Kuwait Visa: ఆ షరతును తొలగించిన కువైట్ ప్రభుత్వం.. ఇకపై వారికి గుడ్ న్యూస్..
కువైట్‌ను సందర్శించే వారికి ఆ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 14 వృత్తులకు చెందిన ప్రవాసుల కుటుంబాలకు విజిటర్ వీసా పొందేందుకు మార్గం సులభతరం చేస్తూ కువైట్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశాన్ని సందర్శించాలంటే.. యూనివర్సిటీ డిగ్రీ తప్పని సరి అని గతంలో చేసిన నిబంధనను తొలగించింది. అయితే ఇది అందరికీ కాకుండా కేవలం 14 వృత్తులకు చెందివారికి మాత్రమే మినహాయించబడినట్లు కీలక ప్రకటన చేసింది.
కువైట్‌ను సందర్శించే వారికి ఆ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 14 వృత్తులకు చెందిన ప్రవాసుల కుటుంబాలకు విజిటర్ వీసా పొందేందుకు మార్గం సులభతరం చేస్తూ కువైట్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశాన్ని సందర్శించాలంటే.. యూనివర్సిటీ డిగ్రీ తప్పని సరి అని గతంలో చేసిన నిబంధనను తొలగించింది. అయితే ఇది అందరికీ కాకుండా కేవలం 14 వృత్తులకు చెందివారికి మాత్రమే మినహాయించబడినట్లు కీలక ప్రకటన చేసింది. ఈ విషయాన్ని జనవరి 25, గురువారం, కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. తమ దేశంలోకి ప్రవేశించేందుకు ఎలాంటి యూనివర్సిటీ డిగ్రీ పట్టా అవసరం లేకుండానే సందర్శకుల వీసాల జారీని పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆదివారం, జనవరి 28 నుండి అమలులోకి వస్తుందని తెలిపింది.
సవరించిన ఆర్టికల్ 29 డిపెండెంట్ లేదా ఫ్యామిలీ వీసా దరఖాస్తుదారులకు నెలవారీ జీతం 800 కువైట్ దినార్ తప్పనిసరి అని తెలిపింది. కొన్ని వృత్తులకు డిగ్రీ అవసరం నుండి మినహాయింపు ఉంటుంది. కువైట్‌లో నివసిస్తున్న తల్లిదండ్రులకు, దేశం వెలుపల జన్మించిన వ్యక్తుల వయస్సు ఐదు సంవత్సరాలు మించని వారికి నెలవారీ జీతం నుండి మినహాయింపు ఉందని తెలిపింది.
మినహాయించిన 14 వృత్తులు ఇవే..
- ప్రభుత్వ రంగంలోని సలహాదారులు, న్యాయమూర్తులు, ప్రాసిక్యూటర్లు, నిపుణులు, న్యాయ పరిశోధకులు
- వైద్యులు, ఫార్మసిస్ట్‌లతో సహా వైద్య నిపుణులు.
- విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థల ప్రొఫెసర్లు.
- ప్రభుత్వ రంగంలోని పాఠశాల నిర్వాహకులు, వైస్ ప్రిన్సిపాల్‌లు, విద్యా సలహాదారులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, ప్రయోగశాల సహాయకులు.
- విశ్వవిద్యాలయాలలో ఆర్థిక విషయాలలో ప్రత్యేకత కలిగిన సలహాదారులు
- ఇంజనీర్లు.
- మసీదులలో ఇమామ్‌లుగా, బోధకులుగా, మ్యూజిన్‌లుగా పనిచేస్తున్న వ్యక్తులు.
- ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో లైబ్రేరియన్లు.
- నర్సింగ్ సిబ్బందిలో ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేసే సిబ్బంది, నర్సులు, పారామెడిక్స్, విభిన్న ప్రత్యేకతలలో వైద్య సాంకేతిక స్థానాలను కలిగి ఉన్నవారు, అలాగే సామాజిక సేవా పాత్రల్లో ఉన్న వ్యక్తులు.
- ప్రభుత్వ రంగంలో సామాజిక కార్యకర్తలు, మనస్తత్వవేత్తలు.
- జర్నలిజం, మీడియా కరస్పాండెంట్లలో నిపుణులు.
- ఫెడరేషన్లు, స్పోర్ట్స్ క్లబ్‌లతో అనుబంధించబడిన కోచ్‌లు, క్రీడాకారులు
- పైలట్లు, విమాన సహాయకులు
- మరణించినవారిని సిద్ధం చేయడానికి వారి ఖననాన్ని పర్యవేక్షించడానికి బాధ్యత వహించే వ్యక్తులు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..