Google Maps: వామ్మో.. గూగుల్ మాప్స్ చూస్తూ వెళ్లారు.. చివరకు, కారు ఎక్కడికి వెళ్లిందో తెలుసా..
మనం ఏం కావాలన్నా ఇప్పుడు ఫోన్‌నే ఉపయోగిస్తున్నాం. ఇలా అతిగా ఫోన్‌పై ఆధారపడే ఓ వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు.. తాము వెళ్లాల్సిన ప్రాంతానికి గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని కారులో వెళ్తున్న స్నేహితులకు వింత అనుభవం ఎదురైంది. డ్రైవర్ గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ రయ్యిరయ్యిన వెళ్లగా.. అటు వెనక్కి పోలేక.. ఇటు ముందుకు రాలేక కారు అక్కడే చిక్కుకుపోయింది.
మనం ఏం కావాలన్నా ఇప్పుడు ఫోన్‌నే ఉపయోగిస్తున్నాం. ఇలా అతిగా ఫోన్‌పై ఆధారపడే ఓ వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు.. తాము వెళ్లాల్సిన ప్రాంతానికి గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని కారులో వెళ్తున్న స్నేహితులకు వింత అనుభవం ఎదురైంది. డ్రైవర్ గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ రయ్యిరయ్యిన వెళ్లగా.. అటు వెనక్కి పోలేక.. ఇటు ముందుకు రాలేక కారు అక్కడే చిక్కుకుపోయింది. గూగుల్ మాప్స్ సరిగ్గా మార్గాన్ని చూపించకపోవడంతో.. సరిగ్గా ఇళ్ల మధ్యలో ఉన్న మెట్ల మార్గంలోకి కారు వెళ్లి చిక్కుకుపోయింది. దీంతో ముందుకు వెళ్లలేక వెనక్కి రాలేక ఆ కారు అక్కడే ఆగిపోగా.. పోలీసుల సాయంతో బయటపడ్డారు. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. నీలగిరిజిల్లాలోని ఊటీ అందాలు చూడడానికి కర్నాటక వచ్చిన టార్టిస్టులు తమిళనాడు విహారయాత్రకు వెళ్లింది. ఈ క్రమంలోనే కొండ ప్రాంతమైన గూడలూరుకు వెళ్లారు
వీకెండ్ ను ఎంజాయ్ చేసిన స్నేహితులు గూడలూరు నుండి కర్ణాటకకు తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. గూగుల్ మ్యాప్ చూపించిన దారి పట్టుకుంటూ వెళ్లిన ఆ కారు.. చివరకు నీలగిరి ప్రాంతంలోని ఇళ్ల మధ్యకు వెళ్లింది. అక్కడి నుంచి జనం నడుచుకుంటూ వెళ్లే మెట్ల మార్గంలోకి వెళ్లి ఆగిపోయింది. దీంతో డ్రైవర్, ఆ స్నేహితులు ఏం చేయలేక పోలీసులను ఆశ్రయించారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, స్థానికులు.. ఎట్టకేలకు ఆ కారును బయటికి తీసుకురాగలిగారు. ఆ తర్వాత ఆ డ్రైవర్‌కు సరైన రూట్‌ను చూపించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
VIRAL VIDEO | An SUV driver, who was using Google Maps to reach Karnataka, ended up stuck on a flight of stairs with his vehicle in Gudalur, a hill town in Tamil Nadu. The man was driving along with his friends after spending the weekend in the town. pic.twitter.com/zUv5BxuHYl
— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) January 29, 2024
అయితే, తమిళనాడు, కేరళ, కర్ణాటక ట్రై-జంక్షన్ వద్ద ఉన్న గూడలూరుకు తరచుగా ఊటీకి వెళ్లే పర్యాటకులు వస్తుంటారని.. మార్గం కోసం Google Mapsపై ఆధారపడ్డారని.. దీంతో ఇలా జరిగిందని తెలిపారు. Google మ్యాప్స్ మార్గదర్శకాన్ని అనుసరించి, నావిగేషన్ యాప్ వేగవంతమైన మార్గంగా భావించి చిక్కుకుపోయారని.. తర్వాత పోలీస్ క్వార్టర్స్ కు స్నేహితులు వచ్చి సమాచారం ఇవ్వగా కారును మెట్ల మార్గం నుంచి బయటకు తీసుకువచ్చినట్లు తెలిపారు.
కాగా.. అంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భాలున్నాయి. GPS సూచనలను గుడ్డిగా అనుసరించడం వల్ల ప్రమాదకరమైన మార్గాల్లోకి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. GPS సాంకేతికతపై అతిగా ఆధారపడటం అనేది తెలియని పరిసరాలను నావిగేట్ చేయడానికి కీలకమైన ప్రాదేశిక సమాచారాన్ని గుర్తుంచుకునే మన సామర్థ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..