Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట వేడుకలో పాల్గొన్న ఇమామ్.. ఫత్వా జారీచేసి క్షమాపణ చెప్పాలని మత పెద్దల డిమాండ్..

దేశ విదేశాల నుంచి మతానికి అతీతంగా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. విదేశాల్లో సైతం రామయ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని వివిధ మాధ్యమాల ద్వారా వీక్షించారు. అయితే అయోధ్యలో జరిగిన బాలరామయ్య  ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న ఓ ఓ ముస్లిం పెద్ద ఇప్పుడు ఫత్వాని ఎదుర్కొంటున్నారు. ఈ వేడుకలో పాల్గొనందున తనపై ఫత్వా జారీ చేశారని ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ తెలిపారు.

Ayodhya: బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట వేడుకలో పాల్గొన్న ఇమామ్.. ఫత్వా జారీచేసి క్షమాపణ చెప్పాలని మత పెద్దల డిమాండ్..
Dr Imam Umer Ahmed Ilyasi
Follow us
Surya Kala

|

Updated on: Jan 30, 2024 | 11:31 AM

ఓ వైపు మతం అనేది మానత్వానికి మించింది కాదు.. రామ్ రహీం ఒక్కడే అంటూ జనవరి 22న బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. దేశ విదేశాల నుంచి మతానికి అతీతంగా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. విదేశాల్లో సైతం రామయ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని వివిధ మాధ్యమాల ద్వారా వీక్షించారు. అయితే అయోధ్యలో జరిగిన బాలరామయ్య  ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న ఓ ముస్లిం పెద్ద ఇప్పుడు ఫత్వాని ఎదుర్కొంటున్నారు. ఈ వేడుకలో పాల్గొనందున తనపై ఫత్వా జారీ చేశారని ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ తెలిపారు.

పిటిఐ విడుదల చేసిన వీడియోలో ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసి మాట్లాడుతూ .. అయోధ్యలో  బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట జరిగిన రోజు నుంచి కొంతమంది  తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని.. చంపేస్తామని తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. దుర్భాషణకు దిగినట్లు చెప్పారు.

ప్రాణ ప్రతిష్ఠాన కార్యక్రమంలో పాల్గొన మని వివిధ సంఘాలకు చెందిన వ్యక్తులకు,  వివిధ రంగాలకు చెందిన వారిని ఇలా సుమారు 8,000 మందికి పైగా ప్రముఖులకు రామజన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలను పంపించింది. ఆహ్వానితుల్లో రామ జన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో పిటిషనర్‌గా వ్యవహరించిన ఇక్బాల్‌ అన్సారీతో పాటు ఇమామ్‌ ఉమర్‌ అహ్మద్‌ ఇల్‌యాసి కూడా ఉన్నారు. అయితే రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ వేడుకకు ఇల్‌యాసి హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

అయితే తనకు సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఫత్వా జారీ చేశాడు. అందులో తన మొబైల్ ఫోన్ నంబర్ పెట్టినట్లు పేర్కొన్నారు.  తనను మతం నుంచి బహిష్కరించాలని అందరు ఇమామ్‌లు, మసీదు అధికారులను కోరారు, ”అని ఇలియాసి చెప్పారు. తాను ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైనందుకు క్షమాపణలు చెప్పాలని.. తన  పదవికి రాజీనామా చేయాలని ఫత్వా సూచించినట్లు ఆయన తెలియజేశారు.

అయితే తాను రామజన్మభూమి ట్రస్ట్ ఆహ్వానం పంపినప్పుడు.. వెళ్లాలా వడ్డాది అనే నిర్ణయం తీసుకోవడానికి  రెండు రోజులు ఆలోచించానని చెప్పారు.  ఎందుకంటే తాను తీసుకునే నిర్ణయం తన జీవితంలో అతి పెద్ద నిర్ణయం అవుతుందని తనకు తెలుసు అంటూ ఇల్‌యాసి  సి హిప్పారు. తాను మత సామరస్యం, దేశం,  జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను, ”అని ఇమామ్ ఇల్‌యాసి చెప్పారు.

తనకు అయోధ్య ప్రజలు ఘన స్వాగతం పలికారని …  తన రాకపట్ల సాధువులు, ప్రముఖులు అందరూ ఎంతో  సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ ట్రస్టు కూడా ఘనస్వాగతం పలికిందని ఇల్యాసి తెలిపారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని.. కనుక క్షమాపణ చెప్పనని స్పష్టం చేశారు. భారతదేశం విశ్వగురు అవ్వడానికి చేస్తున్న ప్రయాణంలో మనం అంతా ఒకటిగా కలిసి నడవాలి.. బలంగా ఉండాలి.. భారత దేశం అందరిదీ.. అంటూ ఇల్‌యాసి చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విశాఖలో పెహల్గాం ఉగ్రదాడి కలకలం.. కాల్పుల్లో చంద్రమౌళి మృతి
విశాఖలో పెహల్గాం ఉగ్రదాడి కలకలం.. కాల్పుల్లో చంద్రమౌళి మృతి
స్పెషల్ సాంగ్స్ చేస్తుంటే నన్ను అలా చూస్తున్నారు..
స్పెషల్ సాంగ్స్ చేస్తుంటే నన్ను అలా చూస్తున్నారు..
పహల్గామ్ దోషులను శిక్షించాల్సిందే: టీమిండియా క్రికెటర్లు
పహల్గామ్ దోషులను శిక్షించాల్సిందే: టీమిండియా క్రికెటర్లు
భర్తని చంపి భార్యని విడిచి ఈ దాడి విషయం మోడీ చెప్పు అన్న ఉగ్రవాది
భర్తని చంపి భార్యని విడిచి ఈ దాడి విషయం మోడీ చెప్పు అన్న ఉగ్రవాది
పహల్గాం ఉగ్రదాడి ఘటనలో కీలక ఆధారం.. అసలా బైక్ ఎవరిదీ?
పహల్గాం ఉగ్రదాడి ఘటనలో కీలక ఆధారం.. అసలా బైక్ ఎవరిదీ?
ఉప్పల్‌లో బ్యాటర్లు vs బౌలర్లు.. పిచ్ రిపోర్ట్ ఎవరికి అనుకూలం?
ఉప్పల్‌లో బ్యాటర్లు vs బౌలర్లు.. పిచ్ రిపోర్ట్ ఎవరికి అనుకూలం?
పహల్గామ్‌ ఉగ్రవాద దాడి పై సెలబ్రెటీల రియాక్షన్
పహల్గామ్‌ ఉగ్రవాద దాడి పై సెలబ్రెటీల రియాక్షన్
ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు.. రాహువు ప్రభావంఏమో
ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు.. రాహువు ప్రభావంఏమో
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్.. ఒక్కరోజే ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య!
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్.. ఒక్కరోజే ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య!
ప్రధాని మోదీ సౌదీ పర్యటన రద్దు..
ప్రధాని మోదీ సౌదీ పర్యటన రద్దు..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..