Watch Video: ఖాకీ యూనిఫామ్‌లో పోలీస్‌ ఔదార్యం.. వీడియో చూసి సెల్యూట్‌ చేస్తున్న నెటిజనం.. ఎందుకంటే..

నేరాలను అరికట్టడం, శాంతిభద్రతలను కాపాడడం పోలీసుల కర్తవ్యం. అయితే ఈ పోలీసు చేసింది మాత్రం తన డ్యూటీకి మించిన పని. మనిషిగా ఈ బాధ్యతను నిర్వర్తించాడు. ఖాకీ యూనిఫాంలో మానవత్వం కురిపించాడు. సోషల్ మీడియాలో వీడియోకు విపరీతమైన ఆదరణ లభించింది. అన్ని ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఆ పోలీస్‌ చేసిన పనేంటి.. అందరూ ఎందుకు అతన్ని ప్రశంసిస్తన్నారో ఇక్కడ తెలుసుకుందాం..

Watch Video: ఖాకీ యూనిఫామ్‌లో పోలీస్‌ ఔదార్యం.. వీడియో చూసి సెల్యూట్‌ చేస్తున్న నెటిజనం.. ఎందుకంటే..
A Policeman
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 30, 2024 | 4:56 PM

కొన్నిసార్లు ఫన్నీ, కొన్నిసార్లు హృదయ విదారక వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. కానీ కొన్ని వీడియోలు గర్వించదగినవి కూడా ఉంటాయి. ప్రస్తుతం, ఒక పోలీసుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా అతనికి సెల్యూట్ చేస్తారు. నేరాలను అరికట్టడం, శాంతిభద్రతలను కాపాడడం పోలీసుల కర్తవ్యం. అయితే ఈ పోలీసు చేసింది మాత్రం తన డ్యూటీకి మించిన పని. మనిషిగా ఈ బాధ్యతను నిర్వర్తించాడు. ఖాకీ యూనిఫాంలో మానవత్వం కురిపించాడు. సోషల్ మీడియాలో వీడియోకు విపరీతమైన ఆదరణ లభించింది. అన్ని ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఆ పోలీస్‌ చేసిన పనేంటి.. అందరూ ఎందుకు అతన్ని ప్రశంసిస్తన్నారో ఇక్కడ తెలుసుకుందాం..

ఈ వీడియోను zindagi.gulzar.h అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వీడియోలో ఒక వ్యక్తి తన రిక్షాలో ఇనుప కడ్డీల లోడ్‌తో బ్రిడ్జి ఎక్కేందుకు ప్రయత్నిస్తు్న్నాడు.. బ్రిడ్జి ఎటవాలుగా ఉన్న కారణంగా హేవీ బరువైన ఐరన్‌ రాడ్స్‌తో బండి లాగడం అతనికి కష్టంగా ఉంది.. అతడు మెల్లగా ఆ రిక్షాను ముందుకు నెడుతున్నాడు.. ఈ దృశ్యాన్ని చూసిన ఒక పోలీసు అధికారి జాలిపడి అతనికి సహాయం చేస్తాడు. ఆ రిక్షా కార్మికుడికి చేయూతగా, వెనుక నుంచి రిక్షాను తోస్తూ.. ముందుకు నడిపాడు. అయితే ఇంత మంచి పని చేసిన పోలీస్‌ ముఖం మాత్రం వీడియోలో కనిపించడం లేదు. కానీ, వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఇప్పటికే 8 లక్షలకు పైగా వీక్షించగా, 31 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోపై ప్రజలు స్పందిస్తూ.. ఈ పోలీసుకు సెల్యూట్ చేస్తున్నారు. మరొకరు మీకు సెల్యూట్ సార్,. మీలాంటి పోలీసులు ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఎలాంటి తప్పు జరగదని అన్నారు. మరొక వినియోగదారుడు స్పందిస్తూ.. యూనిఫాంలో ఉన్న ప్రతి వ్యక్తి ఇలాగే ఉండాలంటున్నారు మరికొందరు నెటిజన్లు. మొత్తానికి వీడియోలో కనిపించే పోలీస్‌ ఆఫీసర్‌ చేసిన పని ప్రజల హృదయాన్ని గెలుచుకుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..