Valentines Day: వాలెంటైన్స్ డేకి టూర్ వెళ్లాలంటే ఇవే బెస్ట్ స్పాట్స్.. బిజీ లైఫ్‌కి దూరంగా..
ఉద్యోగ ఒత్తిళ్లు, ఆర్థిక సమస్యలు, బిజి షెడ్యూల్స్ వల్ల ఎక్కువ సమయం దొరకడం కష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమ పక్షులకు ఓ వరం వాలెంటైన్ వీక్. ఆ సమయంలో మీ ప్రియమైన వారికి సమయం గడపడానికి, మీ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా టూర్ వెళ్లడానికి ప్లాన్ చేస్తే చాలా బావుంటుంది. ఒక వేళ ఈ ఏడాది మీరు అటువంటి ఆలోచనల్లో ఉంటే ఈ కథనం మీకోసమే.

ప్రతి ఒక్కరూ తమ జీవిత భాగస్వామితో లేదా ప్రియమైన వారితో సమయం గడపడానికి ఇష్టపడతారు. అయితే ఉద్యోగ ఒత్తిళ్లు, ఆర్థిక సమస్యలు, బిజి షెడ్యూల్స్ వల్ల ఎక్కువ సమయం దొరకడం కష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమ పక్షులకు ఓ వరం వాలెంటైన్ వీక్. ఆ సమయంలో మీ ప్రియమైన వారికి సమయం గడపడానికి, మీ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా టూర్ వెళ్లడానికి ప్లాన్ చేస్తే చాలా బావుంటుంది. ఒక వేళ ఈ ఏడాది మీరు అటువంటి ఆలోచనల్లో ఉంటే ఈ కథనం మీకోసమే. దీనిలో మన దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన టూరిస్ట్ స్పాట్ లను మీకు పరిచయం చేస్తున్నాం. మీ జీవిత భాగస్వామితో ఏకాంత సమయం గడపడానికి ఈ ప్రాంతాలు చాలా అనువుగా ఉంటాయి.
అలెప్పీ.. ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్ మధ్య మీ భాగస్వామితో గడపడం నిజంగా అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. దక్షిణ భారతదేశంలోని ఉత్తమ హనీమూన్ ప్రదేశాల్లో ఇది ఒకటి. ఈ ప్రదేశం విలాసవంతమైన హౌస్ బోట్ లకు ప్రసిద్ధి చెందింది. అలెప్పీ ప్రాంతానికి కొచ్చిన్ విమానాశ్రయం దగ్గరగా ఉంటుంది. అలాగే అలెప్పీ రైల్వే స్టేషన్ కూడా అందుబాటులో ఉంది.
కుమరకోమ్.. కేరళలోని బ్యాక్ వాటర్ ప్రాంతం ఇది. కూల్, థ్రిల్లింగ్ హౌస్ బోట్ లో సమయం గడుపుతూ బ్యాక్ వాటర్స్ అద్భుత దృశ్యాలను ఆస్వాదించవచ్చు. ఇక్కడి గ్రామాల అందాలు కట్టిపడేస్తాయి. కుమరకోమ్ కు కొచ్చిన్ విమానశ్రయం నుంచి రావొచ్చు. అలాగే కొట్టాయం రైల్వే స్టేషన్ సమీపంలో ఉంటుంది.
కన్యాకుమారి.. దక్షిణ భారత దేశంలో తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రాంతాల్లో ఇదీ ఒకటి. ఇక్కడి బీచ్ లు అద్భుతంగా ఉంటాయి. సూర్యోదయ/సూర్యాస్తమయ సమయాలు వీక్షకులను కట్టిపడేస్తాయి. దీని చుట్టూ మూడు వైపులా సముద్రం ఉంటుంది. లక్ష ద్వీప్ ఇక్కడే ఉంటుంది. త్రివేండ్రం విమానాశ్రయం నుంచి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో కన్యాకుమారి ఉంటుంది. అలాగే కన్యాకుమారి రైల్వే స్టేషన్ కూడా ఉంది. త్రివేండ్రం రైల్వే స్టేషన్ సమీపంలోనే ఉంటుంది. దీని నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ ఉంటుంది.
గోకర్ణం.. గోవాలోని తెల్లని ఇసుక బీచ్ లు ఇక్కడ కూడా ఉంటాయి. యోగా ప్రదేశాలు, దేవాలయాలు, హప్పీ కేఫ్ లు, ఫ్లీ మార్కెట్ కు ఇది ప్రసిద్ధి. ఓ బీచ్, హాఫ్ మూన్ బీచ్, మహా బలేశ్వర్ ఆలయం ఇక్కడ ప్రసిద్ధి. గోవాలోని దబోలిమ్ విమానాశ్రయం నుంచి ఇది దగ్గరగా ఉంటుంది. అంకోలా రైల్వే స్టేషన్ కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. బస్సు, ట్యాక్సీల్లో గోకర్ణంకు చేరుకోవచ్చు.
కొత్తకుప్పం.. తమిళనాడులోని ఒక మంచి టూరిస్ట్ ప్రాంతం ఇది. కొన్ని అందమైన బీచ్ లకు నిలయం. మీ భాగస్వామితో కలసి సందర్శించగలిగే ప్రాంతాలలో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది చైన్నై విమానాశ్రయం నుంచి 124 కిలొమీటర్ల దూరంలో ఉంటుంది. కాట్పాడీ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి 152 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ట్యాక్సీ లేదా బస్సులో కొత్తకుప్పం నకు చేరుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




