Pollution: ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ కాలుష్యంతో 24 శాతం మరణాలు.. డబ్ల్యూహెచ్‌వో తాజా నివేదిక
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమోదు అవుతున్న మరణాల్లో 24% పర్యావరణ మార్పుల కారణంగా నే జరుగుతున్నాయి అని డబ్ల్యూహెచ్‌వో అంటోంది. ప్రపంచ వ్యాప్తంగా చనిపోతున్న ప్రతి నలుగురు లో ఒకరు కాలుష్యం కారణంగా నే అని తాజా సర్వే రిపోర్ట్. ఈ పర్యావరణ మార్పులతో ప్రభుత్వాల, ప్రజల వ్యక్తిగత ఆరోగ్య బడ్జెట్ కూడా రెండు మూడు రెట్లు పెరిగిందని తెలిసింది..
పర్యావరణాన్ని కాపాడుకుంటే మన పంచప్రాణాలు సేఫ్ అంటుంది WHO తాజా సర్వే. ప్రకృతిని నాశనం చేయడమే మానవాళికి శాపంగా మారుతుందని తాజా నివేదిక చెబుతుంది. మన ఆయురారోగ్యాలు కాపాడుకోవాలంటే ఇంట్లో, బయట స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణం, మనిషి మనుగడకు సరిపోయే నీళ్లు, ముఖ్యంగా రేడియేషన్ నుంచి రక్షించుకోవడం, శబ్ద కాలుష్యం నియంత్రించడం, సరైన పోషకాహారం, సమతుల్య పర్యావరణం ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. ఇవన్నీ సరిగ్గా లేకపోవడంతోనే పర్యావరణం కలుషితం అవుతుందని ఇలాంటి వాతావరణ మార్పులతో మన జీవితాలు అనారోగ్యాల బారిన పడుతున్నాయని WHO అంటుంది.
పర్యావరణ మార్పుల కారణంగా మరణాలు:
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమోదు అవుతున్న మరణాల్లో 24% పర్యావరణ మార్పుల కారణంగా నే జరుగుతున్నాయి అని డబ్ల్యూహెచ్‌వో అంటోంది. ప్రపంచ వ్యాప్తంగా చనిపోతున్న ప్రతి నలుగురు లో ఒకరు కాలుష్యం కారణంగా నే అని తాజా సర్వే రిపోర్ట్. ఈ పర్యావరణ మార్పులతో ప్రభుత్వాల, ప్రజల వ్యక్తిగత ఆరోగ్య బడ్జెట్ కూడా రెండు మూడు రెట్లు పెరిగిందని తెలిసింది.
శ్వాస సంబంధ వ్యాధులు:
డబ్ల్యూహెచ్ఓ తాజా నివేదిక ప్రకారం.. నీరు పొల్యూట్ అవడం వల్ల మలేరియా లాంటి కేసులో 25 శాతానికి పైగా, పైలేరియా కేసులు దాదాపు 25% వరకు, డెంగీ కేసులు ఐదు శాతం వరకు పెరిగే ప్రమాదం ఉందని.. భూమి లోపల ఉన్న ఇంధనాలు అతిగా వాడటం వల్ల శ్వాస సబంధిత వ్యాధులు 20% పైగా పెరుగుతున్నాయని, డయాబెటిస్, ఆస్తమా, టిబి లాంటి జబ్బులు 25% వరకు పెరిగే ఛాన్స్ ఉందని అంటుంది. దీనితోపాటు సౌండ్ పొల్యూషన్ వల్ల వినికిడి లోపంతో పాటు నాడి సంబంధ సమస్యలు, హార్ట్ డిజీస్ 5% పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది.
మనం పర్యావరణ పొల్యూషన్ ని కంట్రోల్ చేసి… ప్రకృతిని కాపాడుకోగలిగితే మన జీవితాన్ని ఆరోగ్యకరంగా మలుచుకోవచ్చనీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తన నివేదికలో చెప్పింది ఇలా చేస్తే దాదాపు గుండె సంభందిత జబ్బులు 29 శాతం,21శాతం క్యాన్సర్,55 శాతం వరకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్ష్ నీ తగ్గించ వచ్చని అంటుంది డబ్ల్యూపహెచ్‌వో.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి