Viral News: 100 ఏళ్ల క్రితం వార్తాపత్రికలతో నిర్మించిన ఇల్లు.. గోడలు, ఫర్నీచర్ కూడా కాగితమే! అద్భుతాన్ని చూసేందుకు సందర్శకుల తాకిడి

ఈ ఇల్లు ఒక ప్రయోగం కోసం ఉద్దేశించబడింది. న్యూస్‌ పేపర్లతో తయారు చేసిన ఇల్లు ఎంతకాలం ఉంటుందో చూడాలనుకున్నాడు. ఇది ఎంతకాలం తట్టుకోగలదో గమనించాలని భావించాడు.. 100 ఏళ్ల తర్వాత కూడా న్యూస్‌ పేపర్లతో నిర్మించిన ఈ ఇల్లు చెక్కు చెదరకుండా అలాగే నిలిచి ఉంది. కాబట్టి ఆయన చేసిన ప్రయోగం ఫలితం చూస్తే మీకే తెలుస్తుంది.

Viral News: 100 ఏళ్ల క్రితం వార్తాపత్రికలతో నిర్మించిన ఇల్లు.. గోడలు, ఫర్నీచర్ కూడా కాగితమే! అద్భుతాన్ని చూసేందుకు సందర్శకుల తాకిడి
Newspaper House
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 30, 2024 | 3:34 PM

ప్రపంచంలో సృజనాత్మక వ్యక్తులకు కొరత లేదు. ఒక విషయాన్ని చూసే విధానంలో మనం ఇంకేదో ఆలోచిస్తాము. అవతలి వ్యక్తి మరేదో ఆలోచిస్తాడు. ఈ వ్యత్యాసం మన ఆలోచన, సృజనాత్మకతకు సంబంధించినది. మనకు పనికిరానిదిగా అనిపించే దానిని మరొకరు చాలా భిన్నమైన రీతిలో ఉపయోగించవచ్చు. అలాంటి వారి చేతిలో మనం పనికిరానివిగా విసిరే వస్తువులు అద్భుతంగా మారతాయి. ఉదాహరణకు మీరు పాత వార్తాపత్రికలను ఎక్కువగా నిలువ ఉంటే ఏం చేస్తారు..మార్కెట్లో విక్రయిస్తారు. లేదంటే కొందరు కొన్నింటిని ఇంట్లోని సెల్ఫుల్లో, అల్మారాల్లో వేసుకుంటారు. అలాంటి వార్తాపత్రికలను ఉపయోగించి ఏకంగా ఒక ఇంటిని నిర్మించవచ్చునని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవును నిజమే.. ఒక వ్యక్తి మొత్తం న్యూస్‌ పేపర్లతో ఓ ఇంటిని నిర్మించాడు.. వ్యక్తి గురించి తెలి్త ఈ రోజు మేము మీకు చెప్తాము. ఆ ఇల్లు ఎలా ఉందంటే 100 ఏళ్ల తర్వాత కూడా డబ్బులు చెల్లించి చూసేందుకు జనం వస్తుంటారు.

ఈ ఇల్లు అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఉంది. ఇక్కడ నివసించే మెకానికల్ ఇంజనీర్ అయిన ఆలిస్ స్టెయిన్‌మాన్ తన సృజనాత్మకతను గ్రహించి 1922లో ఈ ఇంటిని నిర్మించారు. ఈ ఇల్లు ఒక ప్రయోగం కోసం ఉద్దేశించబడింది. న్యూస్‌ పేపర్లతో తయారు చేసిన ఇల్లు ఎంతకాలం ఉంటుందో చూడాలనుకున్నాడు. ఇది ఎంతకాలం తట్టుకోగలదో గమనించాలని భావించాడు.. 100 ఏళ్ల తర్వాత కూడా న్యూస్‌ పేపర్లతో నిర్మించిన ఈ ఇల్లు చెక్కు చెదరకుండా అలాగే నిలిచి ఉంది. కాబట్టి ఆయన చేసిన ప్రయోగం ఫలితం చూస్తే మీకే తెలుస్తుంది.

వికీపీడియా ప్రకారం, ఈ ఇంట్లో మొత్తం 100,000 పాత న్యూస్‌ పేపర్లు వార్నిష్ చేసి ఉపయోగించారు. దీని పైకప్పు, గోడలు, ఫ్రేమ్‌లు కూడా వార్తాపత్రికతో తయారు చేశారు. గోడలు అర అంగుళం మందంతో ఉన్నాయి. వార్తాపత్రికలను రోలింగ్ చేయడం, వార్నిష్ వేయడం ద్వారా ఇంటి ఫర్నిచర్ కూడా తయారు చేశారు.. కుర్చీలు, గడియారం, అల్మారాలు, బల్లలు, దీపాలు కూడా న్యూస్‌ పేపర్లతోనే తయారు చేశారు. ఇకపోతే, దీని ఇంటీరియర్ కూడా 1942లో పూర్తయింది. నేటికీ, పేపర్ హౌస్ ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు పర్యాటకుల సందర్శనార్థం తెరిచి ఉంటుంది. ఆసక్తి గల ప్రజలు ఇక్కడకు వచ్చి సందర్శించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..