో 2 బైకులు, కేపీహెచ్‌బీలో 1 బైకు, గుంటూరులో 1 బైకును అపహరించినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. మరో 3 బైకుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు నిందితుడు సిద్ధయ్యాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఛీ నువ్వేం కొడుకువు రా..! మద్యం మత్తులో కన్న తండ్రి అని చూడకుండా
ఛీ నువ్వేం కొడుకువు రా..! మద్యం మత్తులో కన్న తండ్రి అని చూడకుండా
అవాంఛిత గర్భధారణకు చెక్.. ఈ మ్యాజిక్ స్టిక్ తో మూడేళ్లు సేఫ్!
అవాంఛిత గర్భధారణకు చెక్.. ఈ మ్యాజిక్ స్టిక్ తో మూడేళ్లు సేఫ్!
డాక్యుమెంట్స్ పోగొట్టిన ఎస్బీఐకు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా
డాక్యుమెంట్స్ పోగొట్టిన ఎస్బీఐకు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా
అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం..
అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం..
వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది..?
వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది..?
సోఫాలు, పడకలున్నా కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?
సోఫాలు, పడకలున్నా కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?
ఆ హీరో ఇంటిముందు వర్షంలో తడుస్తూ రోజంతా నిలబడ్డా..!
ఆ హీరో ఇంటిముందు వర్షంలో తడుస్తూ రోజంతా నిలబడ్డా..!
వెండి గుట్టు విప్పిన నిపుణులు.. గనుల నుంచి మార్కెట్ దాకా ప్రయాణం
వెండి గుట్టు విప్పిన నిపుణులు.. గనుల నుంచి మార్కెట్ దాకా ప్రయాణం
ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే.. మీపై లక్ష్మీ కటాక్షం ఖాయం..!
ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే.. మీపై లక్ష్మీ కటాక్షం ఖాయం..!
ఏం హుషారున్నార్రా సామి.. ఏకంగా కంపెనీకి వెళ్లి వాళ్లకే బురిడీ..
ఏం హుషారున్నార్రా సామి.. ఏకంగా కంపెనీకి వెళ్లి వాళ్లకే బురిడీ..